Jump to content

గుంటుపల్లి బౌద్ధ స్థలాలు

అక్షాంశ రేఖాంశాలు: 17°01′08″N 81°07′50″E / 17.0188889°N 81.1305556°E / 17.0188889; 81.1305556
వికీపీడియా నుండి
గుంటుపల్లి బౌద్ధ స్థలాలు
గుంటుపల్లిలో చైత్య ప్రవేశ స్థలం
మతం
అనుబంధంబౌద్ధం
జిల్లాఏలూరు జిల్లా
ప్రదేశం
ప్రదేశంగుంటుపల్లి
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
దేశంభారతదేశం
గుంటుపల్లి బౌద్ధ స్థలాలు is located in ఆంధ్రప్రదేశ్
గుంటుపల్లి బౌద్ధ స్థలాలు
Shown within ఆంధ్రప్రదేశ్
భౌగోళిక అంశాలు17°01′08″N 81°07′50″E / 17.0188889°N 81.1305556°E / 17.0188889; 81.1305556
వాస్తుశాస్త్రం.
శైలిబౌద్ధ గుహలు

గుంటుపల్లి బౌద్ధ స్మారక స్థలాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, కామవరపుకోట సమీపంలో ఉన్నాయి. ఇది ఏలూరు నుండి సుమారు 40 కి.మీ దూరంలో ఉంది. [1] ఈ ప్రదేశం లోని రాతిలో చెక్కిన భాగంలో రెండు బౌద్ధ గుహలు, ఒక చైత్య మందిరం, పెద్ద స్థూపాలు ఉన్నాయి.[2] చైత్య హాలులో చెక్క నిర్మాణాన్ని ప్రతిబింబించేల రాతిలో చెక్కిన అరుదైన ప్రవేశ ద్వారం ఉంది. ఇది లోమాస్ రిషి గుహలో దాని సరళమైన వెర్షన్. [3]

ఇక్కడ ఇటుక, రాతి నిర్మాణాల అవశేషాలు ఉన్నాయి. ఇటుకతో చేసిన రెండు విహారాల అవశేషాలు, అలాగే రెండు లోతులలో తవ్విన గుహలు ఉన్నాయి. ఇందులో అసాధారణమైన చైత్య మందిరం (భూమి పైన నిర్మించబడింది) కూడా ఉంది. ప్రధానంగా ఇది రాతి స్థూపం. దాని చుట్టూ ప్రదక్షిణ చేసేలా మార్గం ఉంది. అవి సా.పూ. 200-0 నాటివి కాగా, కొన్ని శిల్పాలను తరువాతి కాలంలో చేర్చారు. భూమి పైన ఉన్న ప్రధాన భవనం ఒక రాతి స్థూపం చుట్టూ, ఇటుకతో నిర్మించారు. దాని ముందు టెర్రస్‌పై 30 పైచిలుకు ఇటుకలతో నిర్మించిన చిన్నచిన్న స్థూపాలు ఉన్నాయి. మరో రెండు భవనాల శిథిలాలు కూడా అక్కడా ఉన్నాయి. [4]

త్రవ్వకాలలో, మూడు అవశేషాల పేటికలను కనుగొన్నారు.[2] ఈ పేటికలలో బంగారం, వెండి, క్రిస్టల్ పూసలు వంటి అనేక విలువైన వస్తువులున్నాయి. పద్మపాణి కాంస్య చిత్రం ఒకటి పేటికలో కనిపించింది. పేటికపై ఒక శాసనం దేవనాగరి లిపిలో ఉంది. ఇది సా.శ. 9 నుండి 10 వ శతాబ్దం మధ్య కాలానికి చెందినదిగా తెలుస్తోంది.[2]

చిత్రమాలిక

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. Tourism Department. "Guntupalli Caves". Tourism Department, Hyderabad, Andhra Pradesh, India. Retrieved 29 November 2013.
  2. 2.0 2.1 2.2 Ahir, D. C. (2003). Buddhist Sites and Shrines in India : History, Art, and Architecture (1. ed.). Delhi: Sri Satguru Publ. p. 30. ISBN 8170307740. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Ahir" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. Michell, 368; ASI
  4. ASI; Michell, 368

మూలాలు

[మార్చు]