Jump to content

ముసునూరు

అక్షాంశ రేఖాంశాలు: 16°49′40.188″N 80°56′4.632″E / 16.82783000°N 80.93462000°E / 16.82783000; 80.93462000
వికీపీడియా నుండి
ముసునూరు
దేవినేని మాణిక్యం, దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు
దేవినేని మాణిక్యం, దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు
పటం
ముసునూరు is located in ఆంధ్రప్రదేశ్
ముసునూరు
ముసునూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°49′40.188″N 80°56′4.632″E / 16.82783000°N 80.93462000°E / 16.82783000; 80.93462000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
మండలంముసునూరు
విస్తీర్ణం22.06 కి.మీ2 (8.52 చ. మై)
జనాభా
 (2011)
6,095
 • జనసాంద్రత280/కి.మీ2 (720/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,883
 • స్త్రీలు3,212
 • లింగ నిష్పత్తి1,114
 • నివాసాలు1,495
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521207
2011 జనగణన కోడ్589040

నెల్లూరు జిల్లా, కావలి మండలంలోని ఇదేపేరున్న మరొక గ్రామం కోసం ముసునూరు (కావలి మండలం) చూడండి.

ముసునూరు, ఏలూరు జిల్లా, ముసునూరు మండలం లోని గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1495 ఇళ్లతో, 6095 జనాభాతో 2206 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2883, ఆడవారి సంఖ్య 3212. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1885 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 70. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589040[2].ఇది సముద్రమట్టానికి 16 మీ.ఎత్తులో ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

ముసునూరి కమ్మరాజులు ఈ గ్రామం నకు చెందినవారు. కాకతీయ సామ్రాజ్యం తరువాత మహమ్మదీయులను తరిమి తెలుగు నేలను పాలించారు.

సమీప గ్రామాలు

[మార్చు]

యెల్లాపురం 5 కి.మీ, చెక్కపల్లి 5 కి.మీ, వలసపల్లి 5 కి.మీ, కాట్రేనిపాడు 6 కి.మీ, గుళ్ళపూడి 6 కి.మీ

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ముసునూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. ధర్మాజీగూడెం, విజయరాయి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 55కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల నూజివీడులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నూజివీడులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

  • దేవినేని మాణిక్యం, దాసరి వెంకటసుబ్బయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ముసునూరు
  • బాలికల గురుకుల పాఠశాల:- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న పి.వి.ఎన్.ఎస్.రమ్యశ్రీ అను విద్యార్థిని, అండర్-17 విభాగంలో, జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనది. జనవరి/2015 లో అనంతపురంలో నిర్వహించే జాతీయస్థాయి కబడ్డీ పోటీలలో ఈమె పాల్గొంటుంది.
  • ఎ.పి. రెసిడెన్షియల్ స్కూల్.
  • భారతి విద్యానికేతన్.
  • ఎస్.ఎస్.ఎన్. ఇంగ్లీషు మీడియం ప్రాథమికోన్నత పాఠశాల, ముసునూరు

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ముసునూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ముసునూరులోని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జాతీయస్థాయిలో నాణ్యతా ప్రమాణాల గుర్తింపు పొందినది. ఈ ప్రమాణపత్రాలను కలెక్టరు శ్రీ ఇంతియాజ్, జె.సి.శ్రీ ఎల్.శివశంకర్‌లు, 22-9-2020 న, వైద్యాధికారి శ్రీ జగన్‌మోహన్‌కు అందజేసినారు. ఈ గుర్తింపు పొందినందుకు, ఈ ఆరోగ్య కేంద్రానికి, మూడు సంవత్సరాలపాటు వరుసగా, సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించును. ఇంతవరకు జిల్లాలోని ఏడు అసుపత్రులకు ఈ గుర్తింపు ప్రమాణపత్రాలను అందజేసినారు. [9]

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

[మార్చు]

బ్యాంకులు

[మార్చు]

ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

భూగర్భజలాలే ముఖ్యమైన నీటివనరు. నాగార్జున సాగర్ కాలువ ఒకటి ఈ గ్రామం వ్యవసాయానికి నిర్మించారు గాని దానిద్వారా నీరు సరిగా అందడంలేదు. నగరాల చెరువు, పెద్ద చెరువు, చిన్న చెరువు, నెలపాటి కుంట, ముత్తనబోయిన కుంట.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

ముసునూరు ఇంటి పేరుతో ప్రసిద్ధులు

[మార్చు]

ముసునూరి లలిత్ బాబు:- చదరంగంలో, ఇతడు ఆంధ్రప్రదేశ్ నుండి నాల్గవ గ్రాండ్ మాస్టర్. భారతదేశంలో 26వ గ్రాండ్ మాస్టర్.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఈ గ్రామంలో 7.25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఘనవ్యర్ధాల కేంద్రాన్ని, 2017,మార్చ్-25న ప్రారంభించారు. ఆరువేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి ఇంటికీ రెండు బుట్టలను ఇచ్చి, తడి చెత్త, పొడిచెత్త, వేరువేరుగా సేకరించి, ప్రత్యేకంగా నియమించిన సిబ్బంది రిక్షాలద్వారా ఈ కేంద్రానికి తీసికొని వచ్చెదరు. ఈ కేంద్రంలో ఆ చెత్తను వర్మీ కంపోస్టు ఎరువులు తయారుచేసి, రైతులకు విక్రయించెదరు. ఆ విధంగా ఈ కేంద్రం ద్వారా గ్రామం, స్వచ్ఛతతోపాటు, ఆర్థిక వనరులను గూడా ఏర్పరచుకోగలదు.

గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 5912 అందులో పురుషులు 2829 మందికాగా,స్త్రీలు 3083 మంది ఉన్నారు.గ్రామంలో 1361 గృహాలు ఉన్నాయి. గ్రామం 2206 హెక్టార్లలో విస్తరించి ఉంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో రేగుల గోపాలకృష్ణ సర్పంచిగా 850 ఓట్లఆధిక్యంతో గెలుపొందాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ వేంకటాచలస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణం, 2015,మార్చ్-4వ తేదీ, బుధవారంనాడు, అంగరంగవైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి ముందు ఎదురుకోలు ఉత్సవం అందరినీ ఆకట్టుకున్నది. పెళ్ళికుమారుడైన వెంకటాచలస్వామివారి తరఫున దేవినేని వంశీయులు, పెళ్ళి కుమార్తె శ్రీదేవి అమ్మవారి తరఫున చలసాని, రేగుల, అట్లూరి వంశీయులు చేరి, ఒకరినొకరు సరసాలు ఆడుకుంటూ పెళ్ళికుమారుడిని, కల్యాణమండపానికి ఆహ్వానం పలికే ఘట్టం ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నది. గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా తిలకించారు. అనంతరం ప్రధాన అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గురువారం ఉదయం, ప్రత్యేకపూజల అనంతరం, విష్ణుసహస్రనామ పారాయణం, అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ముసునూరు కోలాటసమాజం వారు, కోలాటం నిర్వహించారు. స్వామివారిని ట్రాక్టరుపై గ్రామంలోని అన్ని వీధులలోనూ ఊరేగించారు. [6]

శ్రీ కోదండరామాలయం ఆలయం

[మార్చు]

స్థానిక పడమటి వీధిలోని ఈ ఆలయంలో 2017,మార్చ్-18వతేదీ శనివారంనాడు స్వామివారికి వార్షిక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అభిషేకాలు అనంతరం స్వామివారి కళ్యాణ వేడుకలు నిర్వహించారు. సాయంత్రం కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలకై, 17వతేదీ శుక్రవారంనాడు, అలయాన్ని రంరంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. శుక్రవారం నుండియే ఆలయంలో భక్తుల సందడి ప్రారంభమైనది. [7]

శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

స్థానిక బి.సి.కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 800 కిలోల బరువైన శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా, 2014, ఆగస్టు-20 బుధవారం నాడు, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. 21వ తేదీ గురువారం నాడు ఉదయం 9-15 గంటలకు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, కన్నులపండువగా నిర్వహించారు. [4] & [5]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం

[మార్చు]

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 9 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ముసునూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 209 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 148 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 15 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 27 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 330 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 328 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1147 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 538 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 937 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ముసునూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 937 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ముసునూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

ఈ గ్రామంలో వరి, పుగాకు, మామిడి ప్రధానమైన పంటలు. ఇంకా కొబ్బరి, కూరగాయలు, పండ్లతోటలు, పామాయిల్ వ్యసాయం కూడా జరుగుతుంది.

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ముసునూరు&oldid=4305211" నుండి వెలికితీశారు