Jump to content

కావలి

అక్షాంశ రేఖాంశాలు: 14°54′44″N 79°59′40″E / 14.91228°N 79.99437°E / 14.91228; 79.99437
వికీపీడియా నుండి
పట్టణం
పటం
Coordinates: 14°54′44″N 79°59′40″E / 14.91228°N 79.99437°E / 14.91228; 79.99437
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలంకావలి మండలం
విస్తీర్ణం
 • మొత్తం61.09 కి.మీ2 (23.59 చ. మై)
జనాభా
 (2011)[2][1]
 • మొత్తం90,099
 • జనసాంద్రత1,500/కి.మీ2 (3,800/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1006
ప్రాంతపు కోడ్+91 ( 8626 Edit this on Wikidata )
పిన్(PIN)524201 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata

కావలి,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పట్టణం. ఇది ప్రముఖ విద్యా, వస్త్ర వ్యాపారకేంద్రం. గ్రేడ్ 1 మున్సిపాలిటీ.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

పూర్వం విజయనగర రాజుల పాలనలో కావలి గ్రామం, రక్షకభటులకు నిలయంగా ఉండేది. వీరి కావలి గాచిన ప్రదేశం కావడం వలననే కాలక్రమేణా "కావలి"గా వాడుకలోనికి వచ్చింది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహరరాయలు, మహమ్మదీయుల నుండి ఉదయగిరి దుర్గాన్ని వశంచేసుకొన్నాడు. అప్పట్లో శత్రువుల నుండి రక్షణ కోసం, నాలుగు బాటలు కలిసే కూడళ్ళలో రక్షక భటులను కాపలాగా ఉంచేవారు. అలా ఉంచిన ఈ ప్రాంతానికి "కావలి" పేరు స్థిరపడిపోయింది.

ఇంకో కథనం ప్రకారం, పూర్వం రహదారిమార్గాలు లేక కావలి తీరప్రాంతం గుండా రాకపోకలు ఎక్కువగా సాగేవి. సముద్రతీరంలో దిగుమతి అయ్యే సరుకులను, డొంకదారుల గుండా, ఇతర ప్రాంతాలకు తరలించేవారు. అయితే అప్పట్లో దొంగల బెడద ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు భీతిల్లేవారు. అందువలన, తమతమ సరకుల భద్రతకోసం, సాయుధులైన కాపలాదారులను నియమించేవారు. ఆలా కావలిలో కాపలాదారులు నివాసం ఏర్పాటుచేసుకోవడంతో, ఈ ప్రాంతాన్ని "కావలి" అని పిలిచేవారని ప్రతీతి. అటు వ్యాపారులకు, ఇటు ప్రజలకు తోడుగా కావలివారు ఉంటూ రక్షకభటుల సేవలందించేవారు. కాలక్రమేణా కాపలాదారులు అవసరం లేకపోయినా, వారిపేరు మీద "కావలి" అనే పేరు ఏర్పడింది.[3]

చరిత్ర

[మార్చు]
కావలి పట్టణం
కావలి పట్టణం

1950 ప్రాంతంలో మరల జరిగిన సర్వేలో కావలి రెవెన్యూ గ్రామాన్ని (పట్టణాన్ని) రెండు బిట్ లుగా విభజించారు. కావలికి ఉత్తరాన ఉన్న సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలనుండి, తుమ్మల పెంట రోడ్ వరకు ఉన్న భాగాన్ని బిట్-1 గా, తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంవైపు ఉన్న ప్రదేశాలను అనగా కసాయి వీధి మొదులుకుని, మాల పాళెం, మాదిగ పాళెం, రామమూర్తి పేట, కచ్చేరిమిట్ట, వెంగళరావు నగర్, శాంతినగర్ వరకు బిట్-2 గా విభజించారు. ఆ రోజుల్లో ఈ రెండు బిట్ లకి వేరువేరుగా కరణం, మునసబు ఉండేవారు. ఇప్పుడు ఆ రెండు పదవులని కలిపి ముందు వి.ఏ.ఒ (village Administration Officer) గా తర్వాత వి.ఆర్.ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) గా చేసిన తరువాత ఈ రెండు బిట్లకి వేరువేరు వి.ఆర్.ఒ.లు ఉన్నారు. సుమారుగా 2012 ప్రాంతంలో కావలి రెవెన్యూ గ్రామాన్ని నాలుగు బిట్ లుగా తిరిగి విభజించారు. వీటికి నలుగురు తహసీల్దారులున్నారు.

కావలి ప్రకాశం జిల్లాకు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి తెలుగు భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావాలిలో పెద్ద హోల్సేల్ వస్త్ర వ్యాపారం విజయవంతంగా సాగుతుంది. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, కోర్టులు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్ (పాత బోర్డ్ ఉన్నత పాఠశాల). అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

కావలికి తూర్పు వైపున సముద్రము 7 కి.మీ. దూరంలో ఉంది.కొత్తసత్రం, తుమ్మలపెంట ప్రముఖ బీచ్ లు. తుమ్మల పెంట బీచ్ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది.

జనగణన వివరాలు

[మార్చు]

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పోరేషన్ (నగరం) తర్వాత మొదటి అతి పెద్ద పట్టణం. జనాభా సుమారు లక్షా ఇరవై వేలు. వారిలో పురుషులు 52%, స్ట్రీలు 48%. వారిలో అక్షరాస్యత శాతం 72% ఇది జాతీయ నిష్పత్తి 59.5 కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత శాతం 78%, స్త్రీల 65%. కావలి జనాభాలో 10% మంది 6 సంవత్సరాలలోపువారే. ఇతరాలు:నెల్లూరు జిల్లా కేంద్రంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం, నెల్లూరు తర్వాత కావలియే. దాదాపుగా 15 మసీదులు కావలి పట్టణంలో నెలకొని ఉన్నాయి .ఇక్కడి ముస్లింల ప్రధాన మాతృభాష దక్కని ఉర్దూ. ఉర్దూ తమ మాతృభాష అయినప్పటికీ కూడా ముస్లింలు తెలుగు భాషను తమ మాతృ భాష గానే భావిస్తారు వారి సంస్కృతి సంప్రదాయాలలో తెలుగు భాషను విడదీసి మనం చూడటం సాధ్యం కాదు. ఎక్కువమంది ముస్లింలు చేతివృత్తులు చేసుకుంటూ, బైక్, స్కూటర్ కార్ మెకానిక్ షెడ్లలో పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే విద్యావంతులు, ఉన్నత విద్యను అభ్యసించినటువంటి గ్రాడ్యుయేట్లు కూడా కావలిలో ఎక్కువగానే ఉన్నారు. ఇచ్చటి ముస్లింలు ఇతర మతాల వారితో సామరస్యకమైనటువంటి సోదర భావాన్ని కలిగి ఉంటారు రంజాన్ బక్రీద్ లాంటి పండుగలు వచ్చినప్పుడు స్థానిక హిందూ క్రైస్తవ సోదరులతో పండుగ సెలబ్రేషన్స్ చేసుకుంటారు

పరిపాలన

[మార్చు]

కావలి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రహదారి మార్గము

[మార్చు]

చెన్నై - కలకత్తా NH-16 జాతీయ రహదారికి సమీపంలో, నెల్లూరు - ఒంగోలు పట్టణాల మధ్య ఉంది.

రైలు మార్గము

[మార్చు]

చెన్నై - కలకత్తా రైలుమార్గంలో గూడూరు-విజయవాడ జంక్షనుల మధ్య, దేశంలోనే రద్దీ అయిన రైలు మార్గములో ఉన్న ఒక ప్రధాన స్టేషను.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

కావలిలో 5 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి.పదుల సంఖ్యలో డిగ్రీ, ఇంటర్ కాలేజ్ లు వున్నాయ్...

అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, హైస్కూల్స్ వున్నాయ్

ప్రార్థనాలయాలు

*సున్నత్ జమాత్ మసీదు, జెండావీధి

కళా రంగం

[మార్చు]

కావలి కళలకి, కళాభిమానానికి పెట్టింది పేరు. నాటకాలు, నాటికలు, సినిమా అభిమానం కావాలి పట్టణ ప్రజలకి మొదటినించి ఎక్కువే. కావలిలో ఆరు సినిమా హాళ్లు, పండగలకి నాటక ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. LV కృష్ణ రెడ్డి వంటి నాటక దిగ్గజాలు కావాలి వారే. సంక్రాంతి పండుగకి నాటక ప్రదర్శన ఇప్పటికి ఒక ప్రఖ్యాత విశేషమే. జవహర్ భారతి కళాశాల లోని ఓపెన్ ఎయిర్ థియేటర్ కి గొప్ప చరిత్ర ఉంది.

ఆర్ధిక స్థితిగతులు

[మార్చు]

ఇది జిల్లాలో ఒక ముఖ్య వస్త్రవ్యాపార కేంద్రం. (కందుకూరి ఫ్యాషన్స్ అనే రెడీమేడ్ వస్త్ర సంస్థ ఇక్కడిదే)

రియల్ ఎస్టేట్, రొయ్యలు చేపల సాగు, ఆహార రంగం వేగంగా అభివృద్ధి చెందాయి

వరి పండే పచ్చని మాగాణి వ్యవసాయరంగానికి అనుకూలం

దేవాలయాలు

[మార్చు]
  1. కావలి గ్రామ దేవత కళుగోళశాంభవి ఈ దేవతకు కావలి, అల్లూరు, సర్వాయపాళెంలలో మాత్రమే ఆలయాలు ఉన్నాయి.
  2. పురాతనమైన బ్రమరాంబా సమేత మల్లీశ్వరాలయం
  3. లక్ష్మీకాంత స్వామి ఆలయం, అందులోనే అతి పురాతన దక్షిణాభిముఖ ఆంజనేయ ఆలయము ఉన్నాయి.
  4. శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం, మద్దూరుపాడు.
  5. పాతూరు లోని విష్ణాలయం
  6. పాతూరు లోని శివాలయం

చిత్రమాల

[మార్చు]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. http://www.census2011.co.in/data/town/802990-kavali.html. {{cite web}}: Missing or empty |title= (help)
  3. ఈనాడు నెల్లూరు; 2014,జూన్-16; 4వ పేజీ.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కావలి&oldid=4306828" నుండి వెలికితీశారు