అనుమసముద్రంపేట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అనుమసముద్రంపేట
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో అనుమసముద్రంపేట మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో అనుమసముద్రంపేట మండలం యొక్క స్థానము
అనుమసముద్రంపేట is located in ఆంధ్ర ప్రదేశ్
అనుమసముద్రంపేట
ఆంధ్రప్రదేశ్ పటములో అనుమసముద్రంపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°42′00″N 79°41′00″E / 14.7000°N 79.6833°E / 14.7000; 79.6833
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము అనుమసముద్రంపేట
గ్రామాలు 23
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 32,680
 - పురుషులు 16,455
 - స్త్రీలు 16,226
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.43%
 - పురుషులు 71.35%
 - స్త్రీలు 45.33%
పిన్ కోడ్ 524304
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం అనుమసముద్రంపేట
ప్రభుత్వము
 - సర్పంచి సందాని పాషా
పిన్ కోడ్ 524304
ఎస్.టి.డి కోడ్ 08627

అనుమసముద్రంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము.

దొరసానమ్మ దర్గా[మార్చు]

సయ్యద్ ఖాజా రహంతుల్లా భార్య హబీబా ఖాతూన్ (దొరసానమ్మ) పేరిట ఇక్కడ ఒక దర్గా ఉంది. కర్నూలు నవాబ్‌ కుమార్తె అయిన హబీబా (దొరసానమ్మ) పెళ్ళి వయస్సు వచ్చేలోపే ఖురాన్‌ను పూర్తిగా చదివి చిన్న వయస్సులోనే ముస్లీం పెద్దల ప్రసంశలను అందుకున్నారు. ఓ రోజు ఆమె స్వప్నంలో ఓ సాదుపుంగవుడు ప్రత్యక్షమైనట్లు, ఆయన్ను వివాహం చేసుకున్నట్లు కల కన్నది. ఆ కలను తల్లికి వివరించింది. ఈ విషయాన్ని హబీబా తల్లి కర్నూలు నవాబ్‌కు వివరించడంతో ఆయన అంగీకరించలేదు. పెద్దలు చెప్పిన నిర్ణయం మేరకే ఉండాలని నవాబ్‌ బీష్మించడంతో నాడే హబీబా చింతాకాంతురాలైంది. ఓ రోజు తల్లిదండ్రులతో కర్నూలు నవాబ్‌ మసీదు వద్ద ప్రార్థనలు చేస్తూ తన కోరిక ఫలించాలంటూ స్వప్నంలో ప్రత్యక్షమైన వ్యక్తినే వివాహమాడాలని ప్రార్థించింది. అప్పటికప్పుడే ఆమె స్పృహ తప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ సమయంలో హబీబా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. భక్తుల కోర్కెలు తీర్చడంలో పేరు పొందిన హజరత్‌ నాయబ్‌ రసూల్‌ అక్కడికి వచ్చి హబీబాను ప్రమాదం నుంచి కాపాడాడు.

దీంతో కర్నూలు నవాబ్‌ అంగరంగవైభవంగా హబీబాను నాయబ్స్రూల్‌కు ఇచ్చి వివాహం చేశారు. నాటి నుంచి ఎంతో మంది భక్తులకు సేవలందిస్తూ, వారి కోర్కెలను తీరుస్తూ ఉండేవారు. 1781లో రబీబుల్‌ అన్వర్‌ నెల 26న నాయబ్స్రూల్‌ మృతి చెందారు. దీంతో ఆయన సమాధిని ఏఎస్‌పేట వద్ద శ్రీ హజరత్‌నాయబ్స్రూల్‌ దర్గాగా నిర్మించి నిత్య ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. 1798లో రబీబుల్‌ అన్వర్‌ నెల 7వ తేదీన హబీబా ఖాతూన్‌ (దొరసానమ్మ) మృతి చెందారు. నాయబ్స్రూల్‌ సతీమణి హబీబా ఖాతూన్‌ చిన్ననాటి నుంచే భక్తిపారవశ్యంగా మంచి పేరుగడించి నాయబ్స్రూల్‌ను వివాహం చేసుకుని మంచి వరాలిచ్చే కల్పవల్లిగా నామకరణ చెందింది.

మూలాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనాభా 4280
  • పురుషుల సంఖ్య 2118
  • స్త్రీల సంఖ్య 2162
  • నివాసగృహాలు 1038
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప మండలాలు[మార్చు]

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 524304
  • ఎస్.టీ.డీ.కోడ్: 08627
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:AP26

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామాలు[మార్చు]