కలిగిరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కలిగిరి
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో కలిగిరి మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో కలిగిరి మండలం యొక్క స్థానము
కలిగిరి is located in ఆంధ్ర ప్రదేశ్
కలిగిరి
ఆంధ్రప్రదేశ్ పటములో కలిగిరి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°50′00″N 79°42′00″E / 14.8333°N 79.7000°E / 14.8333; 79.7000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము కలిగిరి
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 40,589
 - పురుషులు 20,352
 - స్త్రీలు 20,237
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.25%
 - పురుషులు 71.18%
 - స్త్రీలు 45.32%
పిన్ కోడ్ 524224
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కలిగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 224 ., ఎస్.టి.డి.కోడ్ = 08626.

 • కలిగిరిలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో, 2014,మార్చి-8,శనివారం నాడు, ఉదయం 10-53 గంటలకు, విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. 4 రోజులపాటు, గోవిందనామస్మరణ, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, బాజాభజంత్రీలు, అశేష జనవాహిని నడుమ, నూతన బింబ, కలశ ప్రతిష్ఠాపన, విగ్రహ ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీ బొల్లినేని వెంకటరామారావు, స్వరూపరాణి దంపతులు, ఈ ఆలయ నిర్మాణ కర్తలు. ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలకు, జిల్లా నలుమూలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం చేశారు. [2]
 • ఈ గ్రామానికి చెందిన శ్రీ గుంపర్లపాటి రమేశ్ ఆటో నడుపుచూ జీవనం సాగించుచున్నారు. ఈయన భార్య లక్ష్మీప్రసన్న ఒక సాధారణ కూలీ. వీరి కుమార్తె సంధ్య, 2012 నుండి కరాటే నేర్చుకొని అందులో తన ప్రతిభ చూపుచున్నది. ఈ విద్యలో అద్భుత ప్రదర్శనలిచ్చుచున్నది. 9 సం. విభాగంలో, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈ విభాగంలో మన రాష్ట్రం నుండి ఎంపికైన బాలిక ఈమె ఒక్కతే. పేదింట మెరిసిన ఈ ఆణిముత్యం, అంతర్జాతీయ స్థాయిలో గూడా రాణింంచుచున్నది. తాజాగా ఈమె వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గూడా స్థానం సంపాదించింది. వారి ప్రశంసా పత్రాన్ని డిసెంబరు-28,2013న అందుకున్నది. [1]

గ్రామ నామ వివరణ[మార్చు]

కలిగిరి అనే గ్రామనామం కలి అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. కలి అన్న పదం వృక్షసూచి.[1]

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 7016
 • పురుషుల సంఖ్య 3615
 • స్త్రీల సంఖ్య 3401
 • నివాసగృహాలు 1588
 • విస్తీర్ణం 2466 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

ఎపినాపి 5కి.మీ

సమీప మండలాలు[మార్చు]

కోడ్స్[మార్చు]

 • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 [1] ఈనాడు నెల్లూరు; జనవరి-4,2014; 8వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు; 2014,మార్చి-9, 3వ పేజీ. 1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 233. Retrieved 10 March 2015. 
"https://te.wikipedia.org/w/index.php?title=కలిగిరి&oldid=2101310" నుండి వెలికితీశారు