ఉదయగిరి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఉదయగిరి
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో ఉదయగిరి మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో ఉదయగిరి మండలం యొక్క స్థానము
ఉదయగిరి is located in Andhra Pradesh
ఉదయగిరి
ఆంధ్రప్రదేశ్ పటములో ఉదయగిరి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°52′41″N 79°18′00″E / 14.878184°N 79.300089°E / 14.878184; 79.300089
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము ఉదయగిరి
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 33,413
 - పురుషులు 16,842
 - స్త్రీలు 16,571
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.33%
 - పురుషులు 80.22%
 - స్త్రీలు 50.35%
పిన్ కోడ్ 524226

ఉదయగిరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండల కేంద్రము. ఉదయగిరిని టూరిజ౦ ప్రాంత౦ గా చేయ౦డి

ఉదయగిరి నెల్లూరుకు వాయువ్యమున 96 కి.మీ దూరములో ఉన్నది. 14వ శతాబ్దములో విజయనగర రాజులు కట్టించిన కోట శిధిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన సంజీవ కొండ వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నవి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల మరియు చోళుల కాలం నాటి దేవాలయాలు కలవు.

చరిత్ర[మార్చు]

చరిత్రలో ఉదయగిరి పట్టణం యొక్క తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.

గజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని మరియు దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్టమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.

ఈరాజ్యమొకప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని సంరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమూ ఉన్నవి. కలివి కర్రతో చక్కని చెంచాలూ, చిన్నవీ పెద్దవీ, నేడు ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే ఇప్పటికీ తయారు చేస్తున్నారు.

విజయనగర సామ్రాజ్యము స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు చేరియున్నవి. ఉదయగిరి రాజ్యమునకే ములికనాడు అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ పెక్కు కలవు. సమిరకుమారవిజయము రచించిన పుష్పగిరి తిమ్మన్న ఆత్మకూరుతాలూకావాడు. విక్రమార్క చరిత్రము వ్రాసిన వెన్నలకంటి సిద్ధన కు జక్కన కవి కృతి ఇచ్చెను. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యమున మత్రిగా ఉండెను.

ఉదయగిరి దుర్గమునేలే బసవరాజు మంత్రియైన గంగన్నకు దుగ్గనకవి తాను రచించిన నాసికేతూపాఖ్యానము కృతి ఇచ్చెను. ఈకాలమున ఉదయగిరి దుర్గము విజయనగరరాజుల చేతులలో నుండి గజపతుల చేతులలో పడెను. బసవరాజే గజపతుల తరుపున ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసుకొని తన యేలుబడిలో నుంచుకొనెనట. ప్రబోధచంద్రోదయమును రచించిన మల్లనసింగనలు పై గంగన్నకే తన కావ్యమును కృతి ఇచ్చిరి.

దూబగుంట నారాయణ కవి తాను రచించిన పంచతంత్రము ను పై బసవరాజుకు అంకితమిచ్చెను.

ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడ పేరు తెచ్చుకొన్నది. అచ్యుతరాయ రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యమునకు రాజప్రతినిధగా రామామాత్యుడుండెను. ఇతడు సర్వమేళకళానిధి అనే ప్రసిద్ధ సంగీత గ్రంధమును రచించెను. దానిని రామరాయలకు అంకితమిచ్చెను. ఇతనికి వాగ్గేయకారతోడరుమల్లు అను బిరుదు కలదు. అక్బరు కాలమున ఆర్ధికమంత్రిగా నుండిన తోడరుమల్లు చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగానుండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్లనూ ఈబిరుదు ఇతనికి ఇచ్చిరట.

ఉదయగిరి గ్రామమునకు కొండాయపాలె అని పేరుకూడ.

ఉదయగిరి కొండమీద ఒక ఆలయమున్నది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించెనట. దేవాలయము పక్కన చక్కని కోనేరు కలదు. ఈ వల్లభరాయుడు శ్రీకృష్ణ దేవరాయ ల ప్రతినిధి యట. క్రీదాభిరామముశ్రీనాధుడు వల్లభరాయని పేర వ్రాసినట్లున్నూ, ఆ వల్లభరాయడు ఉదయగిరిసీమలోని మోపూరు గ్రామమున వెలసిన భైరవస్వామి భక్తుడనిన్నీ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసియున్నారు. ఈ ఇద్దరు వల్లభరాయలు ఒకరేనని పరిశొధకులు చెప్పుదురు.

రావూరుతాలూకా మొలకలపుండ్లకు కొద్ది దూరములో ఒక కొండ కలదు. దానిని సిద్ధులయ్యకొండ అంటారు. దానిపై గుహాలయమొకటి కలదు. ఆలయములో మూడు ప్రతిమలున్నవి. ఒకప్రతిమ నవకోటిసిద్ధుల పేరను, రెండవ ప్రతిమ నవనాధసిద్ధుల పేరను, మూడవది సారంగధరుని పేరను ప్రసిద్ధిచెంది యున్నవి. పై సిద్ధులు కొండపై తపస్సు చేసుకొనుచుండగా సారంగధరుడు వారిని దర్సించుకోవడానికి పోయినాడట. ఈ సారంగధరుడొక సిద్ధుడు.

గ్రామ నామ వివరణ[మార్చు]

ఉదయగిరి అనే గ్రామనామం ఉదయ అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. ఉదయ అన్న పదం సాదృశ్యబోధకసూచి[2]

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 524226
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  • శ్రీ కృష్ణ, ఆంజనేయస్వామి దేవాలయము

మండలంలోని గ్రామాలు[మార్చు]


venkatampeta

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 233. Retrieved 10 March 2015. 
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయగిరి&oldid=1800711" నుండి వెలికితీశారు