గుడ్లూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గుడ్లూరు
రెవిన్యూ గ్రామం
గుడ్లూరు is located in Andhra Pradesh
గుడ్లూరు
గుడ్లూరు
నిర్దేశాంకాలు: 15°04′22″N 79°54′04″E / 15.0729°N 79.9012°E / 15.0729; 79.9012Coordinates: 15°04′22″N 79°54′04″E / 15.0729°N 79.9012°E / 15.0729; 79.9012 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంగుడ్లూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం4,376 హె. (10,813 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం8,989
 • సాంద్రత210/కి.మీ2 (530/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08598 Edit this at Wikidata)
పిన్(PIN)523281 Edit this at Wikidata

గుడ్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం.[1]., మండలకేంద్రము.

గ్రామ చరిత్ర[మార్చు]

కవిత్రయంలోని వాడు, ఉభయకవిమిత్రుడు, ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్రాప్రగడ ఈ గ్రామానికి చెందినవాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఎఱ్ఱాప్రెగడ గుడ్లూరులోని నీలకంఠేశ్వరస్వామి వారి గురించి పద్యాలు రచించారు.

గ్రామ భౌగోళికం[మార్చు]


ప్రముఖులు[మార్చు]

ఎఱ్ఱాప్రగడ విగ్రహం
  • ఎఱ్ఱాప్రగడ - మహాభారతంలో నన్నయ్య అసంపూర్ణంగా వదిలిన పర్వాన్ని పూర్తి చేసాడు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని భాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతం చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగం చదివితే ఎఱ్ఱాప్రగడ భాగం కూడా తిక్కన్నే వ్రాసాడా అనిపిస్తుంది.

సమీప గ్రామాలు[మార్చు]

అమ్మవారి పాలెం 2.4 కి.మీ,బసిరెడ్డిపాలెం 2.6 కి.మీ,కొత్తపేట 2.5 కి.మీ,పొట్లూరు 5.7 కి.మీ,చినల త్రాపి 5.8 కి.మీ.ఆవులవారిపాలెం (గుడ్లూరు) 5.0 km

సమీప పట్టణాలు[మార్చు]

లింగసముద్రము 15.9 కి.మీ,ఉలవపాడు 19.4 కి.మీ,కందుకూరు 19.5 కి.మీ. కావలి 25kms

గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ మండలంలో మన్నేరు, ఉప్పుటేరు, ఎలికేరు అనే మూడు కాలువలు ప్రవహిస్థున్నవి.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ నీలకంఠేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గ్రామానికి దూరంగా ఉన్నది కనుక,ఈ ఆలయంలో 2020,అక్టోబరు-12న, 50 వేల రూపాయల వ్యయంతో మూడు కెమేరాలను (నిఘా నేత్రాలను), ప్రధాన ద్వారం, ధ్వజస్థంభం,మరియు ఆలయం లోపలి భాగంలోనూ అమర్చినారు. [4]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ అంకమ్మ దేవత[మార్చు]

ఈ గ్రామంలో అంకమ్మ దేవత గ్రామోత్సవం, 2014, ఆగస్టు-24, ఆదివారం అర్ధరాత్రి తరువాత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పుష్పాలంకరణ చేసి, స్థానిక శివాలయం నుండి మేళతాళాలతో, బొల్లావులు, యువకుల నృత్యాలమధ్య, దేవాలయ ప్రవేశం చేయించారు. సుమారు 200 మందికిపైగా యువకులు, స్త్రీల వేషధారణలో చేటలు పట్టుకొని నృత్యాలు చేస్తూ మొక్కులు తీర్చుకోవడం ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

మహాభారతం తెలుగు చేసిన కవిత్రయంలో ఒకరైన ఎఱ్రన్న ఈ గ్రామంలో జన్మించారు.

గ్రామ విశేషాలు[మార్చు]

2017,జూన్‌లో నిర్వహించిన ఐ.సి.డబ్లు.ఎ.ఐ చివరి పరీక్షలలో ఈ గ్రామానికి చెందిన చుండూరు శాంతకుమారి, 800 మార్కులకుగాను 450 మార్కులు సంపాదించి, అఖిల భారతదేశస్థాయిలో 19వ ర్యాంక్ సాధించినది. ఈమె తండ్రి శ్రీ మాలకొండయ్య. [3]

గణాంకాలు[మార్చు]

2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,153.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,194, స్త్రీల సంఖ్య 3,959, గ్రామంలో నివాస గృహాలు 1,884. గ్రామ విస్తీర్ణం 4,376 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం;2014,ఆగస్టు-26;7వపేజీ. [3] ఈనాడు ప్రకాశం;2017,ఆగష్టు-25;2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం;2020,అక్టోబరు-13,5వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=గుడ్లూరు&oldid=3278222" నుండి వెలికితీశారు