వెంకంపేట (గుడ్లూరు)
వెంకంపేట | |
---|---|
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°02′38″N 79°50′46″E / 15.044°N 79.846°ECoordinates: 15°02′38″N 79°50′46″E / 15.044°N 79.846°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గుడ్లూరు మండలం ![]() |
విస్తీర్ణం | |
• మొత్తం | 355 హె. (877 ఎ.) |
జనాభా (2011) | |
• మొత్తం | String Module Error: Target string is empty |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08599 ![]() |
పిన్(PIN) | 523281 ![]() |
వెంకంపేట, ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523281
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 347 - పురుషుల సంఖ్య 174 - స్త్రీల సంఖ్య 173 - గృహాల సంఖ్య 88;
2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 356.[2] ఇందులో పురుషుల సంఖ్య 166, మహిళల సంఖ్య 190, గ్రామంలో నివాస గృహాలు 92 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 355 హెక్టారులు.
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప పట్టణాలు[మార్చు]
ఉలవపాడు 15.7 కి.మీ,కందుకూరు 16 కి.మీ,లింగసముద్రం 17.2 కి.మీ,వోలేటివారిపాలెం 21.6 .కి.మీ.
సమీప గ్రామాలు[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
తూర్పున ఉలవపాడు మండలం,ఉత్తరాన కందుకూరు మండలం,దక్షణాన కావలి మండలం,పశ్చిమాన లింగసముద్రం మండలం.
గ్రామ చరిత్ర[మార్చు]
వెంకంపేట గ్రామం తొలుత నెల్లూరు జిల్లాలో ఉండి ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు మారింది. మొదలి సూర్యనారాయణ అనే వేదపండితుడికి ఆయన పాండిత్యానికి మెచ్చి ఆర్కాటు నవాబు 3 గ్రామాలను ఇచ్చారు. వాటిలో వెంకంపేట ఒకటి (మిగిలినవి చెలంచెర్ల అగ్రహారం, ఉదయగిరి తాలూకాలోని గున్నేరువ గ్రామం). అగ్రహారీక గ్రామం కావడంతో గ్రామంలోని మొత్తం పంటభూములన్నీ మొదలి సూర్యనారాయణ వంశస్థులవిగానే ఉండేవి. 1915-20 కాలంలో మొదలి సూర్యనారాయణ వంశీకులైన మొదలి వేంకటసుబ్బయ్య పూర్వీకుని కుదురుకు చెందిన తోటి అగ్రహారీకులను ఒప్పించి గ్రామంలోని ముత్తరాసు కుటుంబాలకు (తెలంగాణలోని వాడుక ముదిరాజ్) ఒక్కొక్క ఎకరం చొప్పున విడివిడిగా పంచారు. ఆ క్రమంలోనే ముదాం, నీరుకట్టు వంటి ఉద్యోగాలను కూడా ముత్తరాసు కుటుంబాల వారికి కేటాయించి ఇచ్చారు. ఆ సమయంలోనే ఆయన చుట్టుపక్కల గ్రామాలలో చందాలు వసూలు చేసి పెద్ద చెరువును వెంకంపేటలో త్రవ్వించారు.[3]
సౌకర్యాలు[మార్చు]
గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]
అంగనవాడీ కేంద్రం.
వెంకంపేట గ్రామంలో కుటుంబాల సంఖ్య తక్కువకావడం, వరదలు వంటి సమస్యలు ఎక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల పాఠశాల, దేవాలయం, అంగళ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు.
గ్రామానికి చెందిన ప్రముఖులు[మార్చు]
- పరిశోధకురాలు, రచయిత్రి, కళాకారిణి వకుళాభరణం లలిత
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
- ↑ నా జ్ఞాపకాలు:వకుళాభరణం లలిత:ఎమెస్కో బుక్స్:2012
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]