Jump to content

వకుళాభరణం లలిత

వికీపీడియా నుండి
వకుళాభరణం లలిత

వకుళాభరణం లలిత ప్రముఖ పరిశోధకురాలు, రచయిత్రి, కళాకారిణి. వృత్తిరీత్యా అధ్యాపకురాలైన లలిత నేరస్థ జాతులపై పరిశోధించి సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు.

కుటుంబనేపథ్యం

[మార్చు]

వకుళాభరణం లలిత తల్లిదండ్రులు మొదలి వెంకటసుబ్బయ్య, లు. ఆమె నెల్లూరి అమెరికన్ ఆసుపత్రిలో జన్మించినా ప్రకాశం జిల్లాలోని కుగ్రామమైన వెంకంపేట (ఆనాడు నెల్లూరు జిల్లాలో ఉండేది)లో చిన్నతనం గడిచింది. తండ్రి మొదట చెలంచర్లలో ఉంటూ చుండి జమీందారు వద్ద ఉద్యోగం చేసేవారు. ఆయన రంగస్థలంపై నాటకాల్లో ద్రౌపది, చంద్రమతి, దమయంతి మొదలైన పాత్రలను పోషించి నటునిగా పేరొందిన వారు. ఆ తర్వాతి కాలంలో జమీందారు వద్ద ఉద్యోగాన్ని వదిలివేయాల్సిన స్థితిలో వెంకంపేట చేరుకుని అటవీభూముల్ని సాగుచేసుకునే ప్రయత్నాల్లో అక్కడే స్థిరపడ్డారు.

విద్యాభ్యాసం

[మార్చు]

వెంకంపేట కుగ్రామం కావడంతో దాదాపు 5కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడ్లూరులో లలిత ప్రాథమిక విద్యాభ్యాసం సాగించారు. ఉన్నత విద్యాభ్యాసంలో ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం నెల్లూరు పురపాలకోన్నత బాలికల పాఠశాలలో చదివారు. నెల్లూరు అధ్యక్షం వారి వీథిలోని పాఠశాలలో 6, 7 తరగతులు చదువుకున్నారు. ఆ దశలోనే పాఠశాలలో మంచిమార్కులు పొంది స్కాలర్ షిప్స్, బహుమతిగా పుస్తకాలు సాధించారు. అనంతర కాలంలో ఆమె అక్కాబావల వద్ద ఉండి మద్రాసులో ట్రిప్లికేనులోని లేడీ విల్లింగ్టన్ ఉన్నతపాఠశాలలో చదువు కొనసాగించారు. ఎస్.ఎస్.ఎల్.సి.(నేటి ఎస్.ఎస్.సి.కి సమానం) పూర్తయ్యాకా వివాహం చేసేందుకు సంవత్సర కాలం చదువును నిలిపివేశారు. ఆ సంబంధం తప్పిపోవడంతో అనంతర కాలంలో కావలిలో కళాశాల విద్యను ప్రారంభించారు. 1955-57 కాలంలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా వున్న కావలి కాలేజీలో ఆమె స్పెషల్ తెలుగు, సివిక్స్, చరిత్ర గ్రూపుతో ఇంటర్మీడియట్ చదువుకున్నారు.

వృత్తి జీవితం

[మార్చు]

పరిశోధన రంగం

[మార్చు]

రచన రంగం

[మార్చు]

మూలాలు

[మార్చు]