దగదర్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దగదర్తి
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో దగదర్తి మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో దగదర్తి మండలం యొక్క స్థానము
దగదర్తి is located in ఆంధ్ర ప్రదేశ్
దగదర్తి
ఆంధ్రప్రదేశ్ పటములో దగదర్తి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°42′28″N 79°51′02″E / 14.707814°N 79.850578°E / 14.707814; 79.850578
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము దగదర్తి
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 35,742
 - పురుషులు 17,905
 - స్త్రీలు 17,837
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.06%
 - పురుషులు 68.26%
 - స్త్రీలు 47.90%
పిన్ కోడ్ 524240
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
Dagadarthi Sai Baba Temple, Nellore district
దగదర్తి పొలేరమ్మ ఆలయం, నెల్లూరు జిల్లా
దగదర్తి పొలిమేర నిలుపు, నెల్లూరు జిల్లా
దగదర్తి పొలిమేర నిలుపు, నెల్లూరు జిల్లా

దగదర్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. పిన్ కోడ్ నం. 524 240., ఎస్.టి.డి. కోడ్=08622.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ రామాలయం:- ఈ గ్రామంలోని శ్రీరామాలయం బహుళ ప్రాచుర్యం చెందినది. ఈ ఆలయంలో, శ్రీరామనవమి నాడు, శ్రీరామనవమి ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు, వైభవంగా నిర్వహించెదరు. ఆ రోజు రాత్రి, శేషవాహనంపై, స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించెదరు. మరుసటి రోజున (దశమి నాడు) హనుమంతసేవ ఘనంగా జరిపించెదరు. రాత్రికి హనుమ వాహనంపై శ్రీ సీతారాముల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించెదరు. మూడవ రోజున (ఏకాదశి రోజున) స్వామివారికి ఎదురుకోల కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించెదరు. సీతారాములను ఎదురెదురుగా కూర్చుండబెట్టి, గ్రామ పెద్దలు రెండు పక్షాలుగా విడిపోయి, ఎదురుకోలను అత్యంత వైభవంగా నిర్వహించెదరు. అనంతరం భక్తులు ఒకరిపై ఒకరు, గంధం జల్లుకొనెదరు. నాల్గవరోజున ఒక ప్రత్యేకమైన వేదికపై, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, కమనీయంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగును. ఐదవరోజున శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొని, పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించెదరు. [3], [4] & [5]
 2. శ్రీ భువనేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం;- ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు 2014,ఫిబ్రవరి-24,సోమవారం నిర్వహించిన శాంతికళ్యాణంతో ముగిసినవి. ఐదురోజులపాటు కన్నుల పండువగా నిర్వహించిన ఈ కార్యక్రమాలకు, స్త్రీల సంఖ్య, భక్తులు విశేషంగా విచ్చేసారు. అనంతరం వేదమంత్రాలమధ్య, స్వామివారి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. ఈ ఆలయంలో, 2014, జూన్-25, బుధవారం నాడు, మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం భక్తులకు అనదానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఆలయంలో 63 అడుగుల ఎత్తయిన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, 2014, ఆగస్టు-9.10.11 తేదీలలో నిర్వహించారు. 9,10 తేదీలలో హోమాలు, పూజలు మరియూ 11వ తేదీ సోమవారం నాడు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ మూడురోజులూ అన్నదానం నిర్వహించారు. [2], [7] & [9]

3.శ్రీ మల్లయ్యస్వామి ఆలయం:- దగదర్తి మల్లాయమిట్టలోని ఈ ఆలయంలో 2014,జూన్-1 ఆదివారం నాడు రైతులు, గ్రామస్థులు పొంగళ్ళు పెట్టినారు. వర్షాలు సకాలంలో కురిసి, పంటలు బాగా పండాలని వారు పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయంలో పూలంగిసేవ, ప్రత్యేకపూజలు చేసారు. స్త్రీల సంఖ్య విశేషంగా విచ్చేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో తొలిఏకాదశి సందర్భంగా, 2014. జూలై-8, మంగళవారం రాత్రి స్వామివారికి పల్లకీసేవ ఘనంగా నిర్వహించారు. రైతులు ఆలయం వద్ద పొంగళ్ళు పెట్టి, పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేసారు. స్త్రీల సంఖ్య విశేషంగా విచ్చేసి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. [6] & [8]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పైడి ఇంద్రసేన సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు దగదర్తి మండల సర్పంచుల సంఘం సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైనారు. [1]

గ్రామనామ వివరణ[మార్చు]

దగదర్తి గ్రామం పేరు ఏర్పాటును తెలిపేందుకు లోకనిరుక్తి (ఫోక్ ఎటిమాలజీ) వాడుకలో ఉంది. ఈ గ్రామం ఏర్పడినప్పుడు దగ, దర్తి అనే ఇద్దరు యానాది కులస్తులు ముందుగా స్థిరపడడం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తూంటారు.[2] అయితే గ్రామనామచరిత్రాధ్యయనంలో దగ అన్న పదానికి మూలం లేదా అర్థం అస్పష్టం కాగా, దర్తి అన్న పదం జలసూచి, దానికి నది లేదా వాగు అన్న అర్థం వస్తూంది.[3]

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 4852
 • పురుషుల సంఖ్య 2477
 • స్త్రీల సంఖ్య 2375
 • నివాస గృహాలు 1243
 • విస్తీర్ణం 2463 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • దామవరం 5 కి.మీ
 • పెదపూతేడు 7 కి.మీ
 • అనంతవరం 8 కి.మీ
 • చెన్నూరు 8 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • ఉత్తరాన బొగోలు మండలం
 • తూర్పున అల్లూరు మండలం
 • దక్షణాన కొడవలూరు మండలం
 • దక్షణాన బుచ్చిరెడ్డిపాలెం మండలం

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2014,ఫిబ్రవరి-25; 5వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు; 2014,ఫిబ్రవరి-26; 5వ పేజీ. [3] ఈనాడు నెల్లూరు; 2014; ఏప్రిల్-10; 5వ పేజీ. [4] ఈనాడు నెల్లూరు; 2014; ఏప్రిల్-11; 4వ పేజీ. [5] ఈనాడు నెల్లూరు;2014;ఏప్రిల్-13;4వ పేజీ. [6] ఈనాడు నెల్లూరు; 2014,జూన్-2; 5వ పేజీ. [7] ఈనాడు నెల్లూరు; 2014. జూన్-26; 5వ పేజీ. [8] ఈనాడు నెల్లూరు; 2014, జూలై-9; 8వ పేజీ. [9] ఈనాడు నెల్లూరు; 2014, ఆగస్టు-12; 5వపేజీ.

గ్రామాలు[మార్చు]


 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 39
 3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 236. Retrieved 10 March 2015. 
"https://te.wikipedia.org/w/index.php?title=దగదర్తి&oldid=2110296" నుండి వెలికితీశారు