అల్లూరు (నెల్లూరు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆల్లూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో ఆల్లూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో ఆల్లూరు మండలం యొక్క స్థానము
ఆల్లూరు is located in ఆంధ్ర ప్రదేశ్
ఆల్లూరు
ఆంధ్రప్రదేశ్ పటములో ఆల్లూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°41′10″N 80°03′13″E / 14.6860622°N 80.0535107°E / 14.6860622; 80.0535107
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము ఆల్లూరు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 52,990
 - పురుషులు 26,630
 - స్త్రీలు 26,360
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.07%
 - పురుషులు 67.94%
 - స్త్రీలు 54.18%
పిన్ కోడ్ 524315
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 11,656
 - పురుషుల సంఖ్య 5,768
 - స్త్రీల సంఖ్య 5,888
 - గృహాల సంఖ్య 3,239
పిన్ కోడ్ 524315
ఎస్.టి.డి కోడ్ 08622

అల్లూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 315., ఎస్.టి.డి.కోడ్ = 08622.

గ్రామ జనాభా[మార్చు]

మూలాలు[మార్చు]

అల్లూరు గ్రామము.[1]లో వరి పంట విస్తారంగా పండుతున్నందు వలన పంటల అల్లూరుగా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.

అల్లూరు దేవాలయాలకు ప్రసిద్ధి, అల్లూరు గ్రామం మధ్యలో విష్ణు దేవాలయం ఉంది. ఇది చోళరాజుల కాలములో నిర్మించింది.

అల్లురు విద్యకు కూడా ప్రసిద్ధి చెందినది, రామక్రిష్ణా విద్యా సంస్థలు 1930లో స్థాపించారు. ఇవి ఇప్పుడు చుట్టుప్రక్కల 40 గ్రామాలకు విద్యను అందిస్తున్నవి. రామక్రిష్ణా డిగ్రీ కళాశాలను 1999లో స్థాపించారు. ఈ సంస్థలలో చదివిన వాళ్ళలో చాలా గొప్పవారు కూడా వున్నారు, ఈ సంస్థలలో చదివిన వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేశారు, దానిపేరు RKCOSA (రామక్రిష్ణా కాలేజి ఓల్డ్ స్టుడెంట్స్ అసొసియేషన్). ఈ సంస్థతో చదివిన కాలేజికి, పుట్టిన ఊరికి మంచి చేయాలనుకుంటున్నారు సంస్థ వెబ్ లింక్ [www.rkcosa.org]. ఈ సంస్థలకు తోడుగా చాలా ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

AllurSchool

దేవాలయాలు[మార్చు]

 • శివాలయం
 • పోలేరమ్మ గుడి;- గ్రామములో బహుళ ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మవారి దేవస్థానంలో, ప్రతి సంవత్సరం మొదట్లో, 2వ మంగళవారం, గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించెదరు.
 • కలుగోలమ్మ దేవాలయాం
 • దసరా దేవాలయాం
 • కోదండ రామ దేవాలయము
 • సాయిబాబా గుడి
 • వినాయకుని గుడి
 • కన్యకాపరమేశ్వరి ఆలయం
 • వేణుగోపాలస్వామి దేవాలయాం
 • మారుతి ఆశ్రమము (అల్లూరుపేట)
 • మాతమ్మ దేవాలయం:- గ్రామములోని గాంధీకాలనీలో కొలువై యున్న, మాతమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
 • చెన్నకేశవులస్వామి దేవాలయం
 • మహాలక్ష్మి దేవాలయం (మాలక్షమ్మ ఆలయం,తూర్పు వీధి)
 • గంగమ్మ దేవాలయం

గ్రామానికి చెందిన ప్రముఖులు[మార్చు]

నూకలపాటి వెంకటపతి రెడ్డి (1888-1953) - స్వాతంత్ర్య సమరయోధుడు.

గ్రామ పరిపాలన[మార్చు]

అల్లూరు మేజరు పంచాయతీగా 1910,ఏప్రిల్-2వ తేదీన ఏర్పడింది. ఆంగ్లేయుల కాలంనుండి ఇక్కడ సచివాలయం ఉంది. మొదటి సర్పంచిగా శ్రీ గండికోట రాఘవయ్య, రెండవ సర్పంచిగా శ్రీ వి.అరుణాచలం వ్యవహరించారు. నెల్లూరు జిల్లాలో అల్లూరు మొదటి మేజరు పంచాయతీ. ఇక్కడ స్వాతంత్ర్యానికి పూర్వమే రెవెన్యూ, న్యాయశాఖలకు సంబంధించిన భవనాలు ఉండేవి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. అల్లూరు మొదట నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1906 లో సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడు ఇక్కడ డెల్టా ఆధునికీకరణ చేసారు. [2]

గణాంకాలు[మార్చు]

 • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 11768
 • పురుషుల సంఖ్య 5922
 • స్త్రీల సంఖ్య 5846
 • నివాసగృహాలు 2917
 • విస్తీర్ణం 3028 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • పురిని 3 కి.మీ
 • ఉత్తర మోపూరు 4 కి.మీ
 • తూర్పు గోగులపల్లి 5 కి.మీ
 • దంపూరు 5 కి.మీ
 • ఉత్తర అములూరు 6 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • దక్షణాన విడవలూరు మండలం
 • ఉత్తరాన బొగోలు మండలం
 • దక్షణాన కొడవలూరు మండలం
 • పశ్చిమాన దగదర్తి మండలం

గ్రామాలు[మార్చు]

Ramakrishna Junior college, Allur

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు నెల్లూరు; 2013,జులై-12; 8వ పేజీ.
 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు