Coordinates: 16°28′27″N 80°41′13″E / 16.4741449°N 80.6868493°E / 16.4741449; 80.6868493

తాడిగడప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడిగడప
—  జనగణన పట్టణం.  —
తాడిగడప is located in Andhra Pradesh
తాడిగడప
తాడిగడప
అక్షాంశరేఖాంశాలు: 16°28′27″N 80°41′13″E / 16.4741449°N 80.6868493°E / 16.4741449; 80.6868493
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ గురజా రవిప్రసాద్
జనాభా (2101)
 - మొత్తం 17,462
 - పురుషుల సంఖ్య 8,860
 - స్త్రీల సంఖ్య 8,602
 - గృహాల సంఖ్య 4,623
పిన్ కోడ్ 521 137
ఎస్.టి.డి కోడ్ 0866

తాడిగడప, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన జనగణన పట్టణం. విజయవాడ నగరానికి పొరుగు ప్రాంతం..ఇది వైఎస్ఆర్ తాడిగడప పురపాలక సంఘానికి ప్రధాన పరిపాలనా కేంద్రం . ఇది సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తులో ఉంది.తాడిగడప విజయవాడ ఆదాయ విభాగంలోని పెనమలూరు మండలంలో ఉంది.తాడిగడప భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో విజయవాడ పొరుగు ప్రాంతంగా, జనాభా గణన పట్టణంగా ఉంది.

పురపాలక సంఘంగా గుర్తింపు[మార్చు]

విజయవాడ నగరంలో అంతర్భాగంగా ఉన్న తాడిగడప, కానూరు, యనమలకుదురు, పోరంకి గ్రామాలను కలిపి వైఎస్ఆర్ తాడిగడప పురపాలకసంఘం అనే పేరుతో కొత్త పురపాలకసంఘంగా ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా మొదటి తరగతి పురపాలక సంఘంగా 2021 జనవరి 1న ఏర్పడింది.[1][2][3] ఇది విజయవాడ రెవెన్యూ డివిజన్ లోని పెనమలూరు మండలంలో ఉంది. ఇది విజయవాడ నగరపాలకసంస్థ ప్రధాన శివారు ప్రాంతం.[4]

గ్రామ చరిత్ర[మార్చు]

మెట్రోపాలిటన్ ప్రాంతం[మార్చు]

2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంటు జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[5][6]

జనాభా గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం తాడిగడప జనాభా గణనలో 17,462 మంది జనాభా ఉన్నారు, ఇందులో 8,860 మంది మగవారు, 8,602 మంది మహిళలు ఉన్నారు. అలాగే 0-6 ఏళ్ళ వయస్సు ఉన్న చిన్నారుల జనాభా 1659 లో ఉండగా, ఇది తాడిగడప మొత్తం జనాభాలో 9.50%గా ఉంది. తాడిగడప సెన్సస్ టౌన్ లో, మహిళా సెక్స్ నిష్పత్తి 971 ఉండగా ఇది రాష్ట్ర సగటు 993 కి కంటే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా, తాడిగడపలో పిల్లల సెక్స్ నిష్పత్తి దాదాపుగా 956 గా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోల్చితే ఎక్కువగా ఉంది. తాడిగడప పట్టణం అక్షరాస్యత శాతం 78.26%, రాష్ట్ర సగటు 67.02% కంటే ఎక్కువ. పట్టణంలో, పురుష అక్షరాస్యత 81.86%, స్త్రీ అక్షరాస్యత రేటు 74.56%.

తాడిగడప సెన్సస్ టౌన్ మొత్తం నిర్వహణలో 4,623 గృహాలు ఉన్నాయి, మంచినీటి వసతి, మురికినీరు వంటి ప్రాథమిక సదుపాయాలను ఇది కలగ చేస్తుంది. ఇది సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, దాని అధికార పరిధిలో వచ్చే ఆస్తులపై పన్నులను విధించేందుకు కూడా అధికారం కలిగి ఉంటుంది. తాడిగడప పట్టణం మొత్తం జనాభాలో షెడ్యూల్ కులం (ఎస్.సి.) 15.42%, షెడ్యూల్ ట్రైబ్ (ఎస్టీ) 0.88% మంది ఉన్నారు.

మొత్తం జనాభాలో 6,625 మంది పని లేదా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4,907 మంది మగవారు, 1,718 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా లెక్కల సర్వేలో, పనిచేయువాడు అనగా; వ్యాపారం, ఉద్యోగం, సేవా, వ్యవసాయదారుడు, కార్మిక కార్యకలాపాలను నిర్వహించేవాడు అని అర్థం. మొత్తం పనిలో 6625 మంది పనిచేస్తున్నప్పుడు, 94.48% మంది ప్రధాన (మెయిన్ వర్క్లో) పనులలో పాల్గొంటున్నారు, అదే సమయంలో 5.52% మొత్తం కార్మికులు సాధారణ (అండర్ వర్క్) పనిలో నిమగ్నమయ్యారు.

2001 గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12947.[7] ఇందులో పురుషుల సంఖ్య 6506, స్త్రీల సంఖ్య 6441, గ్రామంలో నివాస గృహాలు 3275 ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పోరంకి, కానూరు, పెదపులిపాక గ్రామాలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

పోరంకి, తాడిగడప నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 10 కి.మీ

విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను ప్రభుత్వం అందించుతుంది, అలాగే ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర విద్యా శాఖ కింద పనిచేస్తాయి.[8][9] వివిధ పాఠశాలలు తెలుగు, ఆంగ్లం మాధ్యమంలో అనుసరిస్తూ బోధన జరుగుతుంది. చైతన్యభారతి జూనియర్ కాలేజి. జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ శాయి పబ్లిక్ పాఠశాల, విజయలక్ష్మి ప్రాథమికోన్నత పాఠశాల తాడిగడపలో ఉన్నాయి.

మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామంలో, 2014, అక్టోబరు-2న గాంధీ జయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన, శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందిస్తున్నారు.

బ్యాంకులు[మార్చు]

సప్తగిరి గ్రామీణ బ్యాంకు

పరిపాలన[మార్చు]

గతంలో ఇది గ్రామ పంచాయితీగా ఉండేది.గ్రామ పంచాయితీగా ఉన్న కాలంలో ఈ దిగువ వారు పంచాయితీ సర్పంచులుగా పనిచేసారు.

  • ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో గురజా రవిప్రసాద్ సర్పంచిగా ఎన్నికైనాడు. ఉపసర్పంచిగా మాణిక్యవల్లి శ్రీనివాసరావు ఎన్నికైనాడు.

గ్రామ పంచాయితీకి సహాయం[మార్చు]

  • కిలారు శ్రీనివాసరావు తన తండ్రి రామచంద్రరావు జ్జ్ఞాపకార్థం పెనమలూరు పంచాయితీకి రూ.4 లక్షలు విలువ కలిగిన ట్రాక్టరుతో పాటు ట్రక్కును, 25 మంది పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు స్థానిక ఎమ్మేల్యే బోడేప్రసాద్ పెనమలూరు పంచాయితీకి అందజేశారు.[10]

కాలనీలు, వార్డులు, ప్రాంతాలు[మార్చు]

  • చలసానినగర్ కాలనీ
  • పద్మజానగర్ కాలనీ

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  • పురాతన దేవాలయాలు
  • శ్రీ సీతారామస్వామివారి దేవాలయం:- ఈ దేవాలయంలో 2014, మార్చి-4వ తేదీ నుండి 8వ తేదీ వరకూ, 5 రోజుల పాటు, కుంభాభిషేకమహోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా, వేదస్వస్తి, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, గోపూజ, దీక్షాధారణ, పంచగవ్యారాధన, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించారు.
  • శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- తాడిగడప శ్రీనివాసనగర్ కట్ట రామానగర్ లోని రామాలయంలో, 2014, ఏప్రిల్-4, శుక్రవారం నాడు, శ్రీ సీతారామస్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ముగింపు రోజున స్వామివారికి ప్రత్యేకపూజలు చేసారు. ఈ సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు.
  • శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి ఆలయం.
  • శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా, 2015, ఆగస్టు-31వ తేదీ సోమవారంనాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

పట్టణ ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

పామర్తి శివనాగరావు[మార్చు]

  • ఈ గ్రామానికి చెందిన చిత్రకారుడు పామర్తి శివనాగరావు, 2014, జూలై-3వ తేదీన కానూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, పురికొసతో గౌతమబుద్ధుడి బొమ్మను రూపొందించారు. ఈయన ప్రతిభను గుర్తించిన "మిరకిల్ వరల్డ్ రికార్డ్స్" అను సంస్థ జ్యూరీ సభ్యుడు తిమ్మిరి రవీంద్ర, వీరికి 2014, జూలై-13 నాడు, ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో, వీరికి తమ సంస్థ తరఫున, పురస్కారాన్ని అందజేసినారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షులైన డా. చింతపట్ల, 2014, ఆగస్టు-6న హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో, వీరికి ఆ సంస్థ తరపున గూడా ఒక పురస్కారాన్ని అందజేసారు. ఈ చిత్రానికి, వీరికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ, మెమెంటోతోపాటు, ప్రశంసాపత్రం అందజేసినది. ఈ చిత్రానికి గుజరాతుకు చెందిన "వరల్డ్ ఎమేజింగ్ రికార్డ్స్" మరియూ "వరల్డ్ రికార్డ్స్ ఇండియా" అను సంస్థలు గూడా తమ పురస్కారాలను అందజేసినవి. వీరికి లండనుకు చెందిన "వండర్ బూక్ ఆఫ్ రికార్డ్స్" అను సంస్థ వారు, మరియొక ప్రపంచ పురస్కారాన్ని అందజేసినారు. 1997 నుండి ఇప్పటివరకు, వివిధ వస్తువులపై వీరు వేసిన సూక్ష్మ (మైక్రో) చిత్రాలకు వీరికి ఈ పురస్కారం లభించింది. సుద్దముక్కలు, బియ్యం గింజలపై వీరు వేసిన చిత్రాలకు వీరికి ఈ పురస్కారం లభించింది.
  • ఇతను ఏప్రిల్-2015లో, "మహర్షి" అను, 8 నిమిషాల నిడివి గల ఒక లఘుచిత్రాన్ని, కేవలం 8 గంటలలో నిర్మించడంతోపాటు, ఆ చిత్రానికి 20 శాఖలలో పనిచేసారు.ఇతని ప్రతిభను గుర్తించిన లండనుకు చెందిన వండర్ బుక ఆఫ్ రికార్డ్స్ సంస్థ పురస్కారం అందజేసారు. ఈ లఘుచిత్రానికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్శ్ లో స్థానం దక్కింది. ఆ సంస్థవారు ఒక ఙాపికను, ధ్రువపత్రాన్నీ అందజేసారు.
  • ఇప్పటి వరకుఇతను గీసిన బుద్ధుడి బొమ్మకు, 18 పురస్కారాలు అందాయి. తాజాగా మరి రెండు పురస్కారాలు లభించినవి. ఒకటి నేపాలులోని ఎవరెస్టు వరల్డ్ రికార్డ్స్ వారి నుండి, లండనులోని వార్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుండి అందాయి.
  • సుద్దముక్కపై 9 మిల్లీ మీటర్ల పొడవుతో అతి చిన్న వినాయకుడి విగ్రహాన్ని చెక్కారు. ప్రతిభను గుర్తించిన అమెరికాకు చెందిన రికార్డు సెట్టర్ సంస్థ, దీనిని అరుదైన అంశంగా నమోదు చేసుకుంది.

పట్టణ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామానికి చెందిన కె.జయానందచౌదరి, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి.లో చదువుచున్నాడు. ఇతడు అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో, 2014, మే-14 నుండి 18 వరకు, అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన "నాసా" నిర్వహించిన పోటీలలో పాల్గొని, తన ప్రతిభతో రూపొందించిన, "ర్యానిమర్ - మ్యాన్స్ మ్యానిఫెస్టేషన్" అను ప్రాజక్టుకు ద్వితీయ బహుమతి పొందినాడు.

మూలాలు[మార్చు]

  1. "విజయవాడలో కొత్తగా 'వైఎస్సార్‌ తాడిగడప' మున్సిపాలిటీ". www.andhrajyothy.com. Retrieved 2021-03-25.
  2. Telugu, TV9 (2021-01-05). "Ap Municipalities: ఏపీలో మున్సిపాలిటీల పరిధి పెంపు.. మరో కొత్త మున్సిపాలిటీ.. ఐదు నగర పంచాయతీలు - Increasing range". TV9 Telugu. Retrieved 2021-03-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "కొత్తగా 5 నగర పంచాయతీలు, ఒక పురపాలక సంఘం". www.eenadu.net. Retrieved 2021-03-25.
  4. "Andhra government notifies five new nagar panchayats, rejigs 13 civic bodies". The New Indian Express. Retrieved 2021-03-27.
  5. Reporter, Staff. "Vijayawada, 19 other contiguous areas notified as Metropolitan Area". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 27 March 2017.
  6. "Welcome to Government Order Issue Register". goir.ap.gov.in. Archived from the original on 7 May 2017. Retrieved 27 March 2017.
  7. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-02.
  8. "School Eduvation Department" (PDF). School Education Department, Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 7 November 2016. Retrieved 7 November 2016.
  9. "The Department of School Education – Official AP State Government Portal | AP State Portal". www.ap.gov.in. Archived from the original on 7 November 2016. Retrieved 7 November 2016.
  10. ఈనాడు విజయవాడ/పెనమలూరు, 4 నవంబరు, 2014, 5వ పేజీ.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తాడిగడప&oldid=4149974" నుండి వెలికితీశారు