పెనమలూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Penamaluru
పెనమలూరు
Village
పెనమలూరు పంచాయితీ కార్యాలయము
పెనమలూరు పంచాయితీ కార్యాలయము
Penamaluru is located in Andhra Pradesh
Penamaluru
భారత దేశము, ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రాంతము
Coordinates: 16°28′05″N 80°43′10″E / 16.46806°N 80.71944°E / 16.46806; 80.71944Coordinates: 16°28′05″N 80°43′10″E / 16.46806°N 80.71944°E / 16.46806; 80.71944
Country India
State ఆంధ్ర ప్రదేశ్
Languages
 • Official తెలుగు
Time zone IST (UTC+5:30)
Vehicle registration AP–16
Lok Sabha constituency మచిలీపట్నం
పెనమలూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెనమలూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ బాలాజీ నాయక్
జనాభా (2001)
 - మొత్తం 11,645
 - పురుషుల సంఖ్య 5,771
 - స్త్రీల సంఖ్య 5,874
 - గృహాల సంఖ్య 2,964
పిన్ కోడ్ 521 139
ఎస్.టి.డి కోడ్ 0866
పెనమలూరు
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో పెనమలూరు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో పెనమలూరు మండలం యొక్క స్థానము
పెనమలూరు is located in Andhra Pradesh<div style="position: absolute; top: సమాసంలో(Expression) లోపం: *కు ఒక ఆపరాండును ఇవ్వలేదు%; left: -849.2%; height: 0; width: 0; margin: 0; padding: 0;">
పెనమలూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పెనమలూరు యొక్క స్థానము
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము పెనమలూరు
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,24,557
 - పురుషులు 63,602
 - స్త్రీలు 60,955
అక్షరాస్యత (2001)
 - మొత్తం 76.52%
 - పురుషులు 81.27%
 - స్త్రీలు 71.60%
పిన్ కోడ్ 521139

పెనమలూరు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 521 139., ఎస్.టి.డి.కోడ్ = 0866.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పినమల్లేశ్వరుడు ద్వారా దాని పేరు వచ్చింది మరియు గతంలో మథబ్ కా పెనమలూరు అని పిలుస్తారు.[2]

మండలాలు[మార్చు]

పెనమలూరు నియోజకవర్గంలో 1. పెనమలూరు 2.కంకిపాడు 3విజయవాడ గ్రామీణ మండలంలోని కొన్ని గ్రామాలు మొత్తం మూడు మండలాలున్నాయి.

దేవాలయాలు[మార్చు]

 • పురాతన దేవాలయాలు పోరంకి, చోడవరం, యనమలకుదురు, గోసాల, కానూరు, తాడిగడప, వణుకూరు గ్రామాల్లో ఉన్నాయి. షిర్డీసాయి మందిరాలు ఈ పెనమలూరు నియోజకవర్గలో ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. యనమలకుదురు ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కీర్తి పొందాయి. కానూరులో తిరుపతమ్మ తిరునాళ్లు నిర్వహస్తున్నారు. కానూరు, గంగూరులలో పురాతన మసీదులున్నాయి. కానూరు, పోరంకి, పెనమలూరు, వణుకూరు గ్రామాల్లో పురాతనమైన చర్చీలు ఉన్నాయి.
 1. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2014,జూన్-16 నుండి 19 వరకు నిర్వహించినారు. 16వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభించినారు. ఆ రోజున విష్వక్సేన ఆరాధన, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, తీర్ధగోష్టి తదితర పూజలు ప్రారంభించినారు. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించినారు.17వ తేదీ ఉదయం, ధ్వజారోహణ, రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణం,18వ తేదీన హోమపూజలు 19వ తేదీన వసంతోత్సవం నిర్వహించినారు [4]&[5]
 2. శ్రీ గంగానమ్మ ఆలయం:- ఈ పురాతన ఆలయం, పెనమలూరులో గోగులమ్మ చెరువు ప్రక్కనే ఉన్నది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

 1. ప్రముఖ రచయిత, టీవీ నటుడు పరిటాల ఓంకార్
 2. ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కూడా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు.
 3. మండవ రిషిత :- పెనమలూరు గ్రామానికి చెందిన శ్రీ మండవ కోటేశ్వరరావు, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నారు. ఈయన భార్య శ్రీమతి రాజ్యలక్ష్మి గృహిణి. వీరు మధ్య తరగతి కుటుంబీకులు. ఈ దంపతుల కుమార్తె రిషిత, సంగారెడ్డిలోని ఎం.ఎన్.ఆర్.వైద్యకళాశాలలో చదివి ఎం.బి.బి.ఎస్.పూర్తిచేసింది. ఈమె విలువిద్యలో సవ్యసాచి. గురిచూసి బాణం వదిలితే లక్ష్యాన్ని ఛేదించినట్లే. విల్లు ఎక్కుపెడితే, పతకం ఆమె చేతిలో పడినట్లే. ఈమె ఇంతింతై వటుడింతైనట్లుగా పెనమలూరు నుండి అంతర్జాతీయస్థాయిలో ఆర్చరీలో విజయపరంపర కొనసాగించుచున్నది. ఈమె విలువిద్యలోనేగాక అటు ఉన్నత విద్యలోగూడా రాణించి, ఎం.బి.బి.ఎస్. పూర్తిచేసింది. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామానికి 2013 జులైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో శ్రీ బర్మావత్ బాలాజీ నాయక్ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ అర్వపల్లి చంటి ఎన్నికైనారు. [2]

ఆసుపత్రులు, వైద్యశాలలు[మార్చు]

శ్రీ రామా హాస్పిటల్ యోగ ‍‍మరియు ప్రకృతి చికిత్సాలయం, డో.నం. 5-18/1, శ్రీ మణి నిలయం, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా, పెనమలూరు, విజయవాడ - 5211390. (డా.బాబూరావు పొట్లూరి, ఫోన్ నం.:0866 - 2581009, మొబైల్:9491130967, 9848236102

బ్యాంకులు[మార్చు]

సిండికేటు బ్యాంకు:- ఈ గ్రామంలో సిండికేటు బ్యాంకు శాఖను, 2014,డిసెంబరు-17వ తేదీనాడు ప్రారంభించినారు. ఇక్కడ ఖాతాదారులకు ఆధునిక సాంకేతిక పరిఙానంతోకూడిన సేవలను అందించెదరు. [6]

పెనమలూరు మండలం లోని గ్రామాలు[మార్చు]

కార్యాలయాలు, ఇతర ఆఫీసులు[మార్చు]

 • ఎమ్మర్వో కార్యాలయము, పెనమలూరు .
 • ఎమ్డీవో కార్యాలయము, పెనమలూరు .
 • పెనమలూరు వ్యవసాయ, మత్స్యశాఖ కార్యాలయాలున్నాయి.
 • పెనమలూరు చేపలకుండీల సెంటరులో మత్స పరిశోధన కేంద్రం ఉన్నది.
 • ఇందిరక్రాంతి పథకం కార్యాలయం, పెనమలూరు.
 • హిందూస్థాన్‌ లివర్‌, సిప్లా ఇండియా, ఎల్‌జీ, రాన్‌బాక్సీ, బ్రూక్‌బ్రాండ్‌, గోద్రెజ్‌ కంపెనీల కార్యాలయాలు, గోదాములు ఉన్నాయి.

ప్రధాన గ్రామీణ రహదారులు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చోడవరం 782 3,075 1,522 1,553
2. గంగూరు 1,463 6,643 3,692 2,951
3. గోసాల 1,174 4,983 2,468 2,515
4. పెద్దపులిపాక 625 2,442 1,221 1,221
5. పెనమలూరు 2,964 11,645 5,771 5,874
6. పోరంకి 4,314 20,155 9,883 10,272
7. తాడిగడప 3,275 12,947 6,506 6,441
8. వణుకూరు 1,680 6,552 3,243 3,309

పాఠశాలలు, విద్యాలయములు[మార్చు]

 1. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

విందు వివాహం, సమావేశం, ఫంక్షన్ హాళ్ళు[మార్చు]

అనిల్ ఫంక్షన్ హాల్, మురళీ నగర్, తారక రామ రోడ్ సంఖ్య 2, పెనమలూరు, ఆంధ్ర ప్రదేశ్ 521137

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గోగులమ్మ చెరువు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 24 August 2014. 
 2. https://en.wikipedia.org/wiki/Penamaluru
 3. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

[2] ఈనాడు కృష్ణా/పెనమలూరు, 13 ఆగష్టు 2013. 2వ పేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,ఫిబ్రవరి-13; 8వ పేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-16; 1వ పేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,జూన్-17; 2వ పేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,డిసెంబరు-18; 2వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=పెనమలూరు&oldid=1711270" నుండి వెలికితీశారు