పరిటాల ఓంకార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పరిటాల ఓంకార్ ప్రముఖ రచయిత, టీవీ నటుడు. విజయవాడ దగ్గరలోని పెనమలూరు గ్రామంలో జన్మించారు. రేడియోలో వార్తలు చదవడంతో మొదలుపెట్టి, తరువాత పత్రికలలో శీర్షికా రచయితగా, టీవీ ధారావాహికలకు రచయితగా, చలనచిత్ర నటుడిగా, టీవీ ధారావాహికలలో కూడా నటించాడు. ఒక చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు.

టీవీ ధారావాహికలకు రచయితగా, నటుడిగా ఓంకార్ విశేషమైన పేరు సంపాదించాడు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను తన సీరియళ్ళలో చొప్పించి, ప్రజాదరణ పొందాడు. నటుడిగా తన విలక్షణమైన వాచికంతో ఆకట్టుకున్నాడు.

ఓంకార్ పోలీసు భార్య, పందిరిమంచం వంటి చిత్రాలలో నటించాడు. స్వాతి వారపత్రికలో ఓంకారం పేరుతో వారం వారం శీర్షిక నిర్వహిస్తూ ఉంటాడు. స్వాతిలో సినీ తారల పుకార్ల వార్తల విభాగం కూడా ఆయన నిర్వహించేవాడు. ఇతను వ్రాసిన ఆల్ ఇన్ వన్ బహుళ ప్రచారం పొందింది.

సినిమాలు[మార్చు]

రచయితగా[మార్చు]

నటుడిగా[మార్చు]

మరణం[మార్చు]

జనవరి 7, 2007 న 'కార్డియాక్ అరెస్ట్ ' తో చనిపోయారు.