బంటుమిల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంటుమిల్లి
—  రెవిన్యూ గ్రామం  —
బంటుమిల్లి is located in Andhra Pradesh
బంటుమిల్లి
బంటుమిల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°21′00″N 81°17′00″E / 16.3500°N 81.2833°E / 16.3500; 81.2833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,867
 - పురుషులు 4,066
 - స్త్రీలు 3,962
 - గృహాల సంఖ్య 1,928
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672


బంటుమిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 521324. ఎస్.టీ.డీ. =08672.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పూర్వము బ్రిటీషువారి పరిపాలన కాలంలో సముద్ర మార్గం ద్వారా సరుకుల రవాణా ఎగుమతులు దిగుమతులు మచిలీపట్నం గిలకలదిండి పోర్టులో జరిగేవి అని, అలా సరుకులు రవాణా చేసేటప్పుడు భటులు బంటుమిల్లిలో స్వేద తీరేవారని అలా భటులు పేరు మీదుగా ఈ ఊరికి బంటుమిల్లి అని పేరు వచ్చినట్టు కొందరు చెబుతున్నారు. ఖచ్చితమైన వివరణ అయితే తెలియదు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం, చొరంపూడి

సమీప మండలాలు[మార్చు]

కృత్తివెన్ను, కలిదిండి, ముదినేపల్లి, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం నుండి బంటుమిల్లికి గుడివాడ నుండి బస్, ఆటో సౌకర్యం కలదు. భీమవరం నుండి బంటుమిల్లికి రెండు దారులు ఉన్నాయి వాటిలో 1. భీమవరం నుండి విజయవాడ బస్ ఎక్కి సింగరాయపాలెంలో దిగి బంటుమిల్లి వెళ్లే ఆటో/గుడివాడ నుండి వచ్చు బస్ ఎక్కాలి, 2. భీమవరం కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ కి వచ్చి లోసరీ పల్లిపాలెం ఆటో ఎక్కి లోసరి పల్లెపాలెంలో దిగి అక్కడ నుండి బంటుమిల్లి ఆటో ఎక్కాలి. నర్సాపురం నుండి మచిలీపట్నం వెళ్లే బస్ లోసరి పల్లెపాలెం, బంటుమిల్లి మీదుగా మచిలీపట్నం వెళ్తుంది.

రైల్వే స్టేషన్:

పెడన  : 20 కి.మీ మచిలీపట్నం : 30 కి.మీ గుడివాడ  : 32 కి.మీ విజయవాడ : 76 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజి, సెయింట్ జాన్సు స్కూల్, కె.ఆర్.టాలెంట్ స్కూల్, గవర్నమెంట్ హైస్కూల్, మార్గదర్శి హైస్కూల్,కొమ్మారెడ్డి పాఠశాల, బంటుమిల్లి.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

బంటుమిల్లికి తూర్పు పొలిమేర దగ్గర పంచాయతీ త్రాగునీటి చెరువు ఉంది. దాని ప్రక్కన నీటిని శుభ్రపరుచు ఇసుక ఫిల్టర్లు, ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ ఉన్నాయి. వాటి ద్వారా మూడు రోజులకు ఒకసారి ఉదయం 06:00 నుండి 06:30 వరకు పంచాయతీ కుళాయిల ద్వారా ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయబడుతుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సగటున ఒక రోజుకి వచ్చి ఒక మనిషికి 55 లీటర్ల నీరు అందిచాలి. కానీ ఇక్కడ సగటున 10 నుండి 15 లీటర్ల నీరు మాత్రమే ఇక్కడ ప్రజలకి అందుతుంది. ఇక్కడ ప్రజలు దాదాపు 90% మంది త్రాగునీరు కోసం డబ్బులు ఖర్చు చేసి మినరల్ ప్లాంట్ నీటిని వినియోగిస్తున్నారు, దానికి గల కారణం పంచాయతీ నీరు అపరిశుభ్రత.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శివాలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. ఆముదాలపల్లి 215 752 367 385
2. అర్తమూరు 1,148 4,555 2,358 2,197
3. బంటుమిల్లి 1,928 8,028 4,066 3,962
4. బర్రిపాడు 261 902 460 442
5. చినతుమ్మిడి 259 1,030 500 530
6. చొరంపూడి 1,553 6,795 3,461 3,334
7. కంచడం 498 2,007 1,000 1,007
8. కొర్లపాడు 165 660 340 320
9. మద్దేటిపల్లి 215 839 416 423
10. మల్లేశ్వరం 780 3,104 1,555 1,549
11. మనిమేశ్వరం 449 1,826 903 923
12. ములపర్రు 1,440 5,786 2,900 2,886
13. ముంజులూరు 593 2,262 1,121 1,141
14. నారాయణపురం 132 560 301 259
15. పెదతుమ్మిడి 1,807 6,909 3,491 3,418
16. పెందూరు 692 2,849 1,427 1,422
17. రామవరపు మోడి 434 1,752 848 904
18. సాతులూరు 406 1,641 829 812

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 52,257 - పురుషులు 26,343 - స్త్రీలు 25,914

వనరులు[మార్చు]

  1. "బంటుమిల్లి". Retrieved 3 July 2016.
  2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.