మోపిదేవి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మోపిదేవి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కొల్లి చక్రపాణి
జనాభా (2001)
 - మొత్తం 6,686
 - పురుషుల సంఖ్య 3,319
 - స్త్రీల సంఖ్య 3,367
 - గృహాల సంఖ్య 1,846
పిన్ కోడ్ 521 125
ఎస్.టి.డి కోడ్ 08671
మోపిదేవి
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో మోపిదేవి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో మోపిదేవి మండలం యొక్క స్థానము
మోపిదేవి is located in Andhra Pradesh
మోపిదేవి
ఆంధ్రప్రదేశ్ పటములో మోపిదేవి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°03′51″N 80°55′33″E / 16.0642175°N 80.9259582°E / 16.0642175; 80.9259582
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము మోపిదేవి
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 36,012
 - పురుషులు 18,071
 - స్త్రీలు 17,941
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.35%
 - పురుషులు 66.89%
 - స్త్రీలు 55.81%
పిన్ కోడ్ 521125

మోపిదేవి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండల కేంద్రము. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి.కోడ్ = 08671.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం, చరిత్ర[మార్చు]

సకలేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలు

మోపిదేవి మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్నది. స్థలపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి స్వయంభూలింగం. వీరారపు పర్వతాలు అనే కుమ్మరి శివభక్తుని భక్తికి మెచ్చి శివుడు కలలో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమలపుట్టను త్రవ్వి తన లింగాన్ని బయల్పరచమని ఆదేశించాడు. పర్వతాలు తన కల గురించి గ్రామస్థులకు తెలియజేసి కలలో కనిపించిన ప్రదేశంలో చీమలపుట్టను త్రవ్వాడు. ఆశ్చర్యకరంగా బయల్పడిన లింగాన్ని ఆ చీమలపుట్టపైనే ప్రతిష్టించి గ్రామస్థులు పూజించడం ప్రారంభించారు. పర్వతాలు గుఱ్ఱము, నంది, కోడి మరియు గరుత్మంతుని విగ్రహాలను బంకమన్నుతో తయారుచేశాడు. మహాఋషుల విగ్రహాలను కూడా బంకమన్నుతో తయారుచేసి బట్టిలో కాల్చి కలకాలం చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చల్లపల్లి జమిందారీ కుటుంబం యొక్క ఇలవేల్పు. ఇప్పటికీ వీరి ఆధ్యర్యంలోనే ఆలయ నిర్వహణ కొనసాగుతున్నది.

నాగశిల[మార్చు]

ఈ ఆలయ ఆవరణలో, 2014, ఆగష్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం నాడు, నాగమల్లి వృక్షం వద్ద, నాగశిల ప్రతిష్ఠ కోసం, గూడపాడుకు చెందిన శ్రీ కోట భాస్కరరావు, రాజారావు, సూర్యప్రకాశరావు దంపతులు, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ప్రతిష్ఠించనున్న నాగశిలకు, వేదమంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య, అర్చకులు, ఈ దంపతులచే ప్రతిష్ఠకు సంబంధించిన పూజలు చేయించినారు. [6]

దేవస్థానం చిరునామా[మార్చు]

అసిస్టెంట్ కమిషనర్ & ఎక్జెక్యూటివ్ ఆఫీసర్, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం, మోపిదేవి గ్రామము మరియు మండలం. కృష్ణా జిల్లా. pin 521 125.

 • ఫోన్ నం. 08671/257240., సెల్ = 9491000723., ఇ.మెయిల్:- ap_eo_estatetemples@yahoo.co.in

మోపిదేవి గ్రామములోని ఇతర ఆలయాలు[మార్చు]

 1. శ్రీ గంగా పార్వతీ సమేత సకలేశ్వరస్వామి ఆలయం:- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే మరో ప్రసిద్ధ ఆలయం - శ్రీ గంగా పార్వతీ సమేత, సకలేశ్వరస్వామి ఆలయం ఉన్నది. ఇది కూడా స్వయంభూలింగమే సగర మహారాజు పూజించిన లింగం కావడంతో ఆ పేరు వచ్చింది. 1783లో మోపిదేవి వరదలలో కొట్టుకుపోయినప్పుడు ఈ లింగం బయల్పడింది. అప్పటి జమీందారైన అడుసుమిల్లి గంగుభొట్లు ఆలయం నిర్మింపజేశాడు. అయితే ఆ లింగం భూమిలో ఇంకా ఎంత లోతువరకు విస్తరించి ఉన్నదో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ ఆలయ నిర్వహణ అడుసుమిల్లి కుటుంబం చేతిలో ఉన్నది. ఈ స్వామివారి కళ్యాణం, ప్రతి సంవత్సరం, మహాశివరాత్రికి రెండు రోజులముందు నిర్వహించెదరు. ఈ రెండు ఆలయాలను సందర్శించడానికి భక్తులు ఆంధ్రదేశమంతటి నుండి విచ్చేస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, దసరా పండుగ సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.
 2. శ్రీ రామాలయం:- మోపిదేవి బస్సుస్టాండ్ ప్రాంతంలో నెలకొన్న ఈ ఆలయంలో 2015,ఆగష్టు-16వ తేదీ ఆదివారం నాడు, పోతురాజు శిలల ప్రతిష్ఠాపన కార్యక్రమం, అత్యంత వైభవంగా నిర్వహించినారు. ప్రతిష్ఠించవలసిన శిలలను శనివారం రాత్రి, జాగరణతో గ్రామోత్సవం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన రెండువేల మందికి పైగా భక్తులకు, మద్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహించినారు. [11]
 3. శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- మోపిదేవి గ్రామంలోని బి.సి.కాలనీలో 2014, ఆగష్టు-3వ తేదీ ఆదివారం నాడు, శ్రీ అంకమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. యార్లగడ్డ వంశస్తుల ఇలదేవత అగు శ్రీ అంకమ్మ దేవత, పోతురాజు శిలలను, గ్రామోత్సవం నిర్వహించి, దేవాలయంలో ప్రతిష్ఠించినారు. యార్లగడ్డ వంశస్తులైన 30 కుటుంబాలవారు, 200మంది భక్తులు, ప్రతిష్ఠించిన అమ్మవారిని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దూరప్రాంతాలలో ఉన్న యార్లగడ్డ వంశస్థులు పాల్గొన్నారు. [5]
 4. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- మోపిదేవి వార్ఫు ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. [9]

సమీప దేవాలయాలు[మార్చు]

మరకత రాజేశ్వరి

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

 1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08671/247257.,సెల్=9908524842.
 2. కెనారా బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను 2015,నవంబరు-19న ప్రారంభించినారు. [14]

కావూరు రమేష్ బాబు స్మారక ప్రాధమిక అరోగ్య కేంద్రం[మార్చు]

ఈ కేంద్రానికి, శ్రీ కావూరి రమేష్ బాబు, లక్షలాది రూపాయల విలువైన 20 సెంట్ల స్థలాన్ని, 2003లో వితరణ చేసినారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసి, అ స్థలంలో భవనం నిర్మించినారు. [13]

పశువైద్యశాల[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. గంజివాని పాలెం గ్రామం, మోపిదేవి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.
 2. 2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొల్లి చక్రపాణి సర్పంచిగా గెలుపొందారు. వీరు 2016,మే-7వతేదీ శనివారం ఉదయం, పదవిలో ఉండగానే, మోపిదేవిలోని తన స్వగృహంలో, హఠాత్తుగా, గుండెపోటుతో కన్నుమూసినారు. [2]&[16]

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

 1. ఈ పాఠశాలలో చదువుచున్న కర్లపూడి పావని అను విద్యార్థిని, డిసెంబరు/2013 లో, చండీఘర్ లో జరుగు జాతీయస్థాయి త్రోబాలు పోటీలకు, అండర్-14 విభాగంలో పాల్గొనుటకు ఎంపికైనది. [3]
 2. ఈ పాఠశాల, 2014,ఫిబ్రవరి-19న, 65వ వార్షికోత్సవం జరుపుకున్నది. [4]
 3. ఈ పాఠశాలలో చదివిన కొక్కిలిగడ్డ కిన్నెర అను విద్యార్థిని, 10వ తరగతి 556 మార్కులతో ఉత్తీర్ణురాలై, నూజివీడులోని ఐ.ఐ.ఐ.టి. లో సీటు సాధించినది. అక్కడ మొదటి సంవత్సరం బి.టెక్. చదువుచున్న ఈమె, 2014,మే-14 నుండి 18 వరకు అమెరికాలోని "నాసా" అంతరిక్ష పరిశోధన సంస్థ వారు నిర్వహించిన పోటీలలో పాల్గొని, ప్రదర్శించిన ఎథేనా-2014(ATHENA-2014) ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో రెండవ స్థానం లభించినది. రాతియుగం నుండి రాకెట్ యుగం వరకు సాధించిన ప్రగతిని శాశ్వతంగా, అత్యాధునిక సౌకర్యాలు అనుభవించాలంటే ఏమి చేయాలన్న విషయమై ఈమె రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలనందుకున్నది. దీనిద్వారా అంతరిక్షంలో కృత్రిమ నివాస ప్రాంతం రూపొందించి, అక్కడ ఎదురయ్యే సమస్యలను ముందుగానే ఊహించి, పరిష్కార మార్గాలను ఈమె తన ప్రాజెక్టు ద్వారా వివరించినది.[ఈనాడు కృష్ణా; 2014,మే-30; 11వ పేజీ.]
 4. ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన కొండేటి కళ్యాణి అను విద్యార్థిని, ఈ పాఠశాలలోనే తొలిసారిగా, 10/10 గ్రేడ్ మార్కులు సాధించి, పాఠశాలకే ఎనలేని గుర్తింపు తెచ్చినది. [10]
 5. ఈ పాఠశాలో ప్రవాస భారతీయులైన దాతల ఆర్ధిక సహకారంతో, 2015,ఆగస్టు-11వ తేదీనాడు, డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. [11]
 6. ఈ పాఠశాల విద్యార్థి కారుమూరి నాగమల్లేశ్వరరావు, రాష్ట్రస్థాయిలో నిర్వహించు పాఠశాలల క్రీడాపోటీలలో, అండర్-16 విభాగంలో పాల్గొనడానికి ఎంపికైనాడు. [12]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల[మార్చు]

ఈ పాఠశాల స్థానిక ప్రజాశక్తినగర్ లో ఉన్నది. ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చ్-12వ తేదీ నాడు నిర్వహించెదరు. [8]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల[మార్చు]

 1. ఈ పాఠశాల విద్యార్ధులు, పాఠశాల స్థాపించిన 2003-2004 నుండి ఇప్పటివరకు, 10వ తరగతి పరీక్షలలో, వరుసగా 11వ సారి, 100% ఉత్తీర్ణత సాధించి రికార్డులకెక్కినారు. [4]
 2. ఈ పాఠశాలలో, 2014,డిసెంబరు-15 నుండి 17 వరకు, మహాత్మా పూలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల పాఠశాలల, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించినారు. ఈ పోటీలలో, 31 పాఠశాలలకు చెందిన 1,000 మంది క్రీడాకారులు, బాలబాలికల జట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలీబాల్, ఖో-ఖో, షటిల్ బాడ్మింటన్, కబడ్డీ, టెన్నికాయిట్, చదరంగం విభాగాలలోనూ, అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్, షాట్ పుట్, థ్రోబాల్, హైజంప్, లాంగ్ జంప్ తదితర పోటీలు నిర్వహించినారు. ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడాపోటీలు, సాయంత్రం సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు నిర్వహించినారు. [6] & [7]
 3. ఇటీవల గుడివాడలోని నందమూరి తారకరామరావు స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పైకా వాలీబాల్ పోటీలలో, ఆంధ్రప్రదేశ్ జట్టు విజేతగా నిలిచి, స్వర్ణపతకం సాధించినది. ఈ జట్టులో ఈ గురుకుల పాఠశాల విద్యార్ధి అర్జున్ ప్రధాన భాగస్వామ్య పాత్ర పోషించి, జట్టు విజయంలో కీలక పాత్ర వహించినాడు. [15]

మండలంలోని గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అన్నవరం 258 896 444 452
2. అయోధ్య 58 177 89 88
3. బొబ్బర్లంక 225 834 401 433
4. చిరువోలు 185 682 353 329
5. కప్తానుపాలెం 408 1,488 755 733
6. కొక్కిలిగడ్డ 1,194 4,543 2,330 2,213
7. మెల్లమర్రు 53 195 101 94
8. మెల్లమర్తిలంక 188 636 325 311
9. మెరకనపల్లి 315 1,089 544 545
10. మోపిదేవి 1,846 6,686 3,319 3,367
11. మోపిదేవిలంక 210 718 377 341
12. నాగాయతిప్ప 504 1,795 890 905
13. చిరువోలులంక ఉత్తరం 1,164 3,820 1,932 1,888
14. పెదకళ్ళేపల్లి 1,962 7,214 3,623 3,591
15. పెదప్రోలు 955 3,506 1,739 1,767
16. టేకుపల్లి 100 372 182 190
17. వెంకటాపురం 374 1,361 667 694

వనరులు[మార్చు]

 1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,సెప్టెంబరు-26; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-25; 3వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-1; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014 ఆగష్టు-4; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-13; 15వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-18; 10వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-11; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-23; 2వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-11; 2వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-17; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా; 2015 ఆగష్టు-26; 15వపేజీ. [13] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 39వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-20; 40వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2016,జనవరి-26; 41వపేజీ. [16] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-8; 1వపేజీ
"https://te.wikipedia.org/w/index.php?title=మోపిదేవి&oldid=1876495" నుండి వెలికితీశారు