సింహాద్రి సత్యనారాయణ
సింహాద్రి సత్యనారాయణ | |
---|---|
జననం | సింహాద్రి సత్యనారాయణ అక్టోబర్ 19 , 1929 కృష్ణా జిల్లా అవనిగడ్డ, బందలాయిచెరువు |
మరణం | సెప్టెంబర్ 24, 2010 ( వయసు 81 ) |
ఇతర పేర్లు | దేవుడి మంత్రి |
వృత్తి | న్యాయవాది దేవాదాయశాఖ మంత్రి వాణిజ్య శాఖా మంత్రి |
మతం | హిందు |
పిల్లలు | డా.సింహాద్రి చంద్రశేఖరరావు |
సింహాద్రి సత్యనారాయణ (అక్టోబర్ 19 , 1929 - సెప్టెంబర్ 24, 2010). మాడుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన లా చదివారు. 30 ఏళ్ల పాటు న్యాయవాదిగా ఆవనిగడ్డలోనే పనిచేశారు.
జననం
[మార్చు]1929లో అవనిగడ్డ మండలం లోని బందలాయిచెరువు గ్రామంలో పుట్టారు.
రాజకీయ జీవితం
[మార్చు]ఆనంతరం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీపై అభిమానంతో మొదటినుండి ఆ పార్టీలో పనిచేశారు. 1985లో తెలుగు దేశం పార్టీ ఆయనకు అవనిగడ్డనుండి పోటీ చేయడానికి టిక్కెట్ ఇచ్చింది. మొదటిసారి పోటీ చేసిన ఆయన గెలిచారు. ఆనంతరం 1988లో పోటీ చేసి గెలిచాడు. ఎన్టీఆర్ సింహాద్రి ఈమారు దేవాదాయశాఖను అప్పగించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న తరుణంలో సైతం ఆయన స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. 1995లో విజయవాడనుంచి పోటీ చేసి గెలిచారు. వాణిజ్య మంత్రిత్వ శాఖను ఆయనకు అప్పగించారు. 1999లో రాజకీయాలంటే విరక్తి పుట్టిన ఆయన రాజకీయాలకు స్వస్తీ చెప్పారు. ఆయితే 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నేటి అవినీతి రాజకీయాలతో పోటీ పడి గెలవలేక పోయారు. రెండుసార్లు దేవాదాయ శాఖను చేపట్టడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆయన్ను దేవుడి మంత్రిగా పిలుస్తారు.ఆ ప్రాంతంలో ఆయన హయాంలో పలు టిటిడి మండపాలు కట్టించారు. ఎత్తిపోతల పథకాలకు భారీ నిధులు కేటాయించారు.[1]
నిజాయితీ,విలువలు
[మార్చు]నిజాయితీకి ఆయన నిలువుటద్దం. ఎన్నికల్లో వాగ్ధానాలు చేస్తే వాటిని తప్పకుండా ఆమలు పరిచేవారు. ఇప్పటి రాజకీయ నాయకులలాగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యటంలా కాకుండా గెలిచిన తర్వాత ప్రజల్లో ఉండి వారి సాధక బాధలను గమనించేవాడు.లోక్ సత్తా పార్టీ రాష్ట్రంలోని నిజాయితీగల రాజకీయ నాయకుల పేర్లను ప్రకటించింది. అందులో సింహాద్రి సత్యనారాయణనే మొదటి స్థానంలో ఉండటం ఆయన రాజకీయ జీవితం ఎంత స్వచ్ఛమైనదో చెబుతుంది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సింహాద్రి సత్యనారాయణకు భార్య, ఏకైక కుమారుడు చంద్రశేఖరరావు ఉన్నారు.కుమారుడు డా.సింహాద్రి చంద్రశేఖరరావు దేశంలోనే క్యాన్సర్ చికిత్సా నిపుణులలో ఒకరిగా ప్రఖ్యాతి చెందారు. వైద్యవృత్తిలో పేదలపట్ల కరుణారసం చూపించే చంద్రశేఖరరావు తన తండ్రి తనకు ఉగ్గుపాలతో నేర్పిన గుణం పేదలకు సహాయం చేయడం.[2]
మరణం
[మార్చు]అస్వస్ధతగా వున్న ఆయనను విజయవాడ నాగార్జున ఆసుపత్రిలో చేర్పించారు.శుక్రవారం సెప్టెంబరు 24, 2010 మధ్యాహ్నం 2.20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.