కృష్ణా జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?కృష్ణా జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
View of కృష్ణా జిల్లా, India
అక్షాంశరేఖాంశాలు: 16°11′N 81°08′E / 16.19°N 81.14°E / 16.19; 81.14
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 8,727 కి.మీ² (3,370 చ.మై)
ముఖ్య పట్టణము మచిలీపట్నం
ప్రాంతం కోస్తా
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
45,29,009 (2011 నాటికి)
• 519/కి.మీ² (1,344/చ.మై)
• 2268312
• 2260697
• 74.37(2001)
• 79.13
• 69.62

కృష్ణా జిల్లాకు [1] ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో నల్గొండ జిల్లా ఉన్నాయి.

విషయ సూచిక

జిల్లా చరిత్ర[మార్చు]

అంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాలు

కృష్ణా పరీవాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమశివుని ఉద్దేశించి తపమాచరించాడని, దుర్గాదేవి ఇక్కడ మహిశాసురుడిని సంహారం చేసిందని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనక దుర్గాదేవి భక్తజన పూజలను అందుకొంటూ ఉంది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. మొవ్వ గ్రామము లోని కృష్ణుని దేవాలయము చాలా పురాతనమైనది. ఈ ఊరి స్థల పురాణము ప్రకారం మౌద్గల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అంతే కాక చదువు రాని వరదయ్య తరువాతి కాలంలో క్షేత్రయ్యగా స్వామి కృపతో గొప్ప కవి అయ్యాడని ప్రతీతి. క్షేత్రయ్య రాసిన శృంగార కవిత్వం ఎంతో ప్రసిద్ధి. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు.

శాతవాహనుల కాలం[మార్చు]

శ్రీకాకుళం రాజధానిగా శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహన రాజులు నాలుగు శతాబ్దాల కాలం పాటూ ఈ ప్రదేశాన్ని పాలించారు.

పల్లవులు[మార్చు]

గుంటూరు జిల్లా మైదవోలులో లభించిన తామ్ర శాసనాలననుసరించి పల్లవులు ఈ ప్రాంతాన్ని 250 నుండి 340 క్రీ.శ॥ వరకూ పాలించారు.

బృహత్పలాయనులు[మార్చు]

వీరు కోడూరు రాజధానిగా ఈ జిల్లా ప్రాంతాన్ని పల్లవుల తదుపరి పాలించారు.

విష్ణు కుండినులు[మార్చు]

వీరు క్రీ.శ॥5వ శతాబ్దంలో పాలించారు. వీరి కాలంలోనే మొగల్రాజపురం ఇంకా ఉండవల్లిలోని గుహలు తవ్వించి తీర్చిదిద్దబడ్డాయి.

తూర్పు చాళుక్యులు[మార్చు]

వీరు ఉండవల్లిలోని గుహామందిరాలు ఇంకా శివాలయాలు కట్టించారు.

కాకతీయులు[మార్చు]

క్రీ.శ॥1323 వరకు వీరి పాలన జరిగింది. వీరి కాలంలో జిల్లాలోని ఎన్నో దేవాలయాలు పోషించబడ్డాయి.

రెడ్డిరాజులు[మార్చు]

కొండపల్లిలోని కోట శిథిలాలు వీరి పాలనకు తార్కాణంగా నిలుస్తాయి.

గజపతులు[మార్చు]

రెడ్డిరాజుల అనంతరం గజపతుల పాలనలో కృష్ణా జిల్లా ప్రాంతం వచ్చింది. ప్రస్తుత పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురం గజపతి రాజయిన కపిలేశ్వర గజపతి పేరున నామకరణం చేయబడింది. కపిలేశ్వర గజపతి తదుపరి వచ్చిన విద్యాధర గజపతి విజయవాడలోని విద్యాధరపురాన్ని ఇంకా కొండపల్లి సరస్సుని నిర్మించాడు.

విజయనగర సామ్రాజ్యం[మార్చు]

విజయనగర సామ్రాజ్య కాలంలో జిల్లాలో ఎన్నో దేవాలయాలు, కోటలు వెలిశాయి. జీర్ణ దేవాలయాలు ఉద్ధరింపబడ్డాయి. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలోనే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను రచించి అంకితమిచ్చాడు.

కుతుబ్ షాహీలు[మార్చు]

క్రీ.శ॥1512 లో గోల్కొండ వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రజ్యంలో జిల్లా కూడా ఒక భాగమే. మచిలీపట్నం ఓడ రేవుగా ఎగుమతి-దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుసేన్ షా మంత్రులయిన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు కనక దుర్గ అమ్మవారిని ఆరాధించేవారు. నేటికీ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి.

నిజాములు[మార్చు]

ఔరంగ్‍జేబు సామ్రాజ్యంలో భాగమయిన గోల్కొండను 5 నవాబులకు విభజించి ఆసఫ్ ఝా సుబేదారుగా పాలించాడు. ఆర్కాటు, కడప, కర్నూలు, రాజమండ్రి మరియు చీకకోల్(శ్రీకాకుళం) నవాబుల కింద పాలించబడ్డాయి. రాజమండ్రి నవాబు కృష్ణా జిల్లాను పాలించేవాడు.

ఆంగ్లేయులు[మార్చు]

క్రీ.శ॥1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నంలో బస చేసారు. 1641 లో మద్రాసుకు తరిలి వెళ్ళే వరకూ ఇది వారికి ముఖ్యపట్నం(హెడ్‍క్వార్టర్)గా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి మరియు ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748 లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో జిల్లా ఆంగ్లేయులు మరియు ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు మచిలీపట్నం నిజాం పట్నం ఇంకా కొండవీడులో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుక ఇచ్చాడు. మెల్లిగా సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది.

వృత్తి[మార్చు]

పట్టణ ప్రాంత ప్రజలలో ఎక్కువ మంది వ్యాపారంలో ఉండగా, గ్రామాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి.

నదులు[మార్చు]

కృష్ణా నది(పొడవు 1280 కి.మీ.) జిల్లాలో ప్రవహించే ముఖ్యమయిన నది. బుడమేరు, మున్నేరు మరియు తమ్మిలేరు ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి మరియు నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది.

ముఖ్యమయిన పట్టణాలు[మార్చు]

విజయవాడ, గుడివాడ, ఉయ్యూరు,మచిలీపట్నం,చల్లపల్లి, కొండపల్లి, తిరువూరు, కైకలూరు, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, మొవ్వ మొ॥ ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు. జిల్లాలోని హనుమాన్ జంక్షన్ కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిసి నూజివీడు-మచిలీపట్నం రహదారికిరువైపులా ఉంటాయి. అలాగే మూడు మండలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న హనుమంతుని ఆలయము చాలా విశిష్టమైనది. పట్టణానికి ఆ పేరు ఈ ఆలయము వలన వచ్చినదే.

భౌగోళిక స్వరూపం[మార్చు]

 • కృష్ణా జిల్లా పీఠభూమి మరియు తీర ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశ అత్యంత పర్యావరణ సంబంధిత ముఖ్యమైన చిత్తడినేలలో కొల్లేరు సరస్సు ఒకటి ఈజిల్లా లోనే పాక్షికంగా ఉంది.

కొండలు[మార్చు]

నీటివనరులు[మార్చు]

కృష్ణ నది మీదుగా విజయవాడ వద్ద ప్రకాశం బారేజి

భూమి మరియు భూగర్భ వనరులు[మార్చు]

 • జిల్లాలో నల్లమట్టి (57.6%), ఇసుక బంకమట్టి (22.3%) ఎర్ర బంకమట్టి (19.4%) అను మూడు రకాల నేలలు ఉన్నాయి.
ఆంశం కొలమానం సంఖ్య మూలం
మైనింగ్ & గనుల త్రవ్వకం  % 0.45 1991 జనాభా లెక్కల ప్రకారం
 • విస్తృతంగా సహజ వాయువు మరియు ముడి పెట్రోల్ నిక్షేపాలు తీరం వెంబడి సముద్రం మరియు జిల్లా యొక్క తీర ప్రాంతములో ఉన్నాయి.
 • కొద్దిపాటి వజ్రాల చిన్న చిన్న నిక్షేపాలు లభిస్తాయి.
 • సున్నపురాయి ప్రధాన ఖనిజముగా ఈ జిల్లా నుండి సేకరిస్తారు.
 • భవన నిర్మాణం కోసం వాడబడే ఇసుకను కృష్ణ మరియు మున్నేరు నదుల నుండి త్రవ్వకాలు జరిపి సేకరిస్తారు.
 • ఖనిజాలు దొరుకు ప్రాంతములు:
 • క్రోమైటు : కొడపల్లి కొండలు మరియు దగ్గర ప్రాంతాలలో
 • వజ్రాలు : పరిటాల, ఉస్తేపల్లి, కొండవీటికల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు మరియు పుట్రేల (రాజస్థాన్ లో ప్రముఖ మైనవి) మొదలైన ప్రాంతాలు.
 • ఇనుము ధాతువు : జగ్గయ్యపేట ప్రాంతం.
 • సున్నపురాయి : జగ్గయ్యపేట ప్రాంతం.
 • మైకా : తిరువూరు ప్రాంతం.

ఆటవీ ప్రదేశం[మార్చు]

ఆంశం కొలమానం సంఖ్య మూలం
అటవీ ప్రాతం  % 7.5 1997-98 లెక్కల ప్రకారం (సుమారు 9% ఉజ్జాయింపుగా ఉండవచ్చును.)

వాతావరణం[మార్చు]

 • జిల్లా వాతావరణ పరిస్థితులు వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తేలికపాటిగా ఉంటాయి. అంతేకాక ఇక్కడి వాతావరణం పరిస్థితులు ఉష్ణ ప్రాంతములుగా వర్గీకరింపబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంది. ఈ ప్రాంతంనకు నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 1028 మి.మీ. అందించబడుతుంది.

ఆర్ధిక స్థితి గతులు[మార్చు]

వ్యవసాయం[మార్చు]

వ్యవసాయం గురించిన సమగ్రసమాచారం [2] కంప్యూటర్ ద్వారా అందుబాటులో ఉంది. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లగల కంప్యూటర్ మరియు ప్రొజెక్టర్ ద్వారా రైతులకు అందుబాటులోనికి తెస్తున్నారు.

వ్యాపారం[మార్చు]

 • కృష్ణా జిల్లా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారము మరియు వాణిజ్యం లతో నిమగ్నమై ఉన్నారు. వ్యవసాయం జిల్లా ప్రజల యొక్క అతి ముఖ్యమైన వృత్తిగా ఉంది.
ఆంశం కొలమానం సంఖ్య మూలం
వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలు  % 66.18 1991 జనాభా లెక్కల ప్రకారం
స్థూల సాగునీటి ప్రాంతం  % 62.00 1997-98 లెక్కల ప్రకారం
తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి కి.గ్రా. 321 1997-98 లెక్కల ప్రకారం
 • కృష్ణా జిల్లాలో ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా అనేక పరిశ్రమలకు ఆతెధ్యము ఇస్తున్నది. వాటిలో కెసీపి చక్కెర కర్మాగారం చెప్పుకోతగ్గది. ఉయ్యూరు వద్ద ఉన్న KCP షుగర్ ఫ్యాక్టరీ భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి. ఇబ్రహీంపట్నం సమీపంలో, విజయవాడ థర్మల్ పవర్ స్టేషను (VTPS) దాని పనితీరునకు భారతదేశంలో నం .1 అధిక పవర్ ఉత్పత్తి యూనిట్‌గా స్థానం పొందింది. ఇది కాక, అనేక మీడియం స్కేల్ సిమెంట్ కర్మాగారాలు జిల్లా అంతటా ఉన్నాయి. మచిలీపట్నం వద్ద బంగారం-లేపనం ఆభరణాలు, కొండపల్లి వద్ద బొమ్మలు మరియు జగ్గయ్యపేట వద్ద సంగీత సాధన తయారీ పరికరాలు వంటి పలు చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.
ఆంశం కొలమానం సంఖ్య మూలం
మాన్యుఫాక్చరింగ్ (గృహేతర) పరిశ్రమలు  % 6.18 1991 జనాభా లెక్కల ప్రకారం
గృహ పరిశ్రమలు  % 2.39 1991 జనాభా లెక్కల ప్రకారం
నిర్మాణము  % 1.61 1991 జనాభా లెక్కల ప్రకారం
సేవలు  % 23.09 1991 జనాభా లెక్కల ప్రకారం
 • విజయవాడ వద్ద సిరీస్ (SIRIS) ఫార్మాస్యూటికల్ కంపెనీ, అలోపతిక్ మందులు తయారీ దిగ్గజాలలో ఇది మరొక సంస్థ. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన పోర్ట్ మచిలీపట్నంలో ఉంది. ఇదికాక ఎన్నో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. విజయవాడ దగ్గర ఇబ్రహీమ్ పట్నం వద్ద ఉన్న తాప విద్యుత్కేంద్రం చాలా పేరెన్నికగన్నది. ఇవికాక మచిలీపట్నంలో గిల్టునగల తయారీ, కొండపల్లి చెక్కబొమ్మలు, జగ్గయ్యపేటలో సంగీత సాధనముల తయారీ మొదలయిన చేతి వృత్తి పనులు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్య రీతి యైన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పుట్టింది.

జీవనస్థాయి[మార్చు]

 • ఈ జిల్లాలో ఉన్న 4.187.841 (2001 నాటికి) జనాభాలో 32,08% శాతం పట్టణ జనాభా. జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయం మచిలీపట్నంలో ఉంది. విజయవాడకార్పొరేషన్ జిల్లా ప్రముఖ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉంది.
ఆంశం కొలమానం సంఖ్య మూలం
పట్టణీకరణం  % 35.82 1991 జనాభా లెక్కల ప్రకారం
మొత్తం జనాభాలో పనివారి శాతం  % 43.3 1991 జనాభా లెక్కల ప్రకారం

ఆర్థిక గణాంకాలు[మార్చు]

ఆంశం కొలమానం సంఖ్య మూలం
తపాలా కార్యాలయములు (ప్రతి 100,000 మంది జనాభా) నిష్పత్తి 22.04 1996-97 లెక్కల ప్రకారం
బ్యాంకులు (ప్రతి 100,000 మంది జనాభా) నిష్పత్తి 9.33 1994-95 లెక్కల ప్రకారం
తలసరి బ్యాంకు డిపాజిట్లు రూ. 3386.42 1994-95 లెక్కల ప్రకారం
తలసరి బ్యాంకు ఋణాలు రూ. 2250.49 1994-95 లెక్కల ప్రకారం
వ్యవసాయానికి తలసరి బ్యాంకు ఋణాలు రూ. 604.49 1994-95 లెక్కల ప్రకారం
ఎస్.ఎస్.ఐ.(SSI)లకి తలసరి బ్యాంకు ఋణాలు రూ. 168.67 1994-95 లెక్కల ప్రకారం
పరిశ్రమలకు తలసరి బ్యాంకు ఋణాలు రూ. 490.86 1994-95 లెక్కల ప్రకారం

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు[మార్చు]

భౌగోళికంగా కృష్ణా జిల్లాను 50 రెవిన్యూ మండలాలుగా విభజించారు.[3].

కృష్ణా జిల్లా మండలాలు, రెవెన్యు విభాగాలు
కృష్ణా జిల్లా లోని మండలాలు
1 జగ్గయ్యపేట 18 పెనమలూరు 35 నాగాయలంక
2 వత్సవాయి 19 తోట్లవల్లూరు 36 కోడూరు
3 పెనుగంచిప్రోలు 20 కంకిపాడు 37 మచిలీపట్నం
4 నందిగామ 21 గన్నవరం 38 గూడూరు
5 చందర్లపాడు 22 అగిరిపల్లి 39 పామర్రు
6 కంచికచెర్ల 23 నూజివీడు 40 పెదపారుపూడి
7 వీరులపాడు 24 చాట్రాయి 41 నందివాడ
8 ఇబ్రహీంపట్నం 25 ముసునూరు 42 గుడివాడ
9 జి.కొండూరు 26 బాపులపాడు 43 గుడ్లవల్లేరు
10 మైలవరం 27 ఉంగుటూరు 44 పెడన
11 ఏ.కొండూరు 28 ఉయ్యూరు 45 బంటుమిల్లి
12 గంపలగూడెం 29 పమిడిముక్కల 46 ముదినేపల్లి
13 తిరువూరు 30 మొవ్వ 47 మండవల్లి
14 విస్సన్నపేట 31 ఘంటసాల 48 కైకలూరు
15 రెడ్డిగూడెం 32 చల్లపల్లి 49 కలిదిండి
16 విజయవాడ గ్రామీణ 33 మోపిదేవి 50 కృతివెన్ను
17 విజయవాడ పట్టణం 34 అవనిగడ్డ

లోకసభ నియోజకవర్గాలు[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

 • ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
2014 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు తెలిపే పటము
(పసుపురంగులో తెదెపా+భజపా కూటమి గెలిచిన స్థానాలు)
(నీలం రంగులో వైకాపా గెలిచిన స్థానాలు)
క్ర.సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం విజేత పార్టీ
188 తిరువూరు కెఆర్ నిధి వై.కా.పా
189 నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వై.కా.పా
190 గన్నవరం వల్లభనేని వంశీ తె.దే.పా
191 గుడివాడ కొడాలి నాని వై.కా.పా
192 కైకలూరు కామినేని శ్రీనివాసరావు భాజపా
193 పెడన కాగిత వెంకట్రావు తె.దే.పా
194 మచిలీపట్నం కొల్లు రవీంద్ర తె.దే.పా
195 అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ తె.దే.పా
196 పామర్రు ఉప్పులేటి కల్పన వై.కా.పా
197 పెనమలూరు బోడె ప్రసాద్ తె.దే.పా
198 విజయవాడ పశ్చిమ జలీల్ ఖాన్ వై.కా.పా
199 విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు తె.దే.పా
200 విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు తె.దే.పా
201 మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు తె.దే.పా
202 నందిగామ తంగిరాల ప్రభాకరరావు తె.దే.పా
203 జగ్గయ్యపేట శ్రీ రామ రాజగోపాల్ (తాతయ్య) తె.దే.పా

పార్టీలు[మార్చు]

రవాణా వ్వవస్థ[మార్చు]

 • విజయవాడ వద్ద పండిట్ నెహ్రూ బస్ స్టేషను ఆసియాలోని అతి పెద్ద బస్ కాంప్లెక్స్‌లలో ఒకటి.
 • విజయవాడ వద్ద రైల్వే స్టేషను భారతదేశంలో 2 వ రద్దీగా ఉండే జంక్షన్ ఉంది. 200 కంటే ఎక్కువ రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా (పాస్) ప్రయాణించడము మరియు రైల్వే స్టేషను వద్ద రైలు ఆగిపోవడము లేదా (ప్రారంభము) బయలుదేరడము కాని జరుగుతుంది.
 • విజయవాడకు ఈశాన్యదిశలో 16 కి.మీ. దూరములో గన్నవరము వద్ద ఉన్న విమానాశ్రయం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, రాజమండ్రి నగరములకు అనుసంధానముతో విమాన ప్రయాణమునకు వీలు ఉంది.
ఆంశం కొలమానం సంఖ్య మూలం
రహదారి పొడవు ప్రతి 100 చ.కి.మీ. కి.మీ. 78.76 1996-97 లెక్కల ప్రకారం
రైలు మార్గము పొడవు ప్రతి 100 చ.కి.మీ. కి.మీ. 2.14 1996-97 లెక్కల ప్రకారం
 • నాలుగు జాతీయ రహదారులు ఈ జిల్లా నుండి కలుపుతున్నాయి.
 1. కోల్‌కత నుండి చెన్నై = NH-5
 2. మచిలీపట్నం నుండి పూనే = NH-9
 3. జగదల్‌పూర్ నుండి విజయవాడ = NH-221
 4. ఒంగోలు నుండి కత్తిపూడి = NH-214

కృష్ణా జిల్లా రైల్వే స్టేషన్లు[మార్చు]

స్టేషను పేరు స్టేషను కోడ్ నగరం/పట్టణం
విజయవాడ బిజడ్‌ఎ విజయవాడ
విజయవాడ యుఎన్‌డబ్ల్యుసి విజయవాడ
విజయవాడ యుఎన్‌ఐసి విజయవాడ
విజయవాడ విఎన్‌సి విజయవాడ
విజయవాడ బిడబ్ల్యుడిసి విజయవాడ
విజయవాడ బిజడ్‌ఎడబ్ల్యు విజయవాడ
అంబాపురం ఎబిఎం అంబాపురం
చెరువు మాధవరం సివివి చెరువు మాధవరం
గుడివాడ జిడివి గుడివాడ
మచిలీపట్నం ఎమ్‌టిఎమ్ మచిలీపట్నం
మచిలీపట్నం ఫోర్ట్ ఎమ్‌టిఎఫ్ మచిలీపట్నం ఫోర్ట్
మధురానగర్ మధురానగర్, (పాత సత్యనారాయణపురం స్టేషనుకు బదులుగా), విజయవాడ
కొండపల్లి కెఐ కొండపల్లి
గన్నవరం గన్నవరం
ఇందుపల్లి ఇందుపల్లి
తాడేపల్లి టిపిఎల్ తాడేపల్లి
కైకలూరు కెకెఎల్‌ఆర్ కైకలూరు
ఉప్పలూరు ఉప్పలూరు
చెరువు మాధవరం చెరువు మాధవరం
తరిగొప్పుల తరిగొప్పుల
తెన్నేరు టిఎన్‌ఆర్‌యు తెన్నేరు
తేలప్రోలు తేలప్రోలు
దోసపాడు డిపిడి దోసపాడు
నిడమానూరు ఎన్‌డిఎమ్ నిడమానూరు, విజయవాడ
నూజివీడు ఎన్‌జడ్‌డి నూజివీడు, విజయవాడ
వెంట్రప్రగడ విపిజి వెంట్రప్రగడ
నూజెళ్ళ ఎన్‌యుజె నూజెళ్ళ
పల్లెవాడ పల్లెవాడ
పసలపూడి పిఎస్‌ఎల్‌పి పసలపూడి
పుట్లచెరువు పిసియు పుట్లచెరువు
పెడన పిఎవి పెడన
పెద ఆవుటపల్లి పిఎవిపి పెద ఆవుటపల్లి
మండవల్లి ఎమ్‌డివిఎల్ మండవల్లి
ముస్తాబాద ఎమ్‌బిడి ముస్తాబాద, విజయవాడ
మొఖాసా కలవపూడి ఎమ్‌విపి మొఖాసా కలవపూడి
మోటూరు ఒటిఆర్
రామవరప్పాడు ఆర్‌ఎమ్‌వి రామవరప్పాడు
రాయనపాడు ఆర్‌వైపి రాయనపాడు
రాయనపాడు షాప్ ఆర్‌వైపిఎస్ రాయనపాడు
వడ్లమన్నాడు విఎమ్‌డి వడ్లమన్నాడు
వీరవల్లి విఆర్‌విఎల్ వీరవల్లి
గుడ్లవల్లేరు జివిఎల్ గుడ్లవల్లేరు
చిలకలపూడి సిఎల్‌యు చిలకలపూడి
గంగినేని జిఎన్‌ఎన్ గంగినేని
గుణదల జిఎఎల్‌ఎ గుణదల
గుంటాకోడూరు గుంటాకోడూరు
కౌతవరం కెవిఎమ్ కౌతవరం
జగ్గయ్యపేట జెపిటిఎన్ జగ్గయ్యపేట
కృష్ణా కెఎస్‌ఎన్ కృష్ణా
మాచవరం ఎమ్‌సివిఎమ్ మాచవరం
మందపాడు ఎమ్‌డిపిడి మందపాడు
రెడ్డిగూడెం ఆర్‌ఈఎమ్ రెడ్డిగూడెం
తేలప్రోలు టిఒయు తేలప్రోలు

జనాభా లెక్కలు[మార్చు]

 • జనసాంద్రత అనేది ఒక జనాభా కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.
 • కృష్ణా జిల్లా 8.727 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఆక్రమించింది (3,370 sq mi),[4] ఈ జిల్లా సుమారు, తులనాత్మకంగా కోరిస్కాతో [5] సమానం.
ఆంశం కొలమానం సంఖ్య మూలం
ప్రదేశం చ.కి.మీ 8727 2001 జనాభా లెక్కల ప్రకారం
జనాభా వేలల్లో 4218.41 2001 జనాభా లెక్కల ప్రకారం
పురుషులు వేలల్లో 2151.18 2001 జనాభా లెక్కల ప్రకారం
స్తీలు వేలల్లో 2067.22 2001 జనాభా లెక్కల ప్రకారం
పట్టణ వేలల్లో 1365.64 2001 జనాభా లెక్కల ప్రకారం
గ్రామీణ వేలల్లో 2852.76 2001 జనాభా లెక్కల ప్రకారం
జనాభా పెరుగుదల (దశసంఖ్యతో సం.)  % +14.05 2001 జనాభా లెక్కల ప్రకారం
జనసాంద్రత (మనిషి/చ.కి.మీ.) నిష్పత్తి 483 2001 జనాభా లెక్కల ప్రకారం

విభాగాలు[మార్చు]

గృహోపకరణ సూచికలు[మార్చు]

 • 2007–2008 సంవత్సరములో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సంస్థ వారు జిల్లా అంతటా 1229 గృహాలు 34 గ్రామాలలో ఇంటర్వ్యూ జరిపారు.[6] వారు 94.7% విద్యుత్, 93,4% నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం, 60.3% టాయిలెట్ సౌకర్యాలు, మరియు 45.5 (శాశ్వత) నివాస గృహాసౌకర్యాలు ఉన్నట్లు కనుగొన్నారు.[6] 20.6% మంది స్త్రీలు అధికారక వయస్సు 18 సం.లు నిండక ముందే వివాహము చేసుకున్నారు.[7]
 • ఇంటర్వ్యూ నిర్వహించిన వారిలో 76,9% ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు.

సంస్కృతి[మార్చు]

 • ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య రూపం ఈ జిల్లాలో నుండి ఉద్భవించింది.[8]
 • ఈ జిల్లా వాసులు మాట్లాడే తెలుగు యాసను తెలుగు భాషయొక్క సహజరూపమని భావించబడుతుంది.[9]

పశుపక్ష్యాదులు[మార్చు]

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

 • జిల్లాలో చెప్పుకోదగ్గ అటవీప్రాంతం లేదు. అడవి మొత్తం జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో మరియు దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది. ఒక రకం అయిన పొనుకు (గైరోకాపస్ జాక్విని) అని పిలువబడే తేలికపాటి రకమయిన చెక్కకొండపల్లి కొండలు ప్రాంతములో కనిపిస్తుంది. ఈ చెక్కను ఎక్కువగా బాగా అందరికీ తెలిసిన కొండపల్లి బొమ్మలు తయారీకి ఉపయోగిస్తారు. చాలా గుర్తించదగ్గ చెట్లు అయిన టెరోకార్‌పస్, టెర్‌మినాలియా, ఎనోజీస్సస్, లోగస్ట్రోయినయ్ మరియు కాజురినా లాంటివి కూడా ఉన్నాయి.
 • పాంథర్స్ పులులు, దుమ్ములగొండులు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు మరియు ఇతర మాంసాహార క్షీరదాల జంతుజాలం ​​ఇక్కడ కనిపిస్తాయి. జింక, మచ్చల లేడి సాంబార్, కృష్ణ జింక మరియు ఇతర శాకాహార జంతువులు ఈ భూభాగ అడవులలో గుర్తించవచ్చు.
 • కృష్ణ జిల్లా సరిహద్దు కొల్లేరుసరస్సులో ఒక వలస బూడిద రంగు గల పెలికాన్ బిల్డ్ అనే ఒక రక్షిత పక్షి ఉంది.
 • ఈ జిల్లా అనేక ముర్రా జాతి గేదెలు మరియు ఆవులు పెద్ద సంఖ్యలో కలిగి ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

 • విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఒకటి.[9]
 • కృష్ణా జిల్లాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు:
 1. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ.
 2. కృష్ణ విశ్వవిద్యాలయం మచిలీపట్నం.
 3. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూజివీడు.
 4. దక్షిణ భారత శాఖ యొక్క స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం
 5. ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం
 • భారతదేశం లోనే కార్పొరేట్ విద్యా సంస్థలు అతిపెద్ద / పెద్ద /మధ్య రకములు అయిన, అనేక నివాస కళాశాలలు మరియు పాఠశాలలు కలిగి ఉన్న సంస్థలలో పేరెన్నికగన్న శ్రీ చైతన్య, నలందా, గౌతమ్, శ్రీ కృష్ణవేణి సంస్థలు, అమెరికన్ మెడికల్ విద్య (USMLE) శిక్షణ సంస్థల ప్రధాన కార్యాలయములు
 • జిల్లాలో అనేకం ఇంజనీరింగ్ కాలేజ్‌లు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, కె.ఎల్.సి.ఈ., ఏ.ఏ.ఎన్.ఎమ్.‍ ‍‍& వి.వి.ఎస్.ఆర్ (గుడ్లవల్లేరు) పాలిటెక్నిక్ కళాశాల, మేరీ స్టెల్లా కళాశాల, సిద్ధార్థ డిగ్రీ కళాశాల సహా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక ప్రసిద్ధ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు కూడా ఉన్నాయి.
ఆంశం కొలమానం సంఖ్య మూలం
అక్షరాస్యత  % 69.91 2001 జనాభా లెక్కల ప్రకారం
అక్షరాస్యత (పురుషులు )  % 74.57 2001 జనాభా లెక్కల ప్రకారం
అక్షరాస్యత (స్తీలు )  % 65.05 2001 జనాభా లెక్కల ప్రకారం

కళాశాలలు[మార్చు]

ఆకర్షణలు[మార్చు]

జిల్లాలో చారిత్రక స్థలాలు[మార్చు]

మతపరంగా ముఖ్యమైన స్థలాలు[మార్చు]

క్రీడలు[మార్చు]

 • ఈ జిల్లాలో కబాడీ ఆట అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడతో పాటు క్రికెట్, వాలీబాల్ మరియు టెన్నిస్ ఆటలు ప్రాముఖ్యమైనవి. విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు, భారతదేశం యొక్క అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు బలరాం ఈ జిల్లాకు చెందినవారు.

ప్రముఖవ్యక్తులు[మార్చు]

కృష్ణా జిల్లా ఎందరో ప్రఖ్యాత వ్యక్తులకు, నిపుణులకు ఆలవాలం. వీరిలో కొందరికి ఇది పుట్టినిల్లు కాగా, మరికొందరికి కార్యస్థానం. తమ తమ రంగాల్లో చిరస్మరణీయమైన సేవలందించిన ఎంతో మంది కృష్ణా జిల్లాతో ప్రత్యక్ష/పరోక్ష సాంగత్యాన్ని కలిగి ఉన్నారు. అంశాల వారీగా వారిలో కొందఱు...

లలిత కళలు మరియు సాహిత్యం:[మార్చు]

రచయితలు[మార్చు]

సంస్కరణ మరియు అభ్యుదయం:[మార్చు]

శాస్త్ర సాంకేతిక రంగాలు :[మార్చు]

క్రీడలు:[మార్చు]

రంగస్థలం మరియు సినిమా:[మార్చు]

రాజకీయం[మార్చు]

సంగీతం, సాహిత్యం[మార్చు]

ప్రముఖులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

మూసలు[మార్చు]