కపిలేశ్వరపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


కపిలేశ్వరపురం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో కపిలేశ్వరపురం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో కపిలేశ్వరపురం మండలం యొక్క స్థానము
కపిలేశ్వరపురం is located in ఆంధ్ర ప్రదేశ్
కపిలేశ్వరపురం
ఆంధ్రప్రదేశ్ పటములో కపిలేశ్వరపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°44′53″N 81°56′07″E / 16.748003°N 81.935234°E / 16.748003; 81.935234
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము కపిలేశ్వరపురం
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 66,809
 - పురుషులు 33,583
 - స్త్రీలు 33,226
అక్షరాస్యత (2011)
 - మొత్తం 63.52%
 - పురుషులు 67.06%
 - స్త్రీలు 59.96%
పిన్ కోడ్ 533309
కపిలేశ్వరపురం
—  రెవిన్యూ గ్రామం  —
కపిలేశ్వరపురం is located in ఆంధ్ర ప్రదేశ్
కపిలేశ్వరపురం
అక్షాంశరేఖాంశాలు: 16°44′53″N 81°56′07″E / 16.7480°N 81.9352°E / 16.7480; 81.9352
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం కపిలేశ్వరపురం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 11,793
 - పురుషుల సంఖ్య 5,917
 - స్త్రీల సంఖ్య 5,876
 - గృహాల సంఖ్య 2,954
పిన్ కోడ్ 533 309
ఎస్.టి.డి కోడ్
కపిలేశ్వరపురం వద్ద గోదావరి నదిలో ఒక పడవ

కపిలేశ్వరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1]., మండలము. పిన్ కోడ్: 533 309. గ్రామస్థులు ముఖ్య అవసరములకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపేటకు వెళ్ళుదురు.

ఈ గ్రామం గోదావరి నదీ తీరంలో ఉన్న ఒక పురాతన గ్రామము.[1].. దీనిని ఆంగ్లేయుల కాలములో కపిలేశ్వరపురం జమీ అనేవారు. జామీందారీ వ్యవస్థకు చిహ్నంగా ఇప్పటికీ ఇక్కడ ఒక పెద్ద దివానం ఉంది.

ఇక్కడ వరి,అరటి,కొబ్బరి, మినుము,పెసర మొదలగు పంటలు పండును.

కపిలేశ్వరపురం జమీ[మార్చు]

బలుసు పెద సర్వారాయుడు ఆంగ్లేయుల నుండి 1818లో ఈ జమీ పొందాడు. కపిలేశ్వరపురం జమీలో ఆరు శివారు లంకలున్నాయి. పెదసర్వారాయుడు మహాదాత. బ్రాహ్మణులకు, భట్టులకు భూములు, గోవులు మొదలగు పలు దానాలు చేశాడు. ఒక పెద్ద తటాకము తవ్వించాడు. 1847 లో పెద సర్వారాయుడు చనిపోగా కొడుకు బుచ్చికృష్ణయ్య పాలనకొచ్చాడు. ఇతడు 1852లో ఆరు గ్రామము.[1].లు గల కేసనకుర్రు సంస్థానమును దంతులూరి బుచ్చికృష్ణరాజు నుండి కొని జమీ విస్తరించాడు.

బుచ్చికృష్ణయ్య తరువాత 1853లో వచ్చిన తమ్ముడు పట్టాబిరామయ్య బ్రాహ్మణులను, భక్తులను, పండితులను ఆదరించాడు. ఇతడు 1866లో చనిపోగా బుచ్చి సర్వారాయుడు పాలనకు వచ్చి మూడు సంవత్సరముల తరువాత హఠాత్తుగా చనిపోయాడు. భార్య రామలక్ష్మమ్మ తన పాలనలో మంచి పేరు సంపాదించింది. ఒక పెద్ద సత్రము నిర్మించింది. దత్తపుత్రుడు పట్టాభిరామయ్య 1896లో చనిపోగా ఇద్దరు మనుమలను సంరక్షించుతూ జమీ పాలించింది. 1906లో ఈమె చనిపోగా రెండవ బుచ్చి సర్వారాయుడు జమీందారయ్యాడు. ఈతడు 1913లో పెద్ద పాఠశాల నిర్మించి జిల్లా బోర్డుకు అప్పగించాడు. ఆంగ్లేయుల ఇంపీరియల్ వ్యవసాయ పరిశోధనా సంఘానికి సభ్యుడు. చాగంటి శేషయ్య గారి రాధామాధవము, ఆంధ్రకవితరంగిణి, సుగ్రీవ విజయము ముద్రింపచేశాడు. హసనాబాద్ గ్రామము.[1].ను సంపాదించాడు. జిల్లా బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు. 1945లో బ్రిటిష్ ప్రభుత్వము రావు బహద్దర్ బిరుదునిచ్చింది. ఇతని కొడుకు ప్రభాకర పట్టాబిరామారావు ఆంధ్ర విశ్వ విద్యాలయము సిండికేట్ సభ్యునిగా, 1952లో మదరాసు రాష్ట్ర మంత్రిగా, తిరిగి 1953లో ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా, 1958లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా మంత్రిగా సేవలందించాడు. ఇతని కాలములో సాహిత్య అకాడెమీ, సంగీత అకాడెమీ, ప్రభుత్వ వాచక పుస్తక ప్రచురణ సంస్థ ఏర్పడ్డాయి.

వృత్తులు[మార్చు]

గోదావరి తీరంలో గ్రామం ఉండడంతో గ్రామంలో చేపలు పడుతూ వాటిపై జీవించే బెస్తవారు ఉన్నారు. దీపావళి పండుగ గడిచిన పదిరోజులకు కపిలేశ్వరపురం, కోటిపల్లి, సుందరపురం గ్రామాల్లోని బెస్తలు ఓ మంచి ముహర్తం పెట్టుకుని వేటకు బయలుదేరుతారు. నదిలో ప్రయాణిస్తూ పగలంతా చేపలు పడుతూంటారు, ఎక్కడ పొద్దుపోయి రాత్రి అయితే అక్కడి రేవులో ప్రయాణం ఆపేసి పడుకుంటారు. ఆత్రేయపురం, పేరవరం (ఆత్రేయపురం), ధవళేశ్వరం, ఆరికరేవుల, తాటిపూడి, పట్టిసీమ, పోలవరం, టేకూరు, శివగిరి, శిరువాక, కొరుటూరు, కొండమొదలు వంటి ఊర్లమీదుగా ప్రయాణిస్తూ పాపికొండలు వరకూ వెళ్తారు. ఇలా పాపికొండలు చేరుకోవడానికి దాదాపుగా ఎనిమిది రోజులు పడుతుంది. ఏ రోజు పట్టుకున్న చేపలు ఆరోజు పైన చెప్పిన ఊళ్ళలో వ్యాపారులకు అమ్మేస్తూ ఉంటారు.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 66,809 - పురుషులు 33,583 - స్త్రీలు 33,226

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11,793.[3] ఇందులో పురుషుల సంఖ్య 5,917, మహిళల సంఖ్య 5,876, గ్రామంలో నివాసగృహాలు 2,954 ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "వయ్యారి గోదారమ్మా..". ఆంధ్రజ్యోతి. 19 జూన్ 2015. Retrieved 20 August 2015.  |first1= missing |last1= in Authors list (help); Check date values in: |date= (help)
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14