మండపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బస్టాండ్.
మెయిన్‌ రోడ్.
R.C.చర్చ్.

మండపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. ఇది A-గ్రేడ్ పురపాలక సంఘం. ఇది చుట్టుపక్కల గ్రామాలకు వాణిజ్య, వినోద కేంద్రం. బియ్యం మిల్లులకు, ఇతర వ్యవసాయానుబంధ కర్మాగారాలకు ఇది ప్రసిద్ధి. ఈ ఊరు మాండవ్యపురంగా కూడా పిలవబడుతుంది

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామ జనాభా మొత్తం 1,32,679. అందులో మగవారి సంఖ్య 65,724, ఆడవారి సంఖ్య 66,955.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

మండపేట అనే పేరు మాండవ్యపురం అనే పేరుకి వికృతి. మాండవ్య ముని ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించడం వలన దీనికి ఆ పేరు స్థిరపడింది. సతీ సుమతి,గౌతముడు, యగ్నవల్కుడు, అగస్త్యుడు వంటి గొప్ప గొప్ప తపో సంపన్నుల భూమి ఇది. దీనికి నిదర్శనంగా వాతపెస్వరం (తాపేశ్వరం), ఇల్వలపాడు (ఇప్పనపాడు) వంటి పల్లెలు కనిపిస్తాయి. మధ్యయుగాల్లో పావులూరి మల్లన వంటి గణిత శాస్త్ర కోవిదులు, తన దాతృత్వంనకు బ్రిటిష్ రాణి చేత ప్రశంసలందుకున్న డొక్కా సీతమ్మ వంటి వారితోపాటు, బలుసు సాంబమూర్తి వంటి స్వతంత్ర యోధులు నడయాడిన దివ్య నేల ఇది.

రవాణా సౌకర్యం[మార్చు]

మండపేట రహదారులతో అనుసంధానించబడి ఉంది. ఆలమూరు వైపు వెళ్ళే రహదారి కోల్కతా నుండి చెన్నై వెళ్ళే ఎన్.హెచ్ 16ను జొన్నాడ వద్ద కలుస్తుంది. ద్వారపూడి, యానాం మధ్య నడిచే ఎస్.హెచ్ 102 మండపేట ద్వారా వెళుతుంది. ఈ రహదారి మండపేటను ద్రాక్షారామ, రామచంద్రపురం, తాపేశ్వరం, ద్వారపూడి నుండి ఎస్.హెచ్ 40 మీదుగా రాజమండ్రిని కలుపుతుంది. మండపేటను దుళ్ళ, కపిలేశ్వరపురం, జొన్నాడలతో కలిపే రోడ్లు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత రాష్ట్ర రహదారులుగా ఉన్నాయి.తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ నుండి విజయవాడ, చెన్నై, బెంగళూరు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు వెళ్ళే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు మండపేట మీదుగా వెళ్తాయి. ఆర్.టి.సి వారు మండపేటలో ఏడిద వెళ్ళు మార్గంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు కానీ అది పాతబస్టాండుకు దూరంగా ఉండటం, ప్రయాణికులు వెళ్ళేందుకు అంత సదుపాయంగా లేకపోవడం వలన నిరుపయోగంగా మారింది. పాత బస్టాండు మెయిన్‌రోడ్ మీద ఉంది. ప్రయాణికులు కూర్చొనేందుకు విశ్రాంతి గది ఉంది. ప్రస్తుతం మండపేటకు వచ్చువెళ్లు బస్సులసంఖ్య గణనీయంగా పెరిగినందున ఈ బస్టాండ్‌ ఇరుకుగా మారింది. మండపేటకి సమీప రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడి వద్ద ఉంది. 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్ మండపేటకు అత్యంత సమీపంలో గల ప్రధాన రైల్వే స్టేషన్. 12 కిలోమీటర్ల దూరంలో అనపర్తి రైల్వేస్టేషన్ ఉంది.

ప్రధాన కూడళ్లు[మార్చు]

కలువపువ్వు సెంటర్[మార్చు]

మండపేటలోని ఈ కూడలి నుండి ఒక రోడ్డు రావులపాలెం దిశగా, ఒకటి ఏడిద వైపు, ఒకరోడ్డు వల్లూరివారి వీధికి, ఒకటి మర్కెట్‌కు, మరొకటి రామచంద్రపురం వైపునకూ వెళ్తాయి, ఇంకో రెండు రోడ్లు ఊరిలోనికి వెళతాయి.

రాజారత్న సెంటర్[మార్చు]

మండపేటలోని ఈ కూడలి కూడా ముఖ్యమైనది. దాదాపు అన్ని సినిమాహాలులకు, నారాయణ, చైతన్య, శశి వంటి విద్యా సంస్థలకు ఈ కూడలి నుండే వెళ్ళాలి

రథం సెంటర్[మార్చు]

మండపేటలోని ఈ సెంటర్లో శ్రీ అగస్తేశ్వర స్వామి వారి (రథం గుడి) గుడి ఉన్న కారణంగా ఈ సెంటర్ కి రథం సెంటర్ అని పేరు వచ్చింది.

ప్రముఖులు[మార్చు]

  • డొక్కా సీతమ్మ - అన్నదానానికి మారుపేరుగా ప్రసిధ్దికెక్కిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ (1841-1909) పుట్టిన ఊరు.
  • నాళం కృష్ణారావు: బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు. "మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త.
  • వాడకట్టు హనుమంతరావు - సీనియర్ పాత్రికేయులు
  • పున్నమరాజు ఉమామహేశ్వర రావు - వ్యాఖ్యాత
  • వి.వి.యస్.యస్.చౌదరి - మాజీ ఎం.ఎల్.ఎ.
  • వేగుళ్ళ లీలాకృష్ణ - జనసేనపార్టీ నాయకులు
  • వేగుళ్ళ జోగేశ్వరరావు - ఎం.ఎల్.ఎ.
  • చుండ్రు శ్రీవర ప్రకాష్ - మాజీ మున్సిపల్ ఛైర్మన్, మండపేట

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మండపేట&oldid=3380815" నుండి వెలికితీశారు