Coordinates: 16°52′N 81°56′E / 16.87°N 81.93°E / 16.87; 81.93

ద్వారపూడి (మండపేట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్వారపూడి
—  రెవిన్యూ గ్రామం  —
ద్వారపూడి is located in Andhra Pradesh
ద్వారపూడి
ద్వారపూడి
అక్షాంశరేఖాంశాలు: 16°52′N 81°56′E / 16.87°N 81.93°E / 16.87; 81.93
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం మండపేట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,684
 - పురుషులు 2,820
 - స్త్రీలు 2,864
 - గృహాల సంఖ్య 1,674
పిన్ కోడ్ 533341
ఎస్.టి.డి కోడ్
అయ్యప్పస్వామి వారి దేవాలయం.
శివ, వేంకటేశ్వరస్వామి దేవాలయంలుఒకే చోట.
శివాలయం ముందు నటరాజు.
వేంకటేశ్వర స్వామి దేవాలయం.

ద్వారపూడి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలానికి చెందిన ఒక చిన్న గ్రామం.[1].. పచ్చని పొలాలతో, తోటలతో కనులవిందుగా వుంటుంది. ముఖ్యంగా ఈ గ్రామం అయ్యపస్వామి వారి దేవాలయం, ఇతర పెద్ద ఆలయాల ద్వారా బహుళ ప్రఖ్యాతిగాంచింది.ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,876.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,979, మహిళల సంఖ్య 2,897, గ్రామంలో నివాస గృహాలు 1,485 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1674 ఇళ్లతో, 5684 జనాభాతో 361 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2820, ఆడవారి సంఖ్య 2864. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 200 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 42. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587573[3].పిన్ కోడ్: 533341.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల అనపర్తిలోను, ఇంజనీరింగ్ కళాశాల భూపాలపట్నంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల రాజానగరంలోను, పాలీటెక్నిక్‌ రావులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మండపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమండ్రి లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ద్వారపూడిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారుసమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరుఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ద్వారపూడిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.ద్వారపూడికి వెళ్ళుటకు రావులపాలెం మీదుగా, రాజమహేంద్రవరం నుండి రోడ్డు మార్గము, సామర్లకోట కాకినాడల మీదుగా రైలు మార్గములు ఉన్నాయి. ద్వారపూడిలో ప్రత్యేకంగా బస్‌స్టాండ్‌లేదు. ద్వారపూడి - మేడపాడు వంతెన వద్ద, అయ్యప్ప గుడి వద్ద ప్రయాణికులు రోడ్డుమీదనే బస్సును నిలిపి ఎక్కడం దిగడం చేస్తారు. చిన్నపాటి బస్సు షెల్టర్స్ ఉన్నాయి. ద్వారపూడిలో రైల్వే స్టేషను వున్నది కాని అన్ని రైళ్ళు ఆగవు. సామర్లకోటలో దిగి ఇక్కడికి ఆటోలలో, బస్సులలో సులభంగా చేరుకోవచ్చు.ఇక్కడ ఆగే రైలుబళ్ళ వివరాలు

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ద్వారపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 68 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 34 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 259 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 215 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 44 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ద్వారపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 14 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 16 హెక్టార్లు
  • చెరువులు: 14 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ద్వారపూడిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

వంట నూనెలు, వస్త్రాలు

ప్రముఖులు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

  • అయ్యప్ప దేవాలయం:ద్వారపూడిలోని అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోని అయ్యప్పగుడి తరహలో నిర్మించారు. ఈ దేవాలయము రాజమండ్రి-కాకినాడ రహదారికి చేరువగా ఉండుటవలన ప్రయాణికులకు శోబాయమానముగా కనువిందు చేస్తూ ఉంటుంది. రోడ్దుకు అటువైపున ధవలేశ్వరం-కాకినాడ గోదావరికాలువ ఉంది. వచ్చిన భక్తులు ఈ కాలువలో కాళ్ళు, చేతులు కడుగుకొనుటకు, స్నానాలు చేయుటకు అనుకూలంగా కాలువ వడ్దున మెట్లు నిర్మించారు. గుడి ప్రాంగణం వెలుపల వరుసగా పూజసామాగ్రి, దేవతచిత్రపటాలు ఆటబొమ్మలు ఆమ్మే దుకాణాలు హోటళ్ళు ఉన్నాయి. బయట భక్తుల పాదరక్షలను ఉచితంగా భద్రపరచే గదివున్నది. ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం,సగంవిష్ణురూపం) విగ్రహం దర్శనం యిస్తుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయము కలదుత్. లోనికి వచ్చిన భక్తులు మొదట గణపతి ఆతురువాత హరహరి దర్శనంచేసుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడివున్నది .అయ్యప్పగుడి రెండు అంతస్తులగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్పస్వామి వున్న మందిరమున్నది. క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు. పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరానికి వెళ్ళుటకు రెండు మార్గాలున్నాయి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళూటకు మరో మార్గం ఉంది. అయ్యప్ప విగ్రహం వున్న మందిరం (గర్భగుడి) పైభాగాన గోపుర నిర్మాణమున్నది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్యఘట్టాలను బొమ్మలరూపంలో నిర్మించబడివున్నాయి. ఆయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయుని భారి విగ్రహంవున్నది. అయ్యప్పగుడిలో నిత్యాన్నదానం అమలులోవున్నది.సబరిమలై వెళ్లెలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తారు. ఈ దేవాలయం ఆంధ్ర శబరిమలగా పిలువబడుతుంది.[4]
  • సాయిబాబా ఆలయం:అయ్యప్పస్వామిగూడికి వెనుకవైపున దిగువనషిర్డీ సాయిబాబా మందిరమున్నది.
  • శివాలయం:అయ్యప్ప స్వామి వారి మందిరం ప్రక్కనే విశాలమైన ప్రాంగణంలో శివాలయం ఉంది.ఈ దేవాలయాల ముఖద్వారానికి ఇరువైపుల పూలహారాన్ని తొండంతో ఎత్తి పట్టుకున్న రెండు ఏనుగు బొమ్మలున్నాయి. ముఖద్వారానికి ఎదురుగా, శివాలయం ముందుభాగంలో పెద్ద నటరాజు విగ్రహం ఉంది. వెనుకనే యజ్ఞయాగాదులు నిర్వహించుటకు యాగశాలఉంది. శివాలయంఒక ప్రక్క పెద్ద నంది విగ్రహం ఉంది.
  • వేంకటేశ్వర ఆలయం:వేంకటేశ్వర దేవాలయం ఉంది.వెంకటరమణుని గుడిని చాలా వినూత్నంగా గోపురాలకునలువైపులున్న గోడలకు రంగుఅద్దాలను బిగించి నిర్మించారు.వెంకటేశ్వర స్వామి గుడికి ముందువైపున ఒకప్రక్క (ముఖద్వారానికి కుడివైపున తనగుండెను చీల్చి సీతారాములను చూపిస్తున్న హనుమంతుని విగ్రహం ఉంది.
  • పాతాళ శివాలయం

వస్త్రవ్యాపారం[మార్చు]

చాలా ఏళ్లగా ద్వారపూడి బట్టల వ్యాపారానికి ప్రసిద్ధి. టోకు, చిల్లర (హోల్‌సేల్‌మరియు రిటైల్‌) బట్టల అమ్మాకానికి ఈ గ్రామం ప్రశిద్ది చెందినది. పక్కజిల్లాల నుండికూడా రెటైల్‌వ్యాపారస్తులు ఇక్కడినుండే హోల్‌సేల్‌ వ్యాపారులనుండి వస్త్రాల కొనుగోలు చేస్తారు. ఊరిమధ్యలో ఈ వస్త్రాల అమ్మకం కొనుగోలు దుకాణాలన్నింటిని ఒకే కాంపౌండ్‌లో కట్టారు. సుమారు 200 వందలకు పైగా హోల్‌సేల్‌, రెటైల్ ఆమ్మకపు షాపులు ఈ వస్త్రదుకాణాల సముదాయంలో ఉన్నాయి.

సరుకు రవాణా[మార్చు]

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరికాలువలద్వారా నీటిపారుదల వున్నభూములు అధికం.అందుచే ఇక్కడ వరి పంటసాగు వేల ఎకరాలలో సాగు చెయ్యబడుతున్నది.అందుచే ఇక్కడ అధిక సంఖ్యలో రైసుమిల్లులువున్నాయి. రోజుకు వందటన్నులనుండి రెండు వేలటన్నులవరకు ధాన్యాన్ని ఆడించు రైసుమిల్లులు ఉన్నాయి. ఇక్కడ పండించిన ధాన్యంనే కాకుండ, బెంగాల్‌, ఒడిషా నుండి కూడా ధాన్యమును దిగుమతి చేసుకుని మిల్లులలో ప్రాసెస్‌చేస్తారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యిన బియ్యంనుFCI వారికి లేవి (Levy) క్రింద కొంతధాన్యాన్ని సప్లై చేసి మిగతా ధాన్యాన్ని మిగాతా రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయుదురు. కొంతబియ్యాన్ని లారీలద్వారా పంపిన్నప్పటికి అధికమొత్తంలో గూడ్సు వ్యాగనులద్వారా రవాణా చేస్తారు. ద్వారపూడి చుట్టుపక్కల రైసుమిల్లులలలోని బియ్యాన్ని ద్వారపూడి రైల్వేష్టేషన్‌ద్వారానే రవాణా చేస్తారు. ద్వారపూడి రైల్వే స్టేషనుకు ప్రయాణికులకన్న, ఈ బియ్యం రవాణా ద్వారానీ అధ్యధిక ఆదాయం అభిస్తున్నది. అలాగే రసాయనిక ఎరువులు, సిమెంట్‌ఇక్కడ దిగుమతి అగును. ఈ సరుకులను వ్యాగన్‌లలో నింపుటకు, దించుటకై దాదాపు రెండు వందలమంది హమాలీ కార్మికులు ఈ స్టేషనులో పనిచేస్తున్నారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-05.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "Ayyappa Swamy Temple of Ayyappa". Archived from the original on 2019-07-04. Retrieved 2019-07-04.