మున్నేరు
మున్నేరు | |
River | |
ఖమ్మం పట్టణంలో మున్నేరుపై రెండు వంతెనలు
| |
దేశం | భారతదేశం |
---|---|
ఉపనదులు | |
- ఎడమ | వైరా నది |
- కుడి | ఆకేరు |
Source | పాకాల సరస్సు |
- ఎత్తు | 238 m (781 ft) |
Mouth | కృష్ణానది |
- location | కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
- ఎత్తు | 0 m (0 ft) |
పొడవు | 195 km (121 mi) రమారమి |
పరివాహక ప్రాంతం | 10,490 km2 (. sq mi) |
మున్నేరు కృష్ణా నదికి ఉపనది.[1][2]
మున్నేరు వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఆకేరు, వైరా నదులు మున్నేరు యొక్క ప్రధాన ఉపనదులు.[3] మున్నేరు సముద్రమట్టం నుండి 238 మీటర్ల ఎత్తున ప్రారంభమై కృష్ణానదిలో కలిసే సరికి మొత్తం 195 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. మున్నేరు యొక్క పరీవాహక ప్రాంతపు వైశాల్యం 10,490 చ.కి.మీలు.[4] ఆకేరు ఖమ్మం గ్రామీణ మండలంలోని తిర్తల గ్రామం వద్ద మున్నేరులో కలుస్తుంది. వైరా నది దక్షిణానికి ప్రవహించి కృష్ణా జిల్లా, కంచికచెర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరులో కలుస్తుంది.
మున్నేరు ఖమ్మం పట్టణపు శివార్లలోని దానవాయిగూడెం నుండి ప్రవహిస్తుంది. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి వనరు మున్నేరే. ఖమ్మం జిల్లాలోని గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించబడింది.
మున్నేరును ఆనుకొని పెనుగంచిప్రోలు పక్కన ప్రసిద్ధి గాంచిన శ్రీ గోపయ్య నమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మ వారి దేవాలయము ఉంది.
చిత్ర మాలిక[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to మున్నేరు. |