వేగావతి నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేగావతి నది
పెద్దగెడ్డ నది
స్థానం
జిల్లా(లు)పార్వతీపురం మన్యం,విజయనగరం,శ్రీకాకుళం

వేగావతి నది (పెద్దగెడ్డ నది) ఉత్తరాంధ్రలో ప్రవహించే నది. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట సమీపంలోని కొండలలో పుట్టి, మద్దువలస జలాశయం వద్ద సువర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ నది పార్వతీపురం మన్యం జిల్లాలో పాచిపెంట, సాలూరు, విజయనగరం జిల్లాలో రామభద్రాపురం, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, బలిజపేట మండలాల గుండా ప్రవహించి వంతరాం వద్ద శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న పట్టణాల్లో సాలూరు ముఖ్యమైంది.

ప్రాజెక్టులు

[మార్చు]

వేగావతి నదిపై పెద్దగెడ్డ జలాశయం, రొంపిల్లి ఆనకట్ట, పారాది ఆనకట్ట, కర్రివలస ఆనకట్టలు నిర్మించారు. పెద్దగెడ్డ జలాశయం నిల్వ సామర్థ్యం 1.05 టిఎమ్‌సి.[1] దీని శంకుస్థాపన చంద్రబాబునాయుడు చేశాడు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రారంభోత్సవం చేసాడు. ఈ రిజర్వాయర్ ఎదురుగా ఒక శివాలయం ఉంది. చుట్టూ కొండల మధ్య ఈ జలాశయం. పాచిపెంటలో పర్యాటక ఆకర్షణగా ఉంది. దీని ద్వారా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల్లోని 28 గ్రామాల్లో 12,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రొంపిల్లి ఆనకట్ట ద్వారా 6 వేలు, పారాది ఆనకట్ట ద్వారా 8 వేలు, కర్రివలస ఆనకట్ట ద్వారా 4 వేల ఎకరాలకు సాగునీరందుతోంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "PEDDAGEDDA RESERVOIR PROJECT". irrigationap.cgg.gov.in. Archived from the original on 2020-06-13. Retrieved 2020-06-13.
  2. "::. APPSC .:: (ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION)". www.eenadupratibha.net. Archived from the original on 2020-06-13. Retrieved 2020-06-13.

వెలుపలి లంకెలు

[మార్చు]