చంపావతి నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరిపల్లి వద్ద చంపావతి నది

'చంపావతి నది', ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చిన్న నది. ఇది తూర్పు కనుమల నుండి విజయనగరం జిల్లా,మెంటాడ మండలం ఆండ్ర గ్రామం దగ్గర 1,200 మీటర్ల ఎత్తులో జన్మించి తూర్పు దిక్కుగా ప్రవహించి,పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఈ నది విజయనగరం జిల్లాలో గజపతినగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడ, పాలెం, నాతవలస గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. దీనికి ఏడువంపుల గెడ్డ, చిట్టి గెడ్డ, పోతుల గెడ్డ, గాడి గెడ్డలు ఉపనదులున్నాయి.

చంపావతి నది పరీవాహక ప్రాంతం 1,410 చ. కి.మీ. ఉంటుంది. దీనిలో కొంత మాడుగుల కొండ ప్రాంతం, కొంత బల్లపరుపుగా మరికొంత తీర ప్రాంతంగా విభజించవచ్చును.[1]

డెంకాడ ఆనకట్ట చంపావతి నదిపై 1965-1968 మధ్యకాలంలో నిర్మించబడింది. ఇది నెల్లిమర్ల మండలంలోని సరిపల్లి గ్రామం దగ్గరగా ఉంది. దీని మూలంగా 5,153 ఎకరాల ఆయకట్టు భూమికి నీరు అందుతుంది.

వనరులు

[మార్చు]
  • P.Jagadeshwar Rao et al: Geo-electrical data analysis to demarcate ground water pockets and recharge zones in Champavathi River Basin, Vizianagaram district, Andhra Pradesh., J.Ind.Geophys.Union, vol 7 (2),105-113, 2003.

మూలాలు

[మార్చు]
  1. "Geo-Electrical study of Champavathi River Basin" (PDF). Archived from the original (PDF) on 2007-09-28. Retrieved 2008-08-08.

వెలుపలి లంకెలు

[మార్చు]