అరకు లోక్‌సభ నియోజకవర్గం
| అరకు | |
|---|---|
| పార్లమెంట్ నియోజకవర్గం | |
| (భారత పార్లమెంటు కు చెందినది) | |
| జిల్లా | విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి |
| ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
| ముఖ్యమైన పట్టణాలు | పార్వతీపురం, బొబ్బిలి |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 2008 |
| ప్రస్తుత పార్టీ | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ |
| సభ్యులు | 1 |
| దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
| ప్రస్తుత సభ్యులు | కొత్తపల్లి గీత |
అరకు లోక్‌సభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.
చరిత్ర
[మార్చు]ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో విస్తరించివుంది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.[1] పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉంది.[2] అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలలో 6 ఎస్టీలకీ, 1 ఎస్సీలకీ రిజర్వ్ చేయబడ్డాయి.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]నియోజకవర్గపు గణాంకాలు
[మార్చు]నియోజకవర్గం నుండి గెలుపొందిన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[4]
| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1952-2009 : పార్వతీపురం చూడండి | |||
| 2009 | కిషోర్ చంద్ర డియో | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014 | కొత్తపల్లి గీత | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ | |
| 2019 | గొడ్డేటి మాధవి | ||
| 2024[5] | గుమ్మా తనుజా రాణి | ||
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2014 18 అరకు (ఎస్.టి) కొత్తపల్లి గీత స్త్రీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 413,191 గుమ్మడి సంధ్యా రాణి స్త్రీ తెలుగుదేశం పార్టీ 321,793 2009 18 అరకు (ఎస్.టి) వి.కిశోర్ చంద్రదేవ్ M INC 360458 మిడియం బాబూరావు M CPM 168014
2009 ఎన్నికలు
[మార్చు]2009 ఎన్నికలలో అరకు లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కురస బొజ్జయ్య, [6] ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.సింహాచలం, [7] కాంగ్రెస్ పార్టీ తరఫున వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ పోటీచేశారు.[8] ఈ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీ అభ్యర్థి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ గెలిచి కొత్తగా ఏర్పడిన అరకు నియోకవర్గం యొక్క తొలి లోక్‌సభ సభ్యుడయ్యాడు.
2014 ఎన్నికలు
[మార్చు]ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు
[మార్చు]ఎన్నికల ఫలితాలు
[మార్చు]2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
| పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
|---|---|---|---|---|---|
| యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | కొత్తపల్లి గీత | 413,191 | 45.42 | N/A | |
| తెలుగుదేశం పార్టీ | గుమ్మిడి సంధ్యారాణి | 321,793 | 35.38 | N/A | |
| భారత జాతీయ కాంగ్రెస్ | కిశోర్ చంద్రదేవ్ | 52,884 | 5.81 | −39.68 | |
| CPI(M) | మిడియం బాబూరావు | 38,898 | 4.26 | −16.94 | |
| Independent | కంగల బాలుదొర | 23,251 | 2.55 | N/A | |
| Independent | చెట్టి శంకరరావు | 8,951 | 0.98 | N/A | |
| AAP | బూర్జబారికి ధనరాజు | 8,569 | 0.94 | N/A | |
| Independent | సల్లంగి రత్నం | 7,688 | 0.85 | N/A | |
| Independent | బిడ్డిక రామయ్య | 7,587 | 0.83 | N/A | |
| Independent | ఇల్ల రామిరెడ్డి | 5,692 | 0.63 | N/A | |
| Independent | వనుగు శంకరరావు | 4,614 | 0.51 | N/A | |
| NOTA | None of the above | 16,532 | 1.82 | N/A | |
| Majority | 91,398 | 10.04 | −14.25 | ||
| టర్నవుట్ | 909,614 | 72.92 | +5.91 | ||
| యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | స్వింగ్ | స్వింగ్ | |||
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
- ↑ "ఆర్కైవ్ నకలు". the original నుండి 2009-04-06 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-07-27.
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3[permanent dead link]
- ↑ EENADU (12 June 2024). "అరకు". the original నుండి 12 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 June 2024.
- ↑ Election Commision of India (12 June 2024). "2024 Loksabha Elections Results - Araku". the original నుండి 12 June 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑



