కిషోర్ చంద్ర దేవ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Vyricherla Kishore Chandra Suryanarayana Deo
Minister of Tribal Affairs
Minister of Panchayati Raj
పదవీ కాలం
Member: 6th, 7th, 8th, 14th and 15th Lok Sabha
వ్యక్తిగత వివరాలు
జననం (1947-02-15) 15 ఫిబ్రవరి 1947 (వయస్సు: 71  సంవత్సరాలు)
Kurupam, Vizianagaram(D), ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ Indian National Congress
భాగస్వామి V. Preeti Deo
సంతానం 1 son and 1 daughter
నివాసం The `Fort` Kurupam
As of April 8, 2010
Source: [1]

శ్రీ కిషోర్ చంద్ర దేవ్ విశాఖ పట్నం జిల్లాలోని అరకు పార్లమెంటరీ నియోజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి ప్రస్తుత్ 15 వ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బాల్యము[మార్చు]

వీరు 15, పిబ్రవరి 1947 న విజయనగరం జిల్లాలోని కురుపాంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాజ్ మాత వి.శోభలతా దేవి, రాజ వి.డి.పి.వి. దేవ్,

విద్య[మార్చు]

కిషోర్ చంద్ర దేవ్ బి.ఎ. (ఎకనమిక్స్) రాజనీతి శాస్త్రములో ఎం.ఎ. చదివారు. వీరి విద్య చెన్నై .... తాంబరంలోని చెన్నై క్రిస్టియన్ కళాశాలలో సాగినది.

కుటుంబము[మార్చు]

వీరు 30, జూన్, 1971 న వి.ప్రీతి దేను పెళ్ళాడారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్తావనము[మార్చు]

1977 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ఆరవ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1979 లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రెటరిగాను పనిచేశారు. కేంద్ర మంత్రిగాను పనిచేశారు. 1980 లోజరిగిన ఎన్నికలలో 2వ సారి కూడా లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. 1980 - 89 మద్య కాలంలో చీఫ్ విప్ గా ఉన్నారు. 1983 -93 కాలంలో అఖిల భారత కాంగ్రెస్ (ఎస్.) జనరల్ సెక్రెట్రీగా పనిచేశారు. 1984 లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో కూడా మూడవ సారి గెలిచారు. 1994 = 2000 వరకు రాజ్యసభ మెంబరుగా ఉన్నారు. 2004 లో జరిగిన లోక్ సభకు జరిగిన ఎన్నికలలో కూడా నాల్గవ సారి గెలిచారు. 2009 లోజరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఐదవ సారి కూడా గెలుపొంది లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. జూలై 2011 నుండి కేంద్ర కాబినెట్ మంత్రిగా గిరిజన సంక్షేమం., పంచాయితీ రాజ్ మంత్రిగా ఉన్నారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]