అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం
అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం | |
---|---|
లోక్‌సభ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | అనంతపురం |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
జనాభా | 4,083,315 (2011 అనంతపురం జిల్లా జనాభా) |
ఓటర్ల సంఖ్య | 1,173,138 |
ముఖ్యమైన పట్టణాలు | అనంతపురం |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
నియోజకవర్గం సంఖ్య | 26 |
ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ఏ నొఇయోజకవర్గం నుండి దీన్ని ఏర్పరచారు | 1952 |
ప్రస్తుత సభ్యులు | జె. సి. దివాకర్ రెడ్డి |
మొదటి సభ్యులు | పైడి లక్ష్మయ్య |
అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న ప్రధానంగా దీని పరిధితో అనంతపురం జిల్లాను కుదించడమైనది.
చరిత్ర[మార్చు]
2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మూలంగా నియోజకవర్గపు భౌగోళిక స్వరూపంలో మార్పులు వచ్చిననూ సెగ్మెంట్ల సంఖ్యలో మార్పులేదు. గతంలో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్నరాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలం కొంతభాగం, ఆత్మకూరు మండలాలు ఇప్పుడు హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైనాయి.
శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]
నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు[మార్చు]
ఈ నియోజకవర్గంలో మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికలలో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1952, 62, 67, 71, 77, 80, 89, 91, 96,98, 2004 లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1957లో సి.పి.ఐ.కు చెందిన తరిమెల నాగిరెడ్డి, 1984, 99 లలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందినారు. 1971లో నీలం సంజీవరెడ్డి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి అయిన పి.ఆంథోనీరెడ్డి చేతిలో ఓడిపోవడం విశేషం.[1] తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన 7 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులే 5 సార్లు విజయం సాధించారు.
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 పైడి లక్ష్మయ్య భారత జాతీయ కాంగ్రెస్ రెండవ 1957-62 తరిమెల నాగిరెడ్డి కమ్యూనిష్టు పార్టీ మూడవ 1962-67 ఉస్మాన్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 డి.నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 అనంత వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 అనంత వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-2009 అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 15వ 2009-2014 అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 16వ 2014 -2019 జె. సి. దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 17వ 2019 - ప్రస్తుతం తలారి రంగయ్య వైఎస్సార్‌సీపీ
ఎన్నికల ఫలితాలు[మార్చు]
2002,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
భారత జనరల్ ఎన్నికలు, 2004:అనంతపురం లోకసభ నియోజకవర్గం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
కాంగ్రెస్ | అనంత వెంకటరామిరెడ్డి | 458,925 | 52.44 | +4.97 | |
తె.దే.పా | కలవ శ్రీనివాసులు | 385,521 | 44.05 | -6.22 | |
బసపా | నాగభూషనం గడ్డల | 9,296 | 1.06 | ||
ఇండిపెండెంట్ | యాతం పోతలయ్య | 7,102 | 0.81 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | కె.వెంకటేశులు | 6,232 | 0.71 | -6.56 | |
తెరాస | ఎ.జగన్మోహనరావు | 4,419 | 0.50 | ||
స్వతంత్ర అభ్యర్ది | బి.ఎస్.అమరనాథ్ | 3,640 | 0.42 | ||
మెజారిటీ | 73,404 | 8.39 | +11.19 | ||
మొత్తం పోలైన ఓట్లు | 875,135 | 68.42 | +5.43 | ||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | +4.97 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట రామిరెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నాడు. [2] ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.ఎస్.మన్సూర్ పోటీలో ఉన్నాడు. [3]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 26 అనంతపురం జనరల్ శ్రీ అనంత వెంకటరామిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 457876 కలవ శ్రీనివాసులు పు తెలుగు దేశం పార్టీ 379955
2014 ఎన్నికలు[మార్చు]
2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
సార్వత్రిక ఎన్నికలు, 2014: అనంతపురం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తె.దే.పా | జె. సి. దివాకర్ రెడ్డి | 606,509 | 50.33 | -6.06 | |
వై.కా.పా | అనంత వెంకటరామిరెడ్డి | 545,240 | 45.25 | ||
కాంగ్రెస్ | అనిల్ చౌదరి.పి | 16,659 | 1.38 | ||
మెజారిటీ | 61,269 | 5.08 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,205,054 | 78.41 | +7.55 | ||
తె.దే.పా గెలుపు | మార్పు |
మూలాలు[మార్చు]
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92702&subcatid=12&categoryid=3
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009