అనంత వెంకటరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనంత వెంకటరెడ్డి
అనంత వెంకటరెడ్డి


పదవీ కాలం
1989-1991
1991-1996
ముందు డి.నారాయణ స్వామి
తరువాత అనంత వెంకట రామిరెడ్డి
నియోజకవర్గం అనంతపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1929-07-01) 1929 జూలై 1 (వయసు 93)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఎ.వెంకటసుబ్బమ్మ
సంతానం 3 కుమారులు 1 కుమార్తె
నివాసం అనంతపూర్
మతం హిందూ
మూలం [1]

అనంత వెంకటరెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు, స్వాంతంత్ర్య సమరయోధుడు.

జీవిత విశేషాలు[మార్చు]

వెంకటరెడ్డి 1921 జూలై 1వ తేదీన అనంతపురం జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి ఎ.కృష్ణారెడ్డి. ఇతడు గుంటూరు లోని హిందూ కళాశాలలో చదివి బి.ఎ., కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని ఆర్.ఎల్.లా కాలేజీలో చదివి న్యాయవిద్య పట్టా బి.ఎల్.లను పుచ్చుకున్నాడు. ఇతడు విద్యార్థి దశలో "క్విట్ ఇండియా ఉద్యమం"లో పాల్గొన్నాడు. అనంతపురం పట్టణంలో న్యాయవృత్తిని ప్రారంభించి సుమారు 35 సంవత్సరాలు న్యాయవాదిగా సేవలను అందించాడు. 1967-68లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. ఇతనికి క్రీడలలో ప్రవేశం ఉంది. విద్యార్థి దశలో క్రీడలలో పాల్గొని అనేక పతకాలను గెలుచుకున్నాడు. 1946వ సంవత్సరంలో హిందూ కాలేజీ హాకీ జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. ఇతనికి 1952లో వెంకటసుబ్బమ్మతో వివాహం జరిగింది. వీరికి 3 కుమారులు, 1 కుమార్తె జన్మించారు.[1]

రాజకీయ రంగం[మార్చు]

ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ క్రియాశీలకంగా పనిచేశాడు. ఇతడు 1964-67, 1969-72 సంవత్సరాలలో జిల్లా కాంగ్రెస్ కమిటీకి ప్రధానకార్యదర్శిగా, 1978-79లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1969లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, 1981లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైనాడు. ఇతడు అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి తొమ్మిదవ, 10వ లోక్‌సభలకు ఎన్నికై సభ్యుడిగా కొనసాగాడు. ఇతడు రాష్ట్ర విధాన సభలలోను, పార్లమెంటులోను వివిధ కమిటీలలో సభ్యుడిగా నియమించబడ్డాడు. ఇతని అనంతరం ఇతని కుమారుడు అనంత వెంకటరామిరెడ్డి లోకసభ సభ్యుడిగా 4 పర్యాయాలు గెలిచాడు.

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Tenth Lok Sabha Members Bioprofile REDDY, SHRI ANANTHA VENKATA". పార్లమెంట్ ఆఫ్ ఇండియా లోకసభ. National Informatics Centre (NIC). Retrieved 15 May 2020.[permanent dead link]