అనంత వెంకట రామిరెడ్డి
స్వరూపం
| అనంత వెంకటరామి రెడ్డి | |||
![]() | |||
| నియోజకవర్గం | అనంతపురం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1956 ఆగస్టు 1 తాడిపత్రి, ఆంధ్ర ప్రదేశ్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
| జీవిత భాగస్వామి | ఎ.రమ | ||
| సంతానం | నందిత, నవ్యత | ||
| నివాసం | అనంతపూర్ | ||
| September 16, 2006నాటికి | |||
అనంత వెంకటరామిరెడ్డి (జ 1 ఆగష్టు, 1956) రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. అనంతపురం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 11వ, 12వ, 13వ లోక్‌సభలకు ఎన్నికయ్యారు.2019 నుండి 2024 అనంతపురము అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం సభ్యుడు గా ysrcp తరపున ఎన్నికయ్యాడు
నేపథ్యము
[మార్చు]- జననం: 1 ఆగస్టు. 1956.
- తల్లిదండ్రులు: ఎ.వెంకటసుబ్బమ్మ, అనంత వెంకటరెడ్డి
- జన్మస్థలము: తాడిపత్రి గ్రామం, అనంతపురం జిల్లా.
- విద్య: శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోను, కృష్ణ దేవ రాయ విశ్వవిద్యాలయంలోను ఎం.ఎ., బి.ఎల్. చదివారు.
- వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వీరు కొంత కాలం న్యాయవాదిగా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం
[మార్చు]1987- 96 మధ్య కాలంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా వుండి 1996 వ సంవత్సరంలో 11వ లోకసభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. 1998 వ సంవత్సరంలో తిరిగి లోక్ సభకు ఎన్నికైనారు. 2004 లో జరిగిన లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరిగి పోటీ చేసి 3వ సారికూడ ఎన్నికైనారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి తిరిగి నాల్గవ సారి కూడా గెలిచి 15వ లోకసభకు ప్రాతినిథ్యం వహించారు.
