అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(అనంతపురం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అనంతపురం
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లా అనంతపురం
ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్
జనాభా 4,083,315
(2011 అనంతపురం జిల్లా జనాభా)
ఓటర్ల సంఖ్య 1,173,138
ముఖ్యమైన పట్టణాలు అనంతపురం
నియోజకవర్గ విషయాలు
యేర్పడిన సంవత్సరం 1952
నియోజకవర్గం సంఖ్య 26
ప్రస్తుత పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సభ్యులు 1
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 7
దేని నుండి యేర్పడినది 1952
ప్రస్తుత సభ్యులు అనంత వెంకట రామిరెడ్డి
మొదటి సభ్యులు పైడి లక్ష్మయ్య

ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మూలంగా నియోజకవర్గపు భౌగోళిక స్వరూపంలో మార్పులు వచ్చిననూ సెగ్మెంట్ల సంఖ్యలో మార్పులేదు. గతంలో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్నరాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలం కొంతభాగం, ఆత్మకూరు మండలాలు ఇప్పుడు హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైనాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు[మార్చు]

ఈ నియోజకవర్గంలో మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికలలో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1952, 62, 67, 71, 77, 80, 89, 91, 96,98, 2004 లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1957లో సి.పి.ఐ.కు చెందిన తరిమెల నాగిరెడ్డి, 1984, 99 లలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందినారు. 1971లో నీలం సంజీవరెడ్డి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి అయిన పి.ఆంథోనీరెడ్డి చేతిలో ఓడిపోవడం విశేషం.[1] తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన 7 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులే 5 సార్లు విజయం సాధించారు.

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]

లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 పైడి లక్ష్మయ్య భారత జాతీయ కాంగ్రెస్
రెండవ 1957-62 తరిమెల నాగిరెడ్డి కమ్యూనిష్టు పార్టీ
మూడవ 1962-67 ఉస్మాన్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 పి.ఆంటొని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 పి.ఆంటొని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 డి.నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 అనంత వెంకట రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 అనంత వెంకట రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదకొండవ 1996-98 అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ 1999-04 కలవ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-2009 అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
15వ 2009-2014 అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

Circle frame.svg

2002,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

  నాగభూషనం గడ్డల (1.06%)
  కె.వెంకటేశులు (0.71%)
  యాతం పోతలయ్య (0.81%)
  ఎ.జగన్మోహనరావు (0.5%)
  బి.ఎస్.అమరనాథ్ (0.42%)
భారత జనరల్ ఎన్నికలు, 2004:అనంతపురం లోకసభ నియోజకవర్గం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ అనంత వెంకటరామిరెడ్డి 458,925 52.44 +4.97
తె.దే.పా కలవ శ్రీనివాసులు 385,521 44.05 -6.22
బసపా నాగభూషనం గడ్డల 9,296 1.06
ఇండిపెండెంట్ యాతం పోతలయ్య 7,102 0.81
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కె.వెంకటేశులు 6,232 0.71 -6.56
తెరాస ఎ.జగన్మోహనరావు 4,419 0.50
స్వతంత్ర అభ్యర్ది బి.ఎస్.అమరనాథ్ 3,640 0.42
మెజారిటీ 73,404 8.39 +11.19
మొత్తం పోలైన ఓట్లు 875,135 68.42 +5.43
కాంగ్రెస్ గెలుపు మార్పు +4.97

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట రామిరెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నాడు. [2] ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.ఎస్.మన్సూర్ పోటీలో ఉన్నాడు. [3]

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009 26 అనంతపురం జనరల్ శ్రీ అనంత వెంకటరామి రెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 457876 కలవ శ్రీనివాసులు పు తెలుగు దేశం పార్టీ 379955

2014 ఎన్నికలు[మార్చు]

పోటీ చేయు ప్రధాన పార్టీల అభ్యర్థులు[మార్చు]

ఈ ఎన్నికలలో ఈ దిగువ తెలిపిన ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేయుచున్నారు.

ఎన్నికల గుర్తు రాజకీయ పార్టీ అభ్యర్థి పేరు
Indian Election Symbol Elephant.jpg
బహుజన్ సమాజ్ పార్టీ కాసాని నాగరాజు
Flag of the Indian National Congress.svg
భారత జాతీయ కాంగ్రెస్ అనిల్ చౌదరి.పి.
Cycle-2.jpg
తెలుగు దేశం పార్టీ జె.సి.దివాకర రెడ్డి
Ceiling fan.jpg
వై.కా.పా అనంత వెంకటరామిరెడ్డి
సమైక్య తెలుగు రాజ్యం టి.కులదీప్ చౌదరి
PPOI పవన్ కుమార్
ICSP బుజిరెడ్డి వేణుగోపాల రెడ్డి
జై సమైక్యాంద్ర పార్టీ బోయ అనిల్ కుమార్

ఎన్నికల ఫలితాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92702&subcatid=12&categoryid=3
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009