2019
స్వరూపం
2019 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంఘటనలు
[మార్చు]జనవరి 2019
[మార్చు]ఫిబ్రవరి 2019
[మార్చు]ఫిబ్రవరి 26
మార్చి 2019
[మార్చు]ఏప్రిల్ 2019
[మార్చు]మే 2019
[మార్చు]జూన్ 2019
[మార్చు]- జూన్ 4: తెలుగు వికీపీడియా సభ్యుడు ప్రణయ్‌రాజ్ వంగరి 'వికీఛాలెంజ్' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 1000రోజులు - 1000వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తం వికీపీడియాల్లో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. 2016, సెప్టెంబరు 8వ తేది నుండి తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2019, జూన్ 4న 'వికీవెయ్యిరోజులు' పూర్తిచేశాడు.
- జూన్ 21: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభించబడింది.
జూలై 2019
[మార్చు]ఆగస్టు 2019
[మార్చు]సెప్టెంబర్ 2019
[మార్చు]అక్టోబర్ 2019
[మార్చు]నవంబర్ 2019
[మార్చు]డిసెంబర్ 2019
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 10: వయ్యా సామేలు, కవి, రచయిత, గాయకుడు. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు.
- జనవరి 14: కట్టా రంగారావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1957)
- జనవరి 15: మొదలి నాగభూషణశర్మ, రంగస్థల నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. (జ.1935)
- ఫిబ్రవరి 4: పిళ్లా రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు
- ఫిబ్రవరి 10: చింతల కనకారెడ్డి, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1951)
- ఫిబ్రవరి 12: విజయ బాపినీడు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1936)
- ఫిబ్రవరి 18: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల, సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. (జ.1956)
- ఫిబ్రవరి 20: నంద్యాల శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (జ.1918)
- ఫిబ్రవరి 20: వేదవ్యాస రంగభట్టర్, రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత. (జ.1946)
- ఫిబ్రవరి 22: కోడి రామకృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1949)
- ఫిబ్రవరి 26: ద్వాదశి నాగేశ్వరశాస్త్రి, తెలుగు పండితుడు, అధ్యాపకుడు, రచయిత, విమర్శకుడు. (జ.1948)
- మార్చి 6: కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు (జ.1932)
- మార్చి 15: విలియం స్టాన్లీ మెర్విన్, అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. (జ.1927)
- మార్చి 15: వై.ఎస్.వివేకానందరెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1950)
- మార్చి 18: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.
- ఏప్రిల్ 7: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936)
- ఏప్రిల్ 30: ఎస్. పి. వై. రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త (జ.1950)
- మే 1: బి. సుభాషణ్ రెడ్డి, కేరళ, మద్రాసు హైకోర్టుల ప్రధాన ఛీఫ్ జస్టీస్ (జ.1943)
- మే 5: అరుణోదయ రామారావు, విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి (జ.1955)
- మే 7: గుండా రామిరెడ్డి, తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919)
- మే 17: పశ్య రామిరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1925)
- మే 21: బొద్దులూరి నారాయణరావు, తెలుగు కవి, పండితుడు. (జ.1925)
- మే 22: చెరుకుమల్లి సూర్యప్రకాశ్, అంతర్జాతీయ స్థాయి ఆయిల్, అక్రిలిక్, అబ్స్ట్రాక్ట్ చిత్రకారుడు. (జ.1940)
- మే 25: బండారు శారారాణి, తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964)
- జూన్ 3: బి.కె.బిర్లా, బిర్లా కుటుంబానికి చెందిన భారతీయ వ్యాపారవేత్త. (జ.1921)
- జూన్ 9: బి.వి.పరమేశ్వరరావు, మహిళల ఆర్థిక స్వేచ్ఛకోసం "మహిళా సంఘాల"ను ప్రారంభించాడు. (జ.1933)
- జూన్ 10: గిరీష్ కర్నాడ్, కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938)
- జూన్ 19: డి.కె.చౌట, భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. (జ.1938)
- జూన్ 25: మహాస్వప్న, దిగంబర కవులలో ఒకరు.
- జూన్ 27: మహమ్మద్ బాజి, కోరాపుట్‌కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1917)
- జూన్ 28: అబ్బూరి ఛాయాదేవి, తెలుగు కథా రచయిత్రి (జ.1933)
- జూన్ 30: నల్లగారి రామచంద్ర, తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. (జ.1939)
- జూలై 20: షీలా దీక్షిత్, భారతీయ రాజకీయ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. (జ.1938)
- జూలై 25: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, తెలుగు కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. (జ.1944)
- జూలై 28: సూదిని జైపాల్ రెడ్డి, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1942)
- జూలై 29: కె.బి.లక్ష్మి, తెలుగు రచయిత్రి, పాత్రికేయురాలు. (జ.1953)
- జూలై 29: ముఖేష్ గౌడ్, హైదరాబాదుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు. మాజీమంత్రి (జ.1959)
- ఆగస్టు 2: దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (జ.1945)
- ఆగస్టు 6: సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (జ.1952)
- ఆగస్టు 24: అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి (జ.1952)
- సెప్టెంబర్ 16: కోడెల శివప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్, రాజకీయనాయకుడు. (జ.1947)
- సెప్టెంబర్ 23: అత్తిలి లక్ష్మి, తెలుగు సినిమా నటి. పలు సినిమాలలో సహాయక పాత్రలను పోషించింది.
- సెప్టెంబర్ 25: వేణుమాధవ్, తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969)
- అక్టోబర్ 28: చక్రవర్తుల రాఘవాచారి, సీనియర్ పాత్రికేయుడు. విశాలాంధ్ర సంపాదకుడు. (జ.1939)
- అక్టోబర్ 31: గీతాంజలి, తెలుగు సినిమా నటి. (జ.1947)
- నవంబర్ 5: కర్నాటి లక్ష్మీనరసయ్య, నటుడు, ప్రయోక్త, దర్శకుడు, జానపద కళాకారుడు. (జ.1927)
- నవంబర్ 10: టి. ఎన్. శేషన్, 10వ భారత ఎన్నికల ప్రధాన కమీషనర్. (జ.1932)
- lనవంబరు 22: షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (జ.1926)
- డిసెంబర్ 12: గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటుడు, సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి (జ.1939)
- డిసెంబర్ 15: నవోదయ రామమోహనరావు, ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1934)