చక్రవర్తుల రాఘవాచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రవర్తుల రాఘవాచారి
జననం
చక్రవర్తుల రాఘవాచారి

(1939-09-10)1939 సెప్టెంబరు 10
మరణం2019 అక్టోబరు 28(2019-10-28) (వయసు 80)
వృత్తిపాత్రికేయుడు, సంపాదకుడు, రచయిత

చక్రవర్తుల రాఘవాచారి (సెప్టెంబరు 10, 1939 - అక్టోబరు 28, 2019) పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్ట్. 1972 నుండి 2005 వరకు విశాలాంధ్రలో సంపాదకుడిగా పనిచేశాడు.[1]

జననం

[మార్చు]

రాఘవాచారి 1939, సెప్టెంబరు 10న జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, శాతాపురం గ్రామంలోని సనాతన శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించాడు.[2] కొద్దికాలం తరువాత రాఘవాచారి కుటుంబంతో తన అమ్మమ్మ ఊరైన కృష్ణా జిల్లా, బొకినాల అగ్రహారానికి వచ్చాడు.

కుటుంబం

[మార్చు]

గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నేత కనపర్తి నాగయ్య కుమార్తె జ్యోత్స్నతో రాఘవాచారి వివాహం జరిగింది.[3]

విద్యాభ్యాసం

[మార్చు]

11వ ఏట సికింద్రాబాదు లాలాగూడ రైల్వే పాఠశాలలో అయిదో తరగతిలో చేరిన రాఘవాచారి 1953 నుంచి విశాలాంధ్ర చదవడం ప్రారంభించాడు. నిజాం కళాశాలలో పి.యు.సి.లో చేరి, ఉస్మానియా విశ్వవిద్యాలయం 6వ ర్యాంకు సాధించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్‌ కాలేజీలో చేరి మధ్యలోనే అది వదిలేసి వరంగల్లు వెళ్ళి బీఎస్సీ చదివాడు. హైదరాబాదుకు వచ్చి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై ఎల్‌.ఎల్‌.ఎం. చేశాడు.

కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో చేరి, ప్రధాన కార్యదర్శి పదవికి పోటీచేసి గెలిచాడు. ఆ తరువాత అఖిల భారత విద్యార్థి సమాఖ్య నుండి లా-కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్ష స్థానానికి పోటీ చేసి గెలుపొందాడు.

పాత్రికేయరంగం

[మార్చు]

1969–71లో ఢిల్లీ నుంచి వెలువడే వామపక్ష అనుకూల పేట్రియట్‌ ఇంగ్లిష్‌ పత్రిక విలేకరిగా పనిచేశాడు. 1971లో విజయవాడలోని విశాలాంధ్రలో చేరి, కొద్దికాలంలో ఆ పత్రికకు సంపాదకుడిగా నియమించబడ్డాడు. 28 ఏళ్ల సుదీర్ఘ కాలం విశాలాంధ్ర సంపాదకులుగా ఉన్న రాఘవాచారి ప్ర‌జాప‌క్ష పాత్రికేయుడిగా గుర్తింపుపొందాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  1. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
  2. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌
  3. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యుడు

మరణం

[మార్చు]

గత కొంతకాంలగా అనారోగ్యంతో ఉన్న రాఘవాచారి, హైదరాబాదులోని ఒక హాస్పిటల్‌లో చికిత్సపొందుతూ 2019, అక్టోబరు 28వ తేది తెల్లవారుజామున మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, గెస్ట్ కాలమ్ (10 September 2019). "పత్రికా చక్రవర్తి రాఘవాచారి". Sakshi. చెన్నమనేని రాజేశ్వరరావు. Archived from the original on 20 September 2019. Retrieved 28 October 2019.
  2. సాక్షి, తెలంగాణ (28 October 2019). "సీనియర్‌ జర్నలిస్ట్‌ రాఘవాచారి కన్నుమూత". Sakshi. Archived from the original on 28 October 2019. Retrieved 28 October 2019.
  3. ఈనాడు, తెలంగాణ (28 October 2019). "విశాలాంధ్ర మాజీ ఎడిటర్‌ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 25 April 2020. Retrieved 25 April 2020.
  4. ప్రజాశక్తి, ఫీచర్స్ (28 October 2019). "ప్ర‌జాప‌క్ష పాత్రికేయ‌మే నా త‌త్వం!". www.prajasakti.com. జీవన డెస్క్. Archived from the original on 28 October 2019. Retrieved 28 October 2019.