బి. సుభాషణ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బి. సుభాషణ్ రెడ్డి
కేరళ హైకోర్టు ఛీప్ జస్టిస్
In office
21 నవబంరు 2004 – 2 మార్చి 2005
తరువాత వారురాజీవ్ గుప్త
మద్రాసు హైకోర్టు ఛీప్ జస్టిస్
In office
12 సెప్టెంబరు 2001–21 నవంబరు 2004
అంతకు ముందు వారునాగేంద్ర కుమార్ జైన్
తరువాత వారుమార్కండేయ కట్జ్
వ్యక్తిగత వివరాలు
జననం(1943-03-02)1943 మార్చి 2
హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం, బిట్రీషు ఇండియా
మరణం2019 మే 1(2019-05-01) (వయసు 76)
ఎ.ఐ.జి. హాస్పిటల్, గచ్చిబౌలి, హైదరాబాదు
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం

బి. సుభాషణ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రధాన న్యాయమూర్తి. ఆంధ్రప్రదేశ్‌, మద్రాసు, కేరళ వంటి భాతరదేశ ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తిగా పనిచేశాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి 1943, మార్చి 2న హైదరాబాదులోని బాగ్‌అంబర్‌పేటలో జన్మించాడు. ఉన్నత విద్యను సుల్తాన్‌బజార్, చాదర్ ఘాట్ లలోని పాఠశాలల్లో చదివిన సుభాషణ్ రెడ్డి,ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు.

వృత్తి జీవితం

[మార్చు]

1966లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాది చేరాడు. అంచలంచలుగా ఎదిగి 1991, నవంబర్‌ 25న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా సుభాషణ్‌ రెడ్డి నియమించబడ్డాడు. అటుతర్వాత 2001 నుంచి 2004 వరకు మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా, మరికొంతకాలం కేరళ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశాడు. తదనంతరం 2005, మార్చి 2న పదవీవిరమణ చేశాడు.[2]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  1. 2012లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌[3]
  2. లోకాయుక్త చైర్మన్‌[4][5][6]

మరణం

[మార్చు]

గత కొంతకాలంగా కోమ్ల గ్రంధి (పాంక్రియాటిక్‌) కేన్సర్‌తో బాధపడుతున్న సుభాషణ్‌ రెడ్డి, గచ్చౌబిలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, మే 1న మరణించాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, తాజావార్తలు (1 May 2019). "జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూత". Archived from the original on 8 May 2019. Retrieved 8 May 2019.
  2. సాక్షి, తెలంగాణ (1 May 2019). "జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కన్నుమూత". Archived from the original on 8 May 2019. Retrieved 8 May 2019.
  3. "Subhashan Reddy is SHRC chief". thehindu.com. Retrieved 8 May 2019.
  4. "Justice B Subhashan Reddy is the new AP Lokayukta". 12 October 2012. Retrieved 8 May 2019.
  5. "Justice B Subhashan Reddy becomes AP Lokayukta". 12 October 2012. Retrieved 8 May 2019.
  6. "Justice B Subhashan Reddy becomes AP Lokayukta". 12 October 2012. Retrieved 8 May 2019.
  7. ఆంధ్రజ్యోతి, తెలంగాణా తాజావార్తలు (1 May 2019). "రిటైర్డ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూత". Archived from the original on 8 May 2019. Retrieved 8 May 2019.
  8. "Telangana: KCR condoles death of Justice Subhashan Reddy". Retrieved 8 May 2019.