గచ్చిబౌలి
గచ్చిబౌలి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని గ్రామం.[1]
Gachibowli గచ్చిబౌలి | |
---|---|
neighbourhood | |
![]() | |
Country | ![]() |
State | Telangana |
District | Ranga Reddy District |
Metro | Hyderabad |
ప్రభుత్వం | |
• నిర్వహణ | GHMC |
Languages | |
• Official | Telugu |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500 032 |
Lok Sabha constituency | Chevella (Lok Sabha constituency) |
Vidhan Sabha constituency | Serilingampally (Vidan Sabha constituency) |
Planning agency | GHMC |
ఇది హైటెక్ సిటీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు సబర్బ్స్ కూడా హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో ఉంది.[2] తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన ఐ.టి కేంద్రం.
ప్రయాణ సౌకర్యాలు[మార్చు]
గచ్చిబౌలి నుండి- హైటెక్ నగరం, హైదరాబాద్ మహానగరంలోని ముఖ్య ప్రాంతాలకు రహదారుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణాసంస్థ బస్సులు – నెం.216,217 గచ్చిబౌలి నుండి మెహిదీపట్నం, కోటి, ప్రధాన నగర కేంద్రాలను కలుపుతుంది. యం.యం.టి.ఎస్. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. సమీరంలోని ఔటర్-రింగ్ రోడ్ శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపుతుంది. హైదరాబాదు మెట్రో రైలు సర్వీసు కూడా సమీపంలోని మియాపూర్ నుండి అమీర్ పేట,నాగోలు వరకు ప్రయాణించుటకు అందుబాటులో ఉంది.హైదరాబాద్ మహానగరంలోని మరికొన్ని ముఖ్య ప్రాంతాలకు మెట్రో రైలు నిర్మాణం ప్రణాళికలో ఉండి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
విద్యా సంస్థలు[మార్చు]
- యూనివర్శిటీ ఆప్ హైదరాబాదు,
- ఇండియన్ స్కూల్ ఆప్ బిజినెస్,
- ఇంటర్నేషనల్ ఇనిష్టిట్యూట్ ఆప్ ఇన్పర్మేషన్,హైదరాబాదు,
- నేషనల్ ఇనిష్టిట్యూట్ ఆప్ టూర్జిమ్ & హాస్పటాలిటీ మెనేజ్మెంట్
- ఇండియన్ ఇమ్యులాజికల్స్ లిమిటెడ్,
- కేంద్రీయ విద్యాలయ,
- యన్.ఎ.యస్.ఆర్. స్కూల్
- సి.యచ్.ఆర్.ఐ.సి.ఇంటర్నేషనల్ స్కూల్
అభివృద్ధి కార్యక్రమాలు[మార్చు]
ఐటీ పరిశ్రమతో పాటు, గచ్చిబౌలి క్రీడల కేంద్రం, స్వర్ణ తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిఎంసి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, హాకీ స్టేడియం, ఆక్వాటిక్స్ కాంప్లెక్స్ ఉత్తమ స్టేడియంల వంటి వాటికి దీటుగా గచ్చిబౌలీలో ఉన్నాయి. మిచిల్ వరల్డ్ గేమ్స్, ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గచ్చిబౌలిలో నిర్వహించబడ్డాయి. సహజరాక్ నిర్మాణాలతో ఒక గోల్ఫ్ కోర్సు ఇటీవల అక్కడే వచ్చింది. పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ కూడా గచ్చిబౌలిలో ఉంది. 2012లో ఇక్కడ బయోడైవర్సిటీ పార్కు నిర్మించబడింది.
గచ్చిబౌలీలోని హాస్పటల్స్[మార్చు]
- మ్యాక్స్ క్యుార్ హాస్పటల్
- హిమగిరి హాస్పటల్
- కాంటినెంటల్ హాస్పటల్
- రాజిత హాస్పటల్
- గచ్చిబౌలీకి చెందిన ఫోటో గ్యాలరీ
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-07.
- ↑ "The Hindu : Property Plus Hyderabad : Grab a slice of Gachibowli pie". hindu.com.