రాజ్ భవన్ రోడ్డు
రాజ్ భవన్ రోడ్డు | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 082 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
రాజ్ భవన్ రోడ్డు, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రాజకీయ, వాణిజ్య ప్రాంతం.[1][2] ఈ ప్రాంతంలో తెలంగాణ గవర్నర్ నివాసం రాజ్ భవన్ ఉంది. అందుకే ఈ ప్రాంతానికి రాజ్ భవన్ రోడ్డు అనే పేరు వచ్చింది. ఇక్కడికి సమీపంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ (లేక్ వ్యూ గెస్ట్ హౌస్) కూడా ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో పంజాగుట్ట, గ్రీన్ లాండ్స్, సోమాజీగూడ, మాతా నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఈ రహదారిపై అనేక దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యాలయం ఉంది.
ప్రార్థనా స్థలాలు
[మార్చు]- జగన్నాథ్ దేవాలయం
- కనకదుర్గ దేవాలయం
- మసీదు-ఎ-ఉమ్మే ఇబ్రహీం
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రాజ్ భవన్ రోడ్డు మీదుగా జీడీమెట్ల, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, చింతల్, గౌలిగూడ బస్టాండ్, సనత్‌నగర్, చార్మినార్, యూసఫ్‌గూడ, సుభాష్ నగర్ (జీడిమెట్ల), అఫ్జల్‌గంజ్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలోని ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డు, బేగంపేటలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Rajbhavan Road
- ↑ "Raj Bhawan Road Locality". www.onefivenine.com. Retrieved 2021-02-06.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-06.
{{cite web}}
: CS1 maint: url-status (link)