అక్షాంశ రేఖాంశాలు: 17°28′20″N 78°29′10″E / 17.47222°N 78.48611°E / 17.47222; 78.48611

హస్మత్‌పేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హస్మత్‌పేట్
సమీపప్రాంతం
హస్మత్‌పేట్ is located in Telangana
హస్మత్‌పేట్
హస్మత్‌పేట్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°28′20″N 78°29′10″E / 17.47222°N 78.48611°E / 17.47222; 78.48611
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
జోన్ఉత్తర జోన్
వార్డు121
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500009
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంకూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

హస్మత్‌పేట్, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలాపూర్ మండలంలో ఉంది.[1] హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఇదీ ఒకటి. మధ్యతరగతి వారి నివాసప్రాంతంగా ఉన్న ఈ హస్మత్‌పేట్, చారిత్రాత్మకమైన హస్మత్‌పేట్ కైర్న్స్ను కలిగిఉంది.[2]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో బోయిన్ పల్లి, కృషి నగర్, ఎస్బి కాలనీ, మారుతి నగర్, భీమనపల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

చెరువులు

[మార్చు]

ఇక్కడున్న హస్మత్ చెరువు (బాన్ చెరువు), హైదరాబాదు, సికింద్రాబాదుల్లోని ముఖ్య చెరువుల్లో ఒకటి. ఈ చెరువు అల్వాల్ చెరువు నుండి హస్మత్‌పేట్ వరకు కలుపబడివుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలను తీసుకువచ్చి ఈ చెరువులో నిమజ్జనం చేస్తారు.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హస్మత్‌పేట్ నుండి నగరంలోని సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, అఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, నాంపల్లి, మేడ్చల్ వంటి ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలోని సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను, ఫతే నగర్ రైల్వే స్టేషనులలో ఎంఎంటిఎస్ రైలు సౌకర్యం ఉంది.

జనాభా

[మార్చు]

ఈ ప్రాంతంలో అధికశాతంమంది హిందువులు, ముస్లింలు ఉండగా, క్రైస్తవులు, సిక్కులు, హిందూ కాతిక్ (సింకర్) వంటివారు కూడా ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Hasmathpet Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
  2. "When culture comes to naught". hindu.com. The Hindu. 24 May 2009. Archived from the original on 11 జూన్ 2009. Retrieved 27 జనవరి 2021.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.

వెలుపలి లంకెలు

[మార్చు]