Jump to content

లాడ్ బజార్

వికీపీడియా నుండి
లాడ్ బజార్
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 002
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ =

లాడ్ బజార్ (చుడి బజార్), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ గాజుల కొరకు ఎన్నో ఏళ్ళుగా ఒక మార్కెటు కూడా ఉంది. చారిత్రాత్మక చార్మినార్ నుండి ఉన్న నాలుగు ప్రధాన రహదారులలో ఇదీ ఒకటి.

లాడ్ అంటే లక్క అని అర్థం. దీనిని గాజులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దానిపై కృత్రిమ వజ్రాలు పొదిగి ఉంటాయి. 1 కిలోమీటరు (0.62 మైళ్ళు) పొడవునా దుకాణాల వరుస ఉంది. వీటిల్లో గాజులు, చీరలు, వివాహ సంబంధిత వస్తువులు, అలంకరణ ఆభరణాలను విక్రయిస్తారు.

చరిత్ర

[మార్చు]

కుతుబ్ షాహి వంశం, నిజాంల కాలం నుండి ఉన్న ఈ మార్కెటు చాలా పాతది. చార్మినార్, మక్కా మసీదు, చౌమహల్లా పాలస్ వంటి చారిత్రక కట్టడాలకు సమీపంలో ఉంది.

షాపింగ్

[మార్చు]
లాడ్ బజార్‌లోని ఒక దుకాణం

చౌడి బజార్ అనేది గాజులకు పేరొందిన మార్కెటు. ఇక్కడ గాజులు, విలువైన రాళ్ళు, ముత్యాలు, ఆభరణాలు,[1] వెండి సామాగ్రి, నిర్మల్, కలంకారీ పెయింటింగ్స్, బిద్రీ కళ, రాళ్ళతో నిండిన లక్క గాజులు, చీరలు, చేతితో నేసిన పట్టు, కాటన్ వస్త్రాలు దొరుకుతాయి.[2] బ్రోకేడ్, వెల్వెట్, బంగారు ఎంబ్రాయిడరీ బట్టలు, సాంప్రదాయ ఖారా దుపట్టాలు, లక్క గాజులు మొదలైనవి ఇక్కడ లభిస్తాయి. ఇక్కడికి సమీపంలో షహ్రాన్ మార్కెట్ కూడా ఉంది.

లాడ్ బజార్ సమీపంలో ఆటో రిక్షాలు

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఇరుకైన వీధి రద్దీ కారణంగా, చార్మినార్ నుండి ఆటో రిక్షాలు, కార్ల ప్రవేశం నిషేధించబడ్డాయి. పాదచారులు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, స్కూటర్లు, కొన్నిసార్లు సైకిల్-రిక్షాలు మాత్రమే ప్రవేశించడానికి అనుమతి ఉంది.
  2. లాడ్ బజార్ ప్రాంతానికి ఆగ్నేయంలో చౌమహల్లా పాలస్ తోపాటు, నిజాంలు నిర్మించిన ఇతర రాజభవనాలు కూడా ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Laad Bazaar traders cry foul". The Hindu. 22 February 2008. Archived from the original on 10 December 2012. Retrieved 22 February 2008.
  2. "Street Smart Shopping". Channel6. Archived from the original on 9 October 2011. Retrieved 22 August 2011.

ఇతర లంకెలు

[మార్చు]