జామియా ఉస్మానియా
జామియా ఉస్మానియా | |
---|---|
సమీపప్రాంతాలు | |
Coordinates: 17°23′37″N 78°31′14″E / 17.3935°N 78.5205°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 007 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జామియా ఉస్మానియా (జామై ఉస్మానియా) , తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇక్కడ లలితా నగర్, బ్యాంక్ కాలనీ వంటి నివాస ప్రాంతాలు ఉన్నాయి.
వాణిజ్య ప్రాంతం
[మార్చు]జామియా ఉస్మానియా ప్రాంతంలో ఫుడ్ వరల్డ్, ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉన్నాయి.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో రామకృష్ణ నగర్, అంబర్‌పేట, భారత్ నగర్, బ్యాంక్ కాలనీ, శారద నగర్, లలిత నగర్, ఎస్ఆర్ఎం కాంప్లెక్స్, విద్యానగర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, వారసిగూడ, రాంనగర్, అడిక్‌మెట్ ఉన్నాయి.[2]
ప్రార్థన స్థలాలు
[మార్చు]ఈ ప్రాంతంలో గురువాయూర్ శ్రీ కృష్ణ మందిరం, శ్రీ శ్రీంగేరి శంకర్ మఠ్, శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్, విశ్వ సాయిబాబా మందిరం, అంబర్ షా బాబా దర్గా, మసీదు ఇ గఫారియా, జామియా మసీదు మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో జామియా ఉస్మానియా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు (86, 86జె, 86ఎ, 86కె, 107జె/డి నెంబర్లు) సౌకర్యం ఉంది.[3] రైల్వే ట్రాక్‌పై కొత్త ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇక్కడ జామియా ఉస్మానియా రైల్వే స్టేషను, విద్యానగర్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Jamia Osmania Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
- ↑ "Jamai Osmania, Lalitha Nagar, Sbh Colony, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-27.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-27.