బొగ్గులకుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొగ్గులకుంట
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 001
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్
లోకసభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంగోషామహల్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

బొగ్గులకుంట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక వాణిజ్య ప్రాంతం.[1] ఇది అబిడ్స్, కోఠి ప్రాంతాల మధ్యలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఇక్కడ కింగ్ కోఠి ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్‌లో "పార్ధా గేట్" అని పిలువబడే ప్రత్యేకమైన గేట్ ఉంది. హైదరాబాద్ నిజాం ఈ ప్యాలెస్‌లో నివసించేవాడు. పోస్నెట్ నిర్మించిన మేడక్ డియోసెస్ చర్చి ఉంది. ఈ చర్చితోపాటు, ఈ భవనంలో 'పోస్నెట్ భవన్' ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులోని మూడవ అంతస్తులో తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయం కూడా ఉంది.

కామినేని హాస్పిటల్స్, కోలనిస్ కిచెన్, మయూర్ పాన్ షాప్ వంటివి ఉన్నాయి.[2]

సమీప ప్రాంతాలు[మార్చు]

బొగ్గులకుంట సమీపంలో కింగ్ కోఠి, హైదర్‌గూడ, గన్ ఫౌండ్రి, బ్రూక్ బాండ్ కాలనీ, ఓల్డ్ కట్టల్ మండి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బొగ్గులకుంట నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలోని కాచిగూడ, మలక్‌పేట ప్రాంతాల్లో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.

విద్యాసంస్థలు[మార్చు]

ఈ ప్రాంతంలో ప్రగతి మహావిద్యాలయ అనే విద్యాసంస్థ ఉంది. ఇందులో కళాశాల, పాఠశాలు ఉన్నాయి. శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జి. పుల్లారెడ్డి జూనియర్ కళాశాలలు ఉన్నాయి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Bogulkunta Locality". www.onefivenine.com. Retrieved 2021-01-25.
  2. "On the Occasion of Labour Day, Two Labourers Found Dead in Manhole in Hyderabad". The Indian Express. Retrieved 8 July 2016.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-25.