కవాడిగూడ
కవాడిగూడ | |
|---|---|
సమీప ప్రాంతం | |
| Coordinates: 17°25′52″N 78°30′36″E / 17.431°N 78.510°E | |
| దేశం | |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | హైదరాబాదు |
| మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
| ప్రభుత్వం | |
| • సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
| భాషలు | |
| • అధికారిక | తెలుగు, ఉర్దూ |
| కాల మండలం | UTC+5:30 (IST) |
| పిన్ కోడ్ | 500 080 |
| Vehicle registration | టిఎస్ |
| లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
| శాసనసభ నియోజకవర్గం | ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం |
| పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
కవాడిగూడ తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఒక నివాసప్రాంతం.[1] ఇది సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన ప్ర్రాంతం.ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థ సెంట్రల్ జోన్ లోని 3 వ సర్కిల్ 94 వ వార్డుకు చెందిన ప్రాంతం.
చరిత్ర
[మార్చు]400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాదు నగరంలో హుస్సేన్ సాగర్ సమీపంలో ఈ కవాడిగూడ బస్తి ఉంది. హుస్సేన్ సాగర్ చెరువు కట్ట నిర్మాణానికి కావడిలలో రాళ్ళు మోసిన కూలీలు గుడిసెలు వెసుకుని నివసించిన ఈ ప్రాంతాని మొదట్లో కావడీల గూడెం అని పిలిచేవారు. అది వాడుకలో క్రమంగా కవాడిగూడగా మారింది. హైదరాబాదు నగరం మధ్యలో, సికింద్రాబాదు (మేజర్ రైల్వేహబ్), ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (బావార్చి బిర్యానీ), పాట్నీ (పారడైజ్ బిర్యానీ) వంటి వివిధ ప్రాంతాలకు సమీపంలో ఈ కవాడిగూడ ఉంది.
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కవాడిగూడ మీదుగా నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. కవాడిగూడకు సమీపంలో సీతాఫల్‌మండి వద్ద ఎంఎంటిఎస్ రైలు స్టేషన్ ఉంది.