ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ముషీరాబాదు శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 57 | ముషీరాబాద్ | జనరల్ | ముఠా గోపాల్ | పు | తెరాస | 72,997 | అనిల్ కుమార్ యాదవ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 36,087 |
2014 | 57 | ముషీరాబాద్ | జనరల్ | కె. లక్ష్మణ్ | పు | బీజేపీ | 65209 | ముఠా గోపాల్ | పు | తెరాస | 37823 |
2009 | 57 | ముషీరాబాద్ | జనరల్ | టంగుటూరి మణెమ్మ | స్త్రీ | భారత జాతీయ కాంగ్రేసు | 45966 | కె. లక్ష్మణ్ | పు | బీజేపీ | 31123 |
2008 | ఉప ఎన్నికలు | ముషీరాబాద్ | జనరల్ | టంగుటూరి మణెమ్మ | స్త్రీ | భారత జాతీయ కాంగ్రేసు | 34795 | కె. లక్ష్మణ్ | పు | బీజేపీ | 32720 |
2004 | 206 | ముషీరాబాద్ | జనరల్ | నాయిని నర్సింహారెడ్డి | పు. | తెలంగాణ రాష్ట్ర సమితి | 53553 | కె. లక్ష్మణ్ | పు | బీజేపీ | 53313 |
1999 | 206 | ముషీరాబాద్ | జనరల్ | కె. లక్ష్మణ్ | పు | బీజేపీ | 71413 | ఎం. కోదండ రెడ్డి | పు | కాంగ్రెస్ | 52846 |
1994 | 206 | ముషీరాబాద్ | జనరల్ | ఎం. కోదండ రెడ్డి | పు | కాంగ్రెస్ | 32859 | నాయిని నర్సింహారెడ్డి | పు | జనతాదళ్ | 27928 |
1989 | 206 | ముషీరాబాద్ | జనరల్ | ఎం. కోదండ రెడ్డి | పు | కాంగ్రెస్ | 41733 | నాయిని నర్సింహారెడ్డి | పు. | జనతాదళ్ | 29366 |
1985 | 206 | ముషీరాబాద్ | జనరల్ | నాయిని నర్సింహారెడ్డి | పు | జె.ఎన్.పి | 38361 | కె.ప్రకాశ్ గౌడ్ | పు | భారత జాతీయ కాంగ్రేసు | 27377 |
1983 | 206 | ముషీరాబాద్ | జనరల్ | శ్రీపతి రాజేశ్వర్ రావు | పు | స్వతంత్ర అభ్యర్థి | 19609 | నాయిని నర్సింహారెడ్డి | పు | జనతా పార్టీ | 19302 |
1978 | 206 | ముషీరాబాద్ | జనరల్ | నాయిని నర్సింహారెడ్డి | పు | జె.ఎన్.పి | 25238 | టంగుటూరి అంజయ్య | పు | భారత జాతీయ కాంగ్రేసు (ఇందిరా) | 23071 |
1972 | 205 | ముషీరాబాద్ | జనరల్ | టంగుటూరి అంజయ్య | పు | భారత జాతీయ కాంగ్రేసు | 29198 | ఎం.ఏ.రజాక్ | పు | భారత జాతీయ కాంగ్రేసు | 8834 |
1967 | 205 | ముషీరాబాద్ | జనరల్ | టంగుటూరి అంజయ్య | పు | భారత జాతీయ కాంగ్రేసు | 16811 | ఎస్.ఎన్.రెడ్డి | పు | సి.పి.ఐ | 13011 |
1962 | 209 | ముషీరాబాద్ | జనరల్ | టంగుటూరి అంజయ్య | పు | భారత జాతీయ కాంగ్రేసు | 16844 | ఎన్.సత్యనారాయణరెడ్డి | పు | సి.పి.ఐ | 8761 |
1957 | 12 | ముషీరాబాద్ | జనరల్ | కె.సీతయ్యగుప్త | పు | భారత జాతీయ కాంగ్రేసు | 16039 | కె.సోమయాజులు | పు | ప్రజా సోషలిస్టు పార్టీ | 7072 |
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నాయిని నరసింహరెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన కె. లక్ష్మణ్ పై 241 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందినాడు. నరసింహరెడ్డికి 53552 ఓట్లు రాగా, లక్ష్మణ్ 53311 ఓట్లు సాధించాడు.
2008 ఉపఎన్నికలు[మార్చు]
తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా వలన ఏర్పడిన ఖాళీ వలన జరిగిన ఉపఎన్నికలలో ముషీరాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.మణెమ్మ భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ పై 2075 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మణెమ్మ 34795 ఓట్లు సాధించగా, లక్ష్మణ్ 32720 ఓట్లు పొందినాడు. తెరాసకు చెందిన నాయిని నరసింహరెడ్డి 19867 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.[1]
2009 ఎన్నికలు[మార్చు]
2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బిజెపీ నుండి కె.లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ తరపున టి.మణేమ్మలతోపాటు ప్రధాన పార్టీలైనా తెరాస, ప్రజారాజ్యం, లోక్ సత్తాలు పోటీచేశారు.[2] 2008 ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ పై గెలిచిన మణెమ్మ, సాధారణ ఎన్నికల్లో కూడా గెలిచి రెండుసార్లు ఎమ్మేల్యేగా పనిచేశారు. గతంలో మణెమ్మ భర్త టి.అంజయ్య కూడా ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,42,016 కాగా పోలైన ఓట్ల సంఖ్య 1,32,769. దీనిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మణెమ్మకు 45,966కు, బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ కు 31,123 ఓట్లను పొందారు. ఉపఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 వేల పైచిలుకు ఓట్ల అధిక్యాన్ని మణెమ్మ పొందారు. [3]
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
గుణాంకాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05[permanent dead link]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 02 జూన్ 2008, పేజీ 7
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-03-09. Retrieved 2020-01-14.