పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం
పెద్దపల్లి జిల్లాలోని 1 శాసనసభ స్థానాలలో పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- పెద్దపల్లి
- జూలపల్లి
- ఎలిగేడ్
- సుల్తానాబాద్
- ఓదెల
- శ్రీరాంపూర్
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]
2014 దాసరి మనోహర్ రెడ్డి సమీప కాంగ్రెస్స్ అభ్యర్థి భానుప్రసాద్ రావు పై సుమారు 63000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు . కరీంనగర్ జిల్లలో ఇంత మెజారిటీ రావడం ఒక రికార్డు.
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 25 | పెద్దపల్లి | జనరల్ | Manohar Reddy Dasari | Male | TRS | 96220 | T. Bhanu Prasad Rao | Male | INC | 33543 |
2009 | 25 | పెద్దపల్లి | జనరల్ | Chinthakunta Vijaya Ramana Rao | M | TDP | 64319 | Mukunda Reddy Geetla | M | INC | 40837 |
2004 | 249 | పెద్దపల్లి | జనరల్ | గీట్ల ముకుందారెడ్డి | M | TRS | 59697 | Birudu Rajamallu | M | JP | 35933 |
1999 | 249 | పెద్దపల్లి | జనరల్ | Gujjula Ramakishna Reddy | M | BJP | 56099 | Geetla Mukunda Reddy | M | INC | 45986 |
1994 | 249 | పెద్దపల్లి | జనరల్ | Birudu Rajamallu | M | TDP | 69610 | Geetla Mukunda Reddy | M | INC | 29933 |
1989 | 249 | పెద్దపల్లి | జనరల్ | Geetla Mukunda Reddy | M | INC | 46781 | Birudu Rajamallu | M | TDP | 44825 |
1985 | 249 | పెద్దపల్లి | జనరల్ | Kalva Ramachandra Reddy | M | TDP | 38863 | Geetla Mukunda Reddy | M | INC | 34474 |
1983 | 249 | పెద్దపల్లి | జనరల్ | Gone Prakash Rao | M | IND | 24928 | Geetla Mukunda Reddy | M | INC | 18501 |
1978 | 249 | పెద్దపల్లి | జనరల్ | G. Raji Reddy | M | INC (I) | 31946 | Kishan Reddy Bayyapo | M | IND | 13507 |
1972 | 244 | పెద్దపల్లి | జనరల్ | Jinna Malla Reddy | M | INC | 28460 | Vemula Ramnaiah | M | IND | 14172 |
1967 | 244 | పెద్దపల్లి | జనరల్ | J. M. Reddy | M | IND | 30325 | B. Ramulu | M | INC | 11105 |
1962 | 255 | పెద్దపల్లి | (SC) | Butti Raja Ram | M | INC | 16311 | Parvathalu | M | CPI | 4402 |
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ముకుందరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన జనతా పార్టీ అభ్యర్థి రాజమల్లుపై 23764 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ముకుందరెడ్డికి 56697 ఓట్లు రాగా, రాజమల్లు 35933 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.రామకృష్ణారెడ్డి. [1] కాంగ్రెస్ పార్టీ తరఫున గీట్ల ముకుందరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి ఏముల పద్మావతి, లోక్‌సత్తా పార్టీ తరఫున శ్రీనివాసరావు పోటీచేశారు. మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సత్యనారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున చింతకుంట విజయరమణారావు పోటీపడ్డారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయరమణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ముకుందరెడ్డిపై 23వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించాడు [2]
2014 ఎన్నికలు[మార్చు]
2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి దాసరి మనొహర్ రెడ్డి గారు గెలుపొందారు.