Jump to content

చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°18′36″N 78°8′24″E మార్చు
పటం
నియోజక వర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డి


2007లో చేయబడిన నియోజక7్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.[1][2]

ఈ నియోజకవర్గం పరిధిచేవెళ్లలాలు

[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,50,433
  • ఓటర్ల సంఖ్య [3] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారము) :1,81,563

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గనులు, భూగర్భ శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నది.

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 వి.రామారావు కాంగ్రెస్ పార్టీ ఎస్.బి.సుధాల్ స్వతంత్ర అభ్యర్థి
1967 డి.సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి కె.గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1972 పి.కిషన్ రావు కాంగ్రెస్ పార్టీ ఏ.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 సి.ప్రతాప్ లింగం జనతా పార్టీ టి.ఆర్.ఆనందం కాంగ్రెస్ పార్టీ
1983 కె.లక్ష్మారెడ్డి ఇందిరా కాంగ్రెస్ పి.ఇంద్రారెడ్డి లోక్‌దళ్ పార్టీ
1985 పి.ఇంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ విక్రంకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 పి.ఇంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ కె.కాంతారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1994 పి.ఇంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ పి.పాండు కాంగ్రెస్ పార్టీ
1999 పి.ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.లక్ష్మారెడ్డి తెలుగుదేశం పార్టీ
2000 ఉపఎన్నిక పి.సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.లక్ష్మారెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 పి.సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎ.భూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 కె.ఎస్.రత్నం తెలుగుదేశం పార్టీ కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ
2014 కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ కె.ఎస్.రత్నం తె.రా.స
2018 కాలే యాదయ్య టిఆర్ఎస్[4] కె.ఎస్.రత్నం కాంగ్రెస్ పార్టీ
2023[5] కాలే యాదయ్య బీఆర్ఎస్ పామెన భీమ్ భరత్ కాంగ్రెస్ పార్టీ

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.ఇంద్రారెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కె.లక్ష్మారెడ్డిపై సుమారు 10000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఇంద్రారెడ్డి తెలుగుదేశం (ఎన్టీఆర్) పార్టీ నుండి ఎన్నికలకు కొద్ది ముందు మాత్రమే కాంగ్రెస్‌లో చేరి తెలుగుదేశంపై గెలుపొందడం విశేషం.

2000 ఉప ఎన్నికలు

[మార్చు]

పి.ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం వలన ఏర్పడిన ఖాళీతో 2000 మే 20న జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి 29909 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం అభ్యర్థి కె.లక్ష్మారెడ్డిపై విజయం సాధించింది. సబితకు 84448 ఓట్లు లభించగా, లక్ష్మారెడ్డి 54539 ఓట్లు సాధించాడు. ఈ ఎన్నికలలో మొత్తం ఆరుగురు పోటీచేశారు.

2004 ఎన్నికలు

[మార్చు]

2004 రాష్ట్ర శాసనసభ్అ ఎన్నికలలో పి.సబితారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 41585 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్.భూపాల్ రెడ్డిపై విజయం సాధించింది. పోటీచేసిన మరో ఇద్దరికి ధరావత్తు దక్కలేదు. సబితకు 96995 ఓట్లు రాగా, భూపాల్‌రెడ్డి 55410 ఓట్లు సాధించాడు.

2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు

అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
పి.సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ 96995
ఎస్.భూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 55410
పి.శ్రీనివాసులు నాయుడు స్వతంత్ర అభ్యర్థి 5389
ఎం.కృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థి 2398

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.ఎస్.రత్నం పోటీ చేస్తున్నాడు.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 November 2018). "నేతల అడ్డా.. చేవెళ్ల గడ్డ". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.
  2. Sakshi (3 August 2023). "చేవెళ్ల (ఎస్.సి) నియోజకవర్గం తదుపరి అభ్యర్థి..?". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  3. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  4. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009

వెలుపలి లంకెలు

మూస:చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం