సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంరాజన్న జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°23′24″N 78°48′36″E మార్చు
పటం
సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు

కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • ఎల్లారెడ్డిపేట్
  • గంభీర్‌రావ్‌పేట్
  • ముస్తాబాద్
  • సిరిసిల్ల

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు పు టీఆర్ఎస్ 89244 కే.కే. మహేందర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 59557
2018 29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు పు టీఆర్ఎస్ 125213 కే.కే. మహేందర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 36204
2014 29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు పు టీఆర్ఎస్ 92135 కొండూరి రవీందర్ రావు పు కాంగ్రెస్ పార్టీ 39131
2010 By Polls సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు పు టీఆర్ఎస్ 87876 కే.కే. మహేందర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 19657
2009 29 సిరిసిల్ల జనరల్ కల్వకుంట్ల తారక రామారావు పు టీఆర్ఎస్ 36783 కే.కే. మహేందర్ రెడ్డి పు స్వతంత్ర 36612
2004 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు పు టీడీపీ 64003 రేగులపాటి పాపారావు పు టీఆర్ఎస్ 46995
1999 259 సిరిసిల్ల జనరల్ రేగులపాటి పాపారావు పు కాంగ్రెస్ పార్టీ 58638 చెన్నమనేని రాజేశ్వరరావు పు టీడీపీ 48986
1994 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 36154 రేగులపాటి పాపారావు M IND 31637
1989 259 సిరిసిల్ల జనరల్ ఎన్.వి.కృష్ణయ్య M IND 26430 రేగులపాటి పాపారావు M IND 25906
1985 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 43664 రుద్ర శంకరయ్య M INC 20101
1983 259 సిరిసిల్ల జనరల్ వుచ్చిడి మెహన్ రెడ్డి M IND 27508 రేగులపాటి పాపారావు M INC 19809
1978 259 సిరిసిల్ల జనరల్ చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 28685 నాగుల మల్లయ్య M INC (I) 18807
1972 254 సిరిసిల్ల జనరల్ జువ్వాడి నరసింగరావు M INC 25821 చెన్నమనేని రాజేశ్వరరావు M CPI 23135
1967 254 సిరిసిల్ల జనరల్ సి.ఆర్.రావు M CPI 23525 జువ్వాడి నరసింగరావు M INC 15193
1962 261 సిరిసిల్ల జనరల్ జువ్వాడి నరసింగరావు M INC 15811 గుడ్ల లక్ష్మీనరసయ్య M IND 6703

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో సిట్టింగ్ శాసనసభ్యుడు సీనియర్ సి.పి.ఐ. నేత సీహెచ్. రాజేశ్వరరావు తెలుగుదేశం పార్టీ టికెట్టుతో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటి చైర్మెన్ అయిన ఆర్.పాపారావు చేతిలో 9561 ఓట్ల తేడాతో పరాజయం పొందినాడు.

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి రేగులపాటి పాపారావుపై 17008 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రాజేశ్వరరావుకు 64003 ఓట్లు రాగా, పాపారావుకు 46995 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎర్రబెల్లి చంద్రశేఖరరావు పోటీ చేయగా[2] మహాకూతమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు కుమారుడు కె.తారక రామారావు పోటీపడ్డాడు. కాంగ్రెస్ తరఫున గుడ్ల మంజుల, ప్రజారాజ్యం పార్టీ నుండి గాజుల బాలయ్య, లోక్‌సత్తా తరఫున సంతోష్ బాబు పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009