నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం
ఇది భారతదేశ తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఇది జహీరాబాదు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనికి వచ్చును.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- మానూర్
- నారాయణ్‌ఖేడ్
- కల్హేర్
- శంకరంపేట్
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1962 ఆర్.దేశ్‌పాండే స్వతంత్ర అభ్యర్థి ఎస్.అప్పారావు కాంగ్రెస్ పార్టీ 1967 శివారావు కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.కె.ఆర్.పటేల్ స్వతంత్ర అభ్యర్థి 1972 ఎం.వెంకట్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి శివారావు కాంగ్రెస్ పార్టీ 1978 శివారావు ఇందిరా కాంగ్రెస్ ఎం.వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 1983 ఎం.వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శివారావు కాంగ్రెస్ పార్టీ 1985 శివారావు కాంగ్రెస్ పార్టీ ఎం.వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 1989 పి.కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 1994 ఎం.విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పి.కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ 1999 పి.కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2004 సురేష్ కుమార్ శేఖర్ కాంగ్రెస్ పార్టీ ఎం.విజయపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2009 కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయపాల్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ 2014 కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.విజయపాల్ రెడ్డి తె.రా.స 2016 (ఉప ఎన్నిక) మహారెడ్డి భూపాల్ రెడ్డి తెరాస పి. సంజీవ రెడ్డి కాంగ్రెసు పార్టీ 2018
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎస్.భూపాల్ రెడ్డి పోటీపడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి అమర్ సింగ్ పవార్ పోటీచేశారు.[1]
2014ఎన్నికలు[మార్చు]
2014 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసిన ప.కిష్టా రెడ్డి తన సమీప ప్రత్యర్థియు తె.రా.స అభ్యర్థియునైన మ.భూపాల్ రెడ్డిపై 14746 ఓట్ల తేడాతో గెలుపొందిరి. ఆ ఎన్నికలలో ప.కిష్టారెడ్డికి 62,347 ఓట్లు, మ.భూపాల్ రెడ్డీకి 47,601 ఓట్లు లభించినవి. 25 ఆగస్టు 2015 నాడు ప.కిస్టారెడ్డి గుండెపోటుతో మరణించారు.
2016 ఉప-ఎన్నిక[మార్చు]
నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు ప.కిష్టారెడ్డి మృతితో ఖాళీయైన ఈ నియోజకవర్గమునకు 13 ఫిబ్రవరి 2016 నాడు ఉప ఎన్నిక నిర్వహింపబడెను. ఆ ఉప-ఎన్నికలో అధికార తె.రా.స.కు చెందిన మ.భూపాల్ రెడ్డి గెలుపొందిరి.
ఇవి కూడా చూడండి[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా
మూలాలు[మార్చు]
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009