మెదక్ లోక్‌సభ నియోజకవర్గం
(మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గంలో గతంలో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గములు అధికంగా కలిశాయి. గతంలో మహామహులు పోటీచేసిన ఘనతను ఈ నియోజకవర్గం కలిగిఉంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో పాటు మల్లికార్జున్, బాగారెడ్డి వంటి ఉద్ధండులు ఇక్కడి నుంచి గెలుపొందినారు. [1]
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]
- సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం
- మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం
- నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
- సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం
- పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం
- దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం
- గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 ఎన్.ఎం.జయసూర్య పీపుల్స్ డెమక్రాటిక్ ఫ్రంట్ (పి.డి.ఎఫ్) రెండవ 1957-62 పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్ మూడవ 1962-67 పి. హనుమంతరావు భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 సంగం లక్ష్మీబాయి భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 మల్లికార్జున్ గౌడ్ తెలంగాణా ప్రజా సమితి ఆరవ 1977-80 మల్లికార్జున్ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 పి.మాణిక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998-99 ఎం.బాగారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 ఆలె నరేంద్ర భారతీయ జనతా పార్టీ పదునాల్గవ 2004-09 ఆలె నరేంద్ర తెలంగాణ రాష్ట్ర సమితి పదిహేనవ 2009-14 విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి
2004 ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం
ఆలె నరేంద్ర (50.36%)
పి. రామచంద్రా రెడ్డి (36.62%)
సూర్య ప్రకాష్ నల్లా (5.80%)
ఇండెపెండెంట్లు (7.22%)
భారత సాధారణ ఎన్నికలు,2004: మెదక్ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెరాస | ఆలె నరేంద్ర | 453,738 | 50.36 | +50.36 | |
భాజపా | పి. రామచంద్రా రెడ్డి | 329,972 | 36.62 | -11.58 | |
బసపా | సూర్య ప్రకాష్ నల్లా | 52,273 | 5.80 | ||
ఇండిపెండెంట్ | మహమ్మద్ ఉల్ఫతలీ | 34,476 | 3.83 | ||
ఇండిపెండెంట్ | కె. లక్ష్మయ్య యాదవ్ | 18,457 | 2.05 | ||
ఇండిపెండెంట్ | పి. జీవుల నాయక్ | 12,099 | 1.34 | ||
మెజారిటీ | 124,766 | 13.74 | +61.94 | ||
మొత్తం పోలైన ఓట్లు | 901,015 | 71.60 | +0.41 | ||
తెరాస గెలుపు | మార్పు | +50.36 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నరేంద్రనాథ్ పోటీ చేసారు. [2] భారతీయ జనతా పార్టీ నుండి పటోళ్ళ నిరూప్ రెడ్డి పోటీ చేశారు. [3].తెలంగాణా రాష్ట్ర సమితి తరపున విజయశాంతి పోటీ చేసారు.
అభ్యర్థి (పార్టీ) | పొందిన ఓట్లు |
---|---|
విజయశాంతి(తె.రా.స) | 3,88,839
|
సి.నరేంద్రనాథ్ (కాంగ్రెస్) | 3,82,762
|
2014 ఎన్నికలు[మార్చు]
కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు తెరాస
మూలాలు[మార్చు]
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 18-03-2009