సదాశివపేట
సదాశివపేట | |
— పట్టణం — | |
తెలంగాణ పటంలో పట్టణ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°36′58″N 77°55′07″E / 17.6160739°N 77.9184819°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి |
మండలం | సదాశివపేట |
ప్రభుత్వం | |
- మునిసిపల్ ఛైర్మన్ | పిల్లోడి జయమ్మ |
వైశాల్యము | |
- మొత్తం | 24.4 km² (9.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,809 |
పిన్ కోడ్ | 502291 |
Area code(s) | 08455 |
ఎస్.టి.డి కోడ్ |
సదాశివపేట, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం.[1]
ఇది పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 94,337 - పురుషులు 47,665 - స్త్రీలు 46,672
2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.[3] పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.[4]
మండలంలోని పట్టణాలు
[మార్చు]- సదాశివపేట (M+OG)
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-16.
- ↑ ఈనాడు దినపత్రిక, మెదక్ జిల్లా టాబ్లాయిడ్, తేది 10-03-2014
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-04. Retrieved 2019-04-10.