1996 భారత సార్వత్రిక ఎన్నికలు
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
545 లో 543 స్థానాలకు 272 seats needed for a majority | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 592,572,288 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Turnout | 57.94% ( 1.21pp) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Results by constituency | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
భారతదేశంలో పదకొండవ లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1996 ఏప్రిల్ 27, మే 2 మే 7 తేదీలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రెండు వారాల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కూటమి పార్లమెంటరీ మెజారిటీని సాధించగలిగింది. జనతాదళ్‌కు చెందిన హెచ్‌డి దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యాడు. గౌడ తర్వాత 1997లో యునైటెడ్ ఫ్రంట్ నుండి ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రి అయ్యాడు. అస్థిరత కారణంగా 1998లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1980 తర్వాత ఒకే ఎన్నికల వ్యవధిలో ప్రతి రాష్ట్రంలోని స్థానాలకు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
నేపథ్యం
[మార్చు]ప్రధానమంత్రి పివి నరసింహారావు నేతృత్వం లోని భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) ప్రభుత్వం అనేక ప్రభుత్వ కుంభకోణాల ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. గత పదవీ కాలంలో ఏడుగురు కేబినెట్ సభ్యులు రాజీనామా చేశారు. రావు స్వయంగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాడు. కాంగ్రెస్ (ఐ) పార్టీ ఇటీవలి సంవత్సరాలలో అనేక చీలికలు, సమస్యలతో పాటు, వివిధ కీలక ప్రాంతీయ పార్టీలు, ప్రముఖులు పార్టీని విడిచిపెట్టడం వంటి వివాదాలతో బాధపడుతోంది. ప్రత్యేకించి, అర్జున్ సింగ్, నారాయణ్ దత్ తివారీలు 1995 మేలో పార్టీని వీడి కొత్త అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) పార్టీని స్థాపించడం కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలను నొక్కిచెప్పింది.
ఫలితాలు
[మార్చు]బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఏర్పడిన మతపరమైన ధ్రువణాన్ని ఎల్‌కె అద్వానీ, బిజెపి అధ్యక్షుడిగా దూకుడుగా ప్రచారం చేయడంతో ఆ పార్టీ ఈ ఎన్నికలలో లాభం పొందింది. 161 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని, పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించింది.[1] ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఎవరికీ లభించనందున హంగ్ పార్లమెంటు ఏర్పడింది. కాంగ్రెస్ (ఇందిర) ఓట్ షేర్ పరంగా ఏకైక అతిపెద్ద పార్టీగా కొనసాగినప్పటికీ, మొదటి సాధారణ ఎన్నికల తర్వాత మొదటిసారిగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓట్‌షేర్ 30% కంటే తక్కువగా పడిపోయింది. ఈ ఫలితం కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత చెత్త ఫలితంగా పరిగణించబడింది. ప్రధానమంత్రి రావుకు ఉన్న వ్యక్తిగత ప్రజావ్యతిరేకత, పార్టీని దెబ్బతీసిన అనేక అంతర్గత విభేదాలే ఇందుకు కారణమని వ్యాఖ్యానాలు వచ్చాయి. రామ్ లఖన్ సింగ్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా, సత్యేంద్ర నారాయణ్ సిన్హా వంటి అనేక మంది దిగ్గజాలు ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కాంగ్రెస్ (ఐ) దాని సాంప్రదాయక కోటలలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది, జనతాదళ్ & బిజెపి రెండూ ఎన్నికలలో ఎదురుదెబ్బలు చవిచూశాయి.[2] లోక్‌సభలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ఓట్లలో గానీ, సీట్లలో గానీ గణనీయమైన పెరుగుదల లేనందున పార్లమెంటరీ మెజారిటీని సాధించడానికి తగినన్ని సీట్లు పొందలేకపోయింది.[3]
వెస్ట్‌మినిస్టర్ ఆచారాన్ని అనుసరించి, భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ బిజెపి నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాడు. మే 15న ప్రమాణస్వీకారం చేసిన కొత్త ప్రధానమంత్రికి పార్లమెంటులో మెజారిటీ మద్దతును నిరూపించుకోవడానికి రెండు వారాల సమయం ఇచ్చారు. మే 31న జరిగిన మొదటి విశ్వాస ఓటింగ్‌కు కొన్ని వారాల ముందు, ప్రాంతీయ, ముస్లిం పార్టీల నుండి మద్దతును పొందేందుకు స్థానాలను నియంత్రించడం ద్వారా సంకీర్ణాన్ని నిర్మించడానికి భాజపా ప్రయత్నించింది. అయితే మతపరమైన సమస్యలు, భాజపా అవలంబించే కొన్ని జాతీయవాద విధానాల పట్ల ఉన్న భయాలు ఈ ప్రయత్నాలకు ఆటంకం కలిగించాయి. మే 28న, వాజ్‌పేయి 545 మంది పార్లమెంటు సభ్యులలో 200 మంది కంటే ఎక్కువ మంది మద్దతును పోందలేకపోయానని అంగీకరిస్తూ, విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి బదులుగా రాజీనామా చేశాడు. తన 13 రోజుల ప్రభుత్వానికి ముగింపు పలికారు.[4]
రెండవ అతిపెద్ద పార్టీ అయిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిర) కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించింది. జనతాదళ్ నాయకుడు VP సింగ్ రెండవ సారి ప్రధానమంత్రి కావడానికి నిరాకరించడంతో, CPI (M) నాయకుడు & ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసును నేషనల్ ఫ్రంట్ తన ప్రధాన మంత్రి పదవిని చేపట్టమని సంప్రదించింది. కానీ పార్టీ పొలిట్‌బ్యూరో దానిని ఆమోదించలేదు (ఆ తరువాత దీన్నే బసు ఒక "చారిత్రక తప్పిదం" అని విమర్శించాడు). ప్రధానమంత్రి అభ్యర్థిగా జనతాదళ్ నాయకుడు & కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డి దేవెగౌడ పేరును బసు ప్రతిపాదించాడు. కాంగ్రెసు బయటి మద్దతుతో జనతాదళ్, చిన్న పార్టీల కూటమి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.[3] కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగించిన IK గుజ్రాల్‌కు మార్గం సుగమం చేసేందుకు భారత జాతీయ కాంగ్రెస్ [a] తన మద్దతు ఉపసంహరించుకోవడంతో గౌడ, 1997 ఏప్రిల్ 21 న రాజీనామా చేశాడు.
అయితే దాణా కుంభకోణం ఫలితంగా అనేక మంది యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు కూటమి భాగస్వామి, బీహార్ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యాదవ్, జనతాదళ్ నుండి విడిపోయి 1997 జూలై 3 న రాష్ట్రీయ జనతాదళ్ (RJD)ని ఏర్పాటు చేసాడు. పార్లమెంటులోని 45 మంది జనతాదళ్ సభ్యులలో 17 మంది పార్టీని వీడి యాదవ్‌కు మద్దతు ఇచ్చారు. అయితే, కొత్త పార్టీ యునైటెడ్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వడం కొనసాగించింది. గుజ్రాల్ ప్రభుత్వం తక్షణ ప్రమాదం నుండి బయటపడింది. డిఎంకెను ప్రభుత్వం నుండి బహిష్కరించడానికి గుజ్రాల్ నిరాకరించడంతో కాంగ్రెస్, ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో గుజ్రాల్, 11 నెలల తర్వాత రాజీనామా చేశాడు. దాంతో దేశం 1998 లో తిరిగి ఎన్నికలకు వెళ్లింది.
ఫలితాలు
[మార్చు]Party | Votes | % | Seats | |
---|---|---|---|---|
Indian National Congress (Indira) | 9,64,55,493 | 28.80 | 140 | |
Bharatiya Janata Party | 6,79,50,851 | 20.29 | 161 | |
Janata Dal | 2,70,70,340 | 8.08 | 46 | |
Communist Party of India (Marxist) | 2,04,96,810 | 6.12 | 32 | |
Bahujan Samaj Party | 1,34,53,235 | 4.02 | 11 | |
Samajwadi Party | 1,09,89,241 | 3.28 | 17 | |
Telugu Desam Party | 99,31,826 | 2.97 | 16 | |
Tamil Maanila Congress | 73,39,982 | 2.19 | 20 | |
Samata Party | 72,56,086 | 2.17 | 8 | |
Dravida Munnetra Kazhagam | 71,51,381 | 2.14 | 17 | |
Communist Party of India | 65,82,263 | 1.97 | 12 | |
Shiv Sena | 49,89,994 | 1.49 | 15 | |
All India Indira Congress (Tiwari) | 49,03,070 | 1.46 | 4 | |
NTR Telugu Desam Party (Lakshmi Parvathi) | 32,49,267 | 0.97 | 0 | |
Asom Gana Parishad | 25,60,506 | 0.76 | 5 | |
Shiromani Akali Dal | 25,34,979 | 0.76 | 8 | |
All India Anna Dravida Munnetra Kazhagam | 21,30,286 | 0.64 | 0 | |
Revolutionary Socialist Party | 21,05,469 | 0.63 | 5 | |
Republican Party of India | 14,54,363 | 0.43 | 0 | |
Jharkhand Mukti Morcha | 12,87,072 | 0.38 | 1 | |
All India Forward Bloc | 12,79,492 | 0.38 | 3 | |
Marumalarchi Dravida Munnetra Kazhagam | 12,35,812 | 0.37 | 0 | |
Haryana Vikas Party | 11,56,322 | 0.35 | 3 | |
Communist Party of India (Marxist–Leninist) Liberation | 8,08,065 | 0.24 | 0 | |
Indian Union Muslim League | 7,57,316 | 0.23 | 2 | |
Janata Party | 6,31,021 | 0.19 | 0 | |
Karnataka Congress Party | 5,81,868 | 0.17 | 1 | |
Pattali Makkal Katchi | 5,71,910 | 0.17 | 0 | |
Peasants and Workers Party of India | 4,37,805 | 0.13 | 0 | |
Indian Congress (Socialist) | 4,04,261 | 0.12 | 0 | |
Kerala Congress (M) | 3,82,319 | 0.11 | 1 | |
All India Majlis-e-Ittehadul Muslimeen | 3,40,070 | 0.10 | 1 | |
Shiromani Akali Dal (Simranjit Singh Mann) | 3,39,520 | 0.10 | 0 | |
Madhya Pradesh Vikas Congress | 3,37,539 | 0.10 | 1 | |
Bharipa Bahujan Mahasangh | 3,29,695 | 0.10 | 0 | |
Kerala Congress | 3,20,539 | 0.10 | 0 | |
Jharkhand Mukti Morcha (Mardi) | 2,99,055 | 0.09 | 0 | |
United Minorities Front, Assam | 2,44,571 | 0.07 | 0 | |
Apna Dal | 2,22,669 | 0.07 | 0 | |
Autonomous State Demand Committee | 1,80,112 | 0.05 | 1 | |
Forward Bloc (Socialist) | 1,72,685 | 0.05 | 0 | |
Gujarat Adijati Vikash Paksh | 1,66,003 | 0.05 | 0 | |
Maharashtrawadi Gomantak Party | 1,29,220 | 0.04 | 1 | |
Sikkim Democratic Front | 1,24,218 | 0.04 | 1 | |
Federal Party of Manipur | 1,20,557 | 0.04 | 0 | |
Marxist Co-ordination Committee | 1,14,406 | 0.03 | 0 | |
Krantikari Samajwadi Manch | 1,13,975 | 0.03 | 0 | |
Mizo National Front | 1,11,710 | 0.03 | 0 | |
United Goans Democratic Party | 1,09,346 | 0.03 | 1 | |
Jharkhand Party (Naren) | 1,02,111 | 0.03 | 0 | |
Jammu & Kashmir Panthers Party | 99,599 | 0.03 | 0 | |
Savarn Samaj Party | 84,725 | 0.03 | 0 | |
Jharkhand Party | 78,907 | 0.02 | 0 | |
Majlis Bachao Tahreek | 78,335 | 0.02 | 0 | |
Nag Vidarbha Andolan Samiti | 66,065 | 0.02 | 0 | |
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | 65,641 | 0.02 | 0 | |
Amra Bangali | 65,595 | 0.02 | 0 | |
Mahabharat People's Party | 64,266 | 0.02 | 0 | |
Chhattisgarh Mukti Morcha | 60,361 | 0.02 | 0 | |
Jharkhand People's Party | 58,132 | 0.02 | 0 | |
Bahujan Samaj Party (Ambedkar) | 52,585 | 0.02 | 0 | |
Tripura Upajati Juba Samiti | 52,300 | 0.02 | 0 | |
Akhil Bharatiya Jan Sangh | 49,978 | 0.01 | 0 | |
Satya Marg Party | 48,056 | 0.01 | 0 | |
Sikkim Sangram Parishad | 42,175 | 0.01 | 0 | |
Lok Hit Party | 37,127 | 0.01 | 0 | |
United Tribal Nationalist Liberation Front | 34,803 | 0.01 | 0 | |
Pavitra Hindustan Kaazhagam | 34,147 | 0.01 | 0 | |
Marxist Communist Party of India (S.S. Srivastava) | 33,900 | 0.01 | 0 | |
Kannada Chalevali Vatal Paksha | 31,136 | 0.01 | 0 | |
Akhil Bharatiya Bhrastachar Normoolan Sena | 30,970 | 0.01 | 0 | |
Hul Jharkhand Party | 30,220 | 0.01 | 0 | |
Bhoomijotak Samooh | 29,874 | 0.01 | 0 | |
Proutist Sarva Samaj Samiti | 26,403 | 0.01 | 0 | |
Akhil Bhartiya Loktantra Party | 25,131 | 0.01 | 0 | |
Republican Party of India (Athawale) | 22,640 | 0.01 | 0 | |
Uttar Pradesh Republican Party | 22,515 | 0.01 | 0 | |
Anaithinthiya Thamizhaga Munnetra Kazhag | 19,394 | 0.01 | 0 | |
New India Party | 19,135 | 0.01 | 0 | |
Bhatiya Krishi Udyog Sangh | 17,744 | 0.01 | 0 | |
Indian National League | 15,954 | 0.00 | 0 | |
Jan Parishad | 15,112 | 0.00 | 0 | |
Rashtriya Nayay Party | 13,160 | 0.00 | 0 | |
Lokdal | 11,957 | 0.00 | 0 | |
Shoshit Samaj Dal | 11,937 | 0.00 | 0 | |
Bahujan Kranti Dal (JAI) | 11,735 | 0.00 | 0 | |
Mahakushal Vikas Party | 11,152 | 0.00 | 0 | |
Jansatta Party | 10,901 | 0.00 | 0 | |
Bharatiya Minorities Suraksha Mahasangh | 10,657 | 0.00 | 0 | |
Republican Party of India (Democratic) | 10,072 | 0.00 | 0 | |
Gondwana Ganatantra Party | 9,985 | 0.00 | 0 | |
Pragtisheel Manav Samaj Party | 9,974 | 0.00 | 0 | |
Akhil Bharatiya Berozgaar Party | 9,813 | 0.00 | 0 | |
Janhit Morcha | 9,404 | 0.00 | 0 | |
Hindustan Janata Party | 9,208 | 0.00 | 0 | |
Rashtriya Samajwadi Party 'pragatisheel' | 8,779 | 0.00 | 0 | |
Lok Party | 8,758 | 0.00 | 0 | |
Pachim Banga Rajya Muslim League | 8,624 | 0.00 | 0 | |
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖోబ్రాగడె) | 8,491 | 0.00 | 0 | |
Akhil Bhartiya Janata Vikas Party | 7,726 | 0.00 | 0 | |
Arya Sabha | 7,563 | 0.00 | 0 | |
Bharatiya Jan Sabha | 7,338 | 0.00 | 0 | |
Republican Presidium Party of India | 7,298 | 0.00 | 0 | |
Bahujan Kranti Dal | 6,968 | 0.00 | 0 | |
Political Party of National Management Service | 6,667 | 0.00 | 0 | |
Rashtriya Surajya Parishad | 6,000 | 0.00 | 0 | |
Samajwadi Janata Party (Maharashtra) | 5,784 | 0.00 | 0 | |
Maharashtra Pradesh Krantikari Party | 5,765 | 0.00 | 0 | |
Akhil Bartiya Manav Seva Dal | 5,673 | 0.00 | 0 | |
National Republican Party | 5,271 | 0.00 | 0 | |
Indian Democratic Party | 5,084 | 0.00 | 0 | |
Bharatiya Lok Tantrik Mazdoor Dal | 5,075 | 0.00 | 0 | |
Surajya Party | 4,917 | 0.00 | 0 | |
Hindu Mahasabha | 4,720 | 0.00 | 0 | |
Rashtriya Aikta Manch | 4,574 | 0.00 | 0 | |
National Democratic Peoples Front | 4,462 | 0.00 | 0 | |
Bolshevik Party of India | 4,345 | 0.00 | 0 | |
Bharatiya Lok Panchayat | 4,018 | 0.00 | 0 | |
Bharatiya Rashtriya Party | 3,724 | 0.00 | 0 | |
Rashtriya Kisan Party | 3,635 | 0.00 | 0 | |
Akhil Bharatiya Mahasand Sarvahara Krantikari Party | 3,552 | 0.00 | 0 | |
Bharatiya Labour Party | 3,550 | 0.00 | 0 | |
Rashtriya Unnatsheel Das | 3,476 | 0.00 | 0 | |
Rashtriya Samdarshi Party | 3,360 | 0.00 | 0 | |
Vijeta Party | 3,328 | 0.00 | 0 | |
Satyayug Party | 3,319 | 0.00 | 0 | |
Bharatiya Rashtriya Morcha | 3,181 | 0.00 | 0 | |
Rashtriya Mazdoor Ekta Party | 3,176 | 0.00 | 0 | |
Marxist Engelist Leninist Proletariat Health Commune | 3,155 | 0.00 | 0 | |
Akhil Bharatiya Rashtriya Azad Hind Party | 3,152 | 0.00 | 0 | |
Bahujan Samaj Party (Raj Bahadur) | 3,114 | 0.00 | 0 | |
Socialist Party (Lohia) | 3,006 | 0.00 | 0 | |
Kannada Paksha | 2,883 | 0.00 | 0 | |
Bharatiya Manav Raksha Dal | 2,796 | 0.00 | 0 | |
Akhil Bharatiya Dalit Utthan Party | 2,654 | 0.00 | 0 | |
Akhil Bharatiya Desh Bhakt Morcha | 2,295 | 0.00 | 0 | |
Indian Secular Congress | 2,136 | 0.00 | 0 | |
Bira Oriya Party | 2,088 | 0.00 | 0 | |
Republican Party of India (Sivaraj) | 2,081 | 0.00 | 0 | |
Bharathiya Nethaji Party | 2,024 | 0.00 | 0 | |
Bharatiya Rajiv Congress | 1,967 | 0.00 | 0 | |
Bharatiya Jantantrik Parishad | 1,867 | 0.00 | 0 | |
Ekta Samaj Party | 1,852 | 0.00 | 0 | |
Congress Of People | 1,850 | 0.00 | 0 | |
Revolutionary Communist Party Of India (Rasik Bhatt) | 1,803 | 0.00 | 0 | |
Bhartiya Ekta Party | 1,801 | 0.00 | 0 | |
Shoshit Samaj Party | 1,684 | 0.00 | 0 | |
Samajwadi Dal | 1,637 | 0.00 | 0 | |
Akhil Bharatiya Shivsena Rashtrawadi | 1,477 | 0.00 | 0 | |
Bharatiya Kranti Sena | 1,439 | 0.00 | 0 | |
Indian Democratic People's Party | 1,438 | 0.00 | 0 | |
Ekta Krandi Dal U.P. | 1,409 | 0.00 | 0 | |
Indian Bahujan Samajwadi Party | 1,376 | 0.00 | 0 | |
Sarvadharam Party (Madhya Pradesh) | 1,327 | 0.00 | 0 | |
People's Democratic League of India | 1,276 | 0.00 | 0 | |
Punjab Vikas Party (Punjab) | 1,185 | 0.00 | 0 | |
Desh Bhakt Party | 1,148 | 0.00 | 0 | |
Sabjan Party | 1,120 | 0.00 | 0 | |
Akhil Bharatiya Lok Tantrik Alp-Sankhyak Jan Morcha | 1,111 | 0.00 | 0 | |
Kisan Vyawasayee Mazdoor Party | 1,056 | 0.00 | 0 | |
Pratap Shiv Sena | 1,049 | 0.00 | 0 | |
Adarsh Lok Dal | 1,037 | 0.00 | 0 | |
Gareebjan Samaj Party | 962 | 0.00 | 0 | |
Akhil Bharatiya Dharmnirpeksh Dal | 894 | 0.00 | 0 | |
All India Azad Hind Mazdur & Jan Kalyan Party | 883 | 0.00 | 0 | |
Bahujan Loktantrik Party | 857 | 0.00 | 0 | |
Socialist Party (Ramakant Pandey) | 848 | 0.00 | 0 | |
Manav Sewa Sangh | 841 | 0.00 | 0 | |
Bharatiya Samajwadi Vikas Party | 805 | 0.00 | 0 | |
Akhil Bhartiya Rajarya Sabha | 787 | 0.00 | 0 | |
Indian Union Muslim League (IUML) | 786 | 0.00 | 0 | |
Akhil Bharatiya Ram Rajya Parishad | 724 | 0.00 | 0 | |
Ambedkar Kranti Dal | 667 | 0.00 | 0 | |
Bhartiya Jan Kisan Party | 633 | 0.00 | 0 | |
Mahabharath Mahajan Sabha | 572 | 0.00 | 0 | |
Bharatiya Samaj Sangathan Morcha | 535 | 0.00 | 0 | |
Rashtriya Bharat Nav Nirman Sangathan | 528 | 0.00 | 0 | |
Samajik Kranti Dal | 522 | 0.00 | 0 | |
Rashtriya Krantikari Dal | 520 | 0.00 | 0 | |
Bharat Jan Party | 505 | 0.00 | 0 | |
Hind National Party | 496 | 0.00 | 0 | |
Sachet Bharat Party | 470 | 0.00 | 0 | |
Bhartiya Azad Party | 457 | 0.00 | 0 | |
Bhrishtachar Virodhi Dal | 434 | 0.00 | 0 | |
Akhil Bharatiya Ram Rajya Parishad (Prem Ballabh Vyas) | 428 | 0.00 | 0 | |
Tamil Nadu Hindu Vellalar Youth Kazhagam | 422 | 0.00 | 0 | |
Pragati Sheel Party | 407 | 0.00 | 0 | |
Socialist League of India | 384 | 0.00 | 0 | |
United Indian Democratic Council | 374 | 0.00 | 0 | |
Rashtriya Samaj Sevak Dal | 348 | 0.00 | 0 | |
Akhil Bhartiya Kisan Mazdoor Morcha | 345 | 0.00 | 0 | |
Hindu Praja Party | 332 | 0.00 | 0 | |
Janata Kranti Congress | 324 | 0.00 | 0 | |
Mukt Bharat | 295 | 0.00 | 0 | |
Jan Swarajya Party | 278 | 0.00 | 0 | |
Gujarat Janta Parishad | 266 | 0.00 | 0 | |
Bharat Pensioner's Front | 231 | 0.00 | 0 | |
Bharatiya Parivartan Morcha | 231 | 0.00 | 0 | |
All India Democratic People Federation | 195 | 0.00 | 0 | |
Akhil Bharatiya Jagrook Nagrik Dal | 176 | 0.00 | 0 | |
Federation of Sabhas | 142 | 0.00 | 0 | |
Hind Kisan Mazdoor Party | 131 | 0.00 | 0 | |
Poorvanchal Rashtriya Congress | 124 | 0.00 | 0 | |
Kranti Dal | 112 | 0.00 | 0 | |
Jan Ekata Morcha | 94 | 0.00 | 0 | |
Bharatiya Sarvkalyan Krantidal | 89 | 0.00 | 0 | |
Manav Samaj Party | 74 | 0.00 | 0 | |
Labour Party of India (V.V. Prasad) | 68 | 0.00 | 0 | |
Bharatiya Rashtrawadi Dal | 53 | 0.00 | 0 | |
Independents | 2,10,41,557 | 6.28 | 9 | |
Nominated Anglo-Indians | 2 | |||
Total | 33,48,73,286 | 100.00 | 545 | |
చెల్లిన వోట్లు | 33,48,73,286 | 97.54 | ||
చెల్లని/ఖాళీ వోట్లు | 84,34,804 | 2.46 | ||
మొత్తం వోట్లు | 34,33,08,090 | 100.00 | ||
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు | 59,25,72,288 | 57.94 | ||
మూలం: ECI |
ఇవి కూడా చూడండి
[మార్చు]- 11వ లోక్‌సభ సభ్యుల జాబితా
- భారత ఎన్నికల సంఘం
- 1992 భారత రాష్ట్రపతి ఎన్నికలు
గమనికలు
[మార్చు]- ↑ After 1996, the Indian National Congress (Indira) dropped the suffix 'Indira' from its name, thereby becoming known as Indian National Congress
మూలాలు
[మార్చు]- ↑ Guha, Ramachandra (2007), India after Gandhi: the history of the world's largest democracy, India: Picador, p. 633, ISBN 978-0-330-39610-3
- ↑ Elections 1996: 11th Lok Sabha elections saw eclipse of the National Constituency syndrome Archived 18 ఆగస్టు 2016 at the Wayback Machine India Today, 31 May 1996
- ↑ 3.0 3.1 Hardgrave, Robert (1996). "1996 Indian Parliamentary Elections: What Happened? What Next?". University of Texas. Archived from the original on 7 August 2008. Retrieved 12 December 2008.
- ↑ "India's prime minister resigns after 13 days". CNN. 28 May 1996. Archived from the original on 25 August 2004. Retrieved 12 December 2008.