శంకర దయాళ్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shankar Dayal Sharma
शंकर दयाल शर्मा
శంకర దయాళ్ శర్మ


9వ రాష్ట్రపతి
పదవీ కాలం
జూలై 25 1992 – జూలై 25 1997
ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు
అటల్ బిహారి వాజపేయి
దేవెగౌడ
ఐ.కె.గుజ్రాల్
ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్
ముందు ఆర్.వెంకటరామన్
తరువాత కె.ఆర్. నారాయణన్

ఉపరాష్ట్రపతి
పదవీ కాలం
సెప్టెంబర్ 3 1987 – జూలై 25 1992
అధ్యక్షుడు ఆర్.వెంకటరామన్
ముందు ఆర్.వెంకటరామన్
తరువాత కె.ఆర్. నారాయణన్

మహారాష్ట్ర గవర్నర్
పదవీ కాలం
ఏప్రిల్ 3 1986 – సెప్టెంబర్ 2 1987
ముందు కోన ప్రభాకర రావు
తరువాత కాసు బ్రహ్మానందరెడ్డి

పంజాబ్ గవర్నర్
పదవీ కాలం
నవంబర్ 26 1985 – ఏప్రిల్ 2 1986
ముందు హోకిశే సీమ
తరువాత సిద్దార్థ్ శంకర్ రే

ఆంధ్రప్రదేశ్ గవర్నర్
పదవీ కాలం
ఆగస్ట్ 29 1984 – నవంబర్ 26 1985
ముందు టాకూర్ రాంలాల్
తరువాత కుముద్ బెన్ జోషి

వ్యక్తిగత వివరాలు

జననం (1918-08-19)1918 ఆగస్టు 19
భోపాల్, మధ్యప్రదేశ్, ఇండియా
మరణం 1999 డిసెంబరు 26(1999-12-26) (వయసు 81)
న్యూఢిల్లీ, ఇండియా
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి విమల శర్మ
సంతానం ఇద్దరు కుమారులు
ఒక కుమార్తె
మతం హిందూ
సంతకం శంకర దయాళ్ శర్మ's signature

శంకర్ దయాళ్ శర్మ (ఆగస్టు 19, 1918డిసెంబర్ 26, 1999) ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు. భోపాల్ నగరంలో 1918, ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసాడు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా, పంజాబ్ గవర్నర్‌గా, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశాడు.

విద్యాభ్యాసం[మార్చు]

శర్మ సెయింట్ జాన్ కళాశాల, ఆగ్రా కళాశాల, అలహాబాద్ విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం, ఫిట్జ్ విలియం కళాశాల, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, లింకన్స్ ఇన్, హార్వర్డ్ న్యాయ పాఠశాల మొదలైన అనేక విద్యా సంస్థల్లో విద్య నభ్యసించడం జరిగింది.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1940 వ దశకంలో శర్మ భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. అదే దశకంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి వరకూ అదే పార్టీకి విధేయులుగా ఉన్నాడు. 1952 లో అప్పటి భోపాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 1956లో భోపాల్ మిగతా చిన్న రాష్ట్రాలతో కలిసి మధ్యప్రదేశ్ ఏర్పడేవరకూ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

1960లలో ఇందిరా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడాన్ని సమర్థించాడు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేక మంత్రి పదవులు నిర్వహించాడు. 1974-77 మధ్యలో కమ్యూనికేషన్ల శాఖా మంత్రిగా పనిచేశాడు.

మరణం[మార్చు]

తన చివరి ఐదు సంవత్సరాల్లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. 1999 అక్టోబరు 9 న విపరీతమైన గుండెపోటుతో ఢిల్లోని ఒక వైద్యశాలలో అడ్మిట్ చేశారు. కొద్ది సేపటికే ఆయన తుదిశ్వాస విడిచాడు. ఆయన భౌతిక కాయాన్ని విజయ్ ఘాట్ వద్ద ఖననం చేశారు.

విశేషాలు[మార్చు]

  • ఆయన చనిపోయే వరకు విధిగా ప్రతి యేటా తిరుమలకు వచ్చి శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేవాడు.
  • భారత తపాలాశాఖ 2000, అక్టోబర్ 17న ఇతని జ్ఞాపకార్థం ఒక తపాలాబిళ్ళ విడుదలచేసింది.

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]