Jump to content

ప్రతిభా పాటిల్

వికీపీడియా నుండి
ప్రతిభా పాటిల్
ప్రతిభా పాటిల్


పదవీ కాలం
25 జూలై 2007 – 25 జూలై 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ఉపరాష్ట్రపతి ముహమ్మద్ హమీద్ అన్సారి
ముందు ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
తరువాత ప్రణబ్ ముఖర్జీ

రాజస్థాన్ గవర్నర్
పదవీ కాలం
8 నవంబరు 2004 – 23 జూన్ 2007
ముందు మదన్ లాల్ ఖురానా
తరువాత అఖ్లకుర్ రహ్మాన్ కిడ్వాయి

వ్యక్తిగత వివరాలు

జననం (1934-12-19) 1934 డిసెంబరు 19 (వయసు 89)
నడ్గావ్, బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం మహారాష్ట్ర, భారత దేశము )
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్
జీవిత భాగస్వామి దేవీసింగ్ రాణ్‌సింగ్ షెకావత్ (1965–ప్రస్తుతం)
పూర్వ విద్యార్థి పూణే విశ్వవిద్యాలయం
ముంబై విశ్వవిద్యాలయం

ప్రతిభా పాటిల్ (audio speaker iconఉచ్ఛారణ ) (జ. 1934 డిసెంబరు 19) భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి, మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.[1] ఆమె 2007 నుండి 2012 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలను నిర్వర్తించింది. ఆమె రాజస్థాన్ గవర్నరుగా 2004 నుండి 2007 వరకు తన సేవలనందించింది.దేవి సింగ్ రాంసింగ్ షెకావత్ ప్రతిభా పాటిల్ భర్త.

ప్రారంభ జీవితం

[మార్చు]

ప్రతిభా పాటిల్ నారాయణ రావు పాటిల్ కుమార్తె.[2] ఆమె 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రములోని నందగావ్‌లో జన్మించింది. ప్రారంభ విద్యను జల్గాన్ లోని ఆర్.ఆర్ విద్యాలయలో పూర్తిచేసింది. తరువాత ఆమె జల్గాన్ లోణి మోల్జీ జెత్నా కళాశాల (పూణె విశ్వవిద్యాలయం అనుబంధం) లో రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం అంశాలలో ఎం.ఏలు చేసింది. ముంబై విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో బి.ఎ. డిగ్రీని చేసింది. కళాశాల రోజుల్లో టేబుల్ టెన్నిస్ క్రీడలో బాగా రాణించిన పాటిల్, అనేక అంతర్-కళాశాల పోటీలలో గెలుపొందింది.[3] 1962లో, ప్రతిభా పాటిల్ ఎం.జె.కళాశాల "కాలేజ్ క్వీన్"గా ఎన్నికైంది.[4] పాటిల్ జల్గాన్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించింది. భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను మెరుగుపరచడానికి సామాజిక అంశాలపై ఆసక్తిని పెంచుకొంది.[5] ఆమె 1965, జూలై 7న విద్యావేత్త దేవీసింగ్ రణ్‌సింగ్ షెకావత్ను వివాహమాడినది.[6] ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అతడు కూడా రాజకీయ నాయకుడే.[7][2]

రాజకీయ జీవితం

[మార్చు]

1962 లో తన 27వ యేట ఆమె మహారాష్ట్ర లోని జలగావ్ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యురాలిగా ఎన్నికై రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. [8] తరువాత ఆమె "ముక్తైనగర్ నియోజకవర్గం" నుండి 1967 నుండి 1985 వరకు వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యురాలిగా ఎన్నిక అయింది. 1985 నుండి 1990 వరకు పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభకు ఎన్నిక అయింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో ఆమె 10వ లోక్‌సభకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందింది. [5] తరువాత ఒక దశాబ్దం కాలంపాటు ఆమె రాజకీయాల్లో పదవీ విరమణ చేసింది. [9] ఆమె మహారాష్ట్ర శాసన సభలో సభ్యురాలిగా ఉన్న కాలంలో అనేక కేబినెట్ మంత్రి పదవులను చేసింది. ఆమె రాజ్యసభ, లోక్‌సభలలో అధికార స్థానాలలో కూడా పనిచేసింది. అదనంగా కొన్ని సంవత్సరాల పాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలిగా, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకుకు డైరక్టరుగా, గవర్నమెంటు కౌన్సిల్ ఆఫ్ ద నేషనల్ కో-ఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సభ్యురాలిగా కూడా తన సేవలనందించింది. [2]

2004 నవంబరు 8 న ఆమె రాజస్థాన్ రాష్ట్రానికి 17వ గవర్నరుగా నియమిపబడింది. [10] 2004 నుండి 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు రాజస్థాన్ రాష్ట్రానికి 24వ, తొలి మహిళా గవర్నరుగా పనిచేసింది. అదే సంవత్సరము, కాంగ్రేసు పార్టీ అభ్యర్థిగా ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైంది.[9]

రాష్ట్రపతిగా

[మార్చు]
2010 అక్టోబరులో డూన్ పాఠశాల ప్లాటినం జూబ్లీ వేడుకలలో సందేశమిస్తున్న పాటిల్

ఎన్నిక

[మార్చు]

పాటిల్ ను 2007 జూన్ 14 న యునైటెడ్ ప్రొగ్రెస్సెవ్ ఆలియన్స్ (యు.పి.ఎ) రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. యు.పి.ఎ మొదట రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ప్రకటించదలచిన మాజీ గృహమంత్రి శివరాజ్ పాటిల్ లేదా కరణ్ సింగ్ ల అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు అంగీకరించనందున పాటిల్‌ను ఒక రాజీ మార్గ అభ్యర్థిగా ప్రకటించారు[11].

పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ కు, నెహ్రూ గాంధీ కుటుంబానికి అనేక దశాబ్దాల పాటు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నందున కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఆమెను ఎంపిక చేసింది. అయితే "రబ్బరు స్టాంప్ ప్రెసిడెంట్"గా ఉండాలనే ఉద్దేశం తనకు లేదని పాటిల్ చెప్పింది.[9][12]

ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయబడిన నెలలోనే, 2005 లో విశ్రాం పాటిల్ హత్య కేసులో ఆమె సోదరుడు జి.ఎన్ పాటిల్‌ను రక్షించారని పాటిల్ ఆరోపింపబడింది. జల్గావ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎన్నికలో విశ్రాంపాటిల్ జి.ఎన్ పాటిల్ ను కొద్ది ఓట్ల తేడాతో ఓడించాడు. ఆ సెప్టెంబరు నెలలో విక్రం పాటిల్ హత్యకు గురయ్యాడు.

విశ్రాంపాటిల్ వితంతువు జి.ఎన్ పాటిల్ కు హత్యతో ప్రమేయం ఉందని ఆరోపించింది. ఆమె ప్రతిభాపాటిల్ ప్రభావం నేర పరిశోధనలో ఉందని ఆరోపించింది. [13] ఆమె ఆరోపణలను 2009 లో కోర్టులు తిరస్కరించాయి.[14] కానీ 2015లో జి.ఎన్. పాటిల్ పై నేరం మోపబడింది. ఈ సమయంలో ప్రతిభా పాటిల్ జోక్యం చేసుకున్నారనడానికి ఏ ఆధారం లేదు. [15]

అధ్యక్ష పదవి అలంకారప్రాయమైనది కావడంతో, ఈ ఎన్నిక సాధారణంగా వివిధ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయంతో జరుగుతుంది.[16] సాధారణ పరిస్థితులకు విరుద్ధంగా, ఈ ఎన్నికలో పాటిల్ ప్రత్యర్థిని ఎదుర్కొన్నది. [17] ఆమె ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి వచ్చిన అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ ఉన్నాడు. షెకావత్ స్వతంత్ర అభ్యర్థిగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్.డి.ఎ) చే మద్దతు పొందాడు. ఈ వర్గం భారతీయ జనతా పార్టీచే నడుపబడుతుంది.[18] అయినప్పటికీ పాటిల్ మరాఠీ మూలాలు కలిగి ఉన్నందున ఎన్.డి.ఎ లోని శివసేన పార్టీ పాటిల్ కు మద్దతు నిచ్చింది. [19]

అధ్యక్షురాలిగా పాటిల్ ను వ్యతిరేకించేవారు ఆమెకు చరిష్మా లేదని, అనుభవం, పరిపాలనా సామర్థ్యాలు లేవని ఆరోపించేవారు. ఉన్నత స్థాయి రాజకీయాలకు దూరంగా ఆమె గడిపిన సమయాన్ని వారు ఎత్తి చూపారు. ఆమెకు అతీంద్రయ శక్తులపై ఆమెకున్న నమ్మకాలను -చనిపోయిన గురువు దాదా లేఖ్రాజ్ నుండి తనకు సమాచారం అందుతుందనే నమ్మకం వంటివాటిని - వారు ప్రశ్నించారు.[9][17][20] ఆమె 1975లో చేసిన "వంశపారంపర్య వ్యాధులు ఉన్నవారిని క్రిమిరహితం చేయాలి" అనే వ్యాఖ్యను ఎత్తి చూపారు. [9] ఆమె ఆమ్రావతి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నప్పుడు ఎం.పి. లాడ్స్ నిధుల నుండి 3.6 మిలియన్ల డబ్బును ఆమె భర్త నడుపుతున్న ట్రస్టుకు బదిలీ చేసారని ఆరోపించారు. ఎంపీలు వారి బంధువులచే నిర్వహించబడే సంస్థలకు నిధులను అందించడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లని ఆరోపించారు.[21] పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పాటిల్ ఎంపి.లాడ్స్ నిధుల మూలంగా ఎలాంటి తప్పు చేయలేదని, ఉపయోగించిన నిధులను భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేసిందని తెలియజేసాడు.[22] పాటిల్ 2007 జూలై 19 న ఎన్నికలో గెలిచింది. ఆమెకు మూడింట రెండు వంతుల ఓట్లు వచ్చాయి. [23] భారతదేశ మొదటి రాష్ట్రపతిగా 2007 జూలై 25 న ప్రమాన స్వీకారం చేసింది. [1]

కార్యాలయంలో

[మార్చు]

ఆమె రాష్ట్రపతిగా ఉన్న కాలంలో అనేక వివాదాలను చూసింది. [24] 35 మంది అభ్యర్థుల మరణ శిక్షను ఆమె జీవిత ఖైదుగా మార్చి రికార్డు సృష్టించింది. హోం మంత్రిత్వ శాఖ సలహాను పరిశీలిస్తూ, పరిశీలించిన తర్వాత పిటిషనర్లకు అధ్యక్షుడు క్షమాభిక్ష పెట్టడాన్ని అధ్యక్ష కార్యాలయం సమర్ధించింది.[25][26] ఆమె విదేశీ పర్యటనలకు ఎక్కువగా డబ్బు ఖర్చుచేసినట్లు, ఏ ఇతర పూర్వపు అధ్యక్షులు ఇన్ని పర్యటనలు చేసి ఉందలేదని గుర్తింపబడింది.[27]

కొన్నిసార్లు ఆమె కుటుంబం 11 మంది సభ్యులతో పాటుగా విదేశీ పర్యటనలు చేసారు. ఆమె 2012 మే నాటికి 22 దేశాలకు 12 విదేశీ పర్యటనలు చేసింది. ఈ మొత్తం ప్రయాణాల ఖర్చు 205 కోట్లు (2.05 బిలియన్లు). కుటుంబ సభ్యులను పర్యటనలకు తీసుకొని వెళ్ళడం "అసాధారణమైనది కాదు" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.[28]

రాష్ట్రపతి పదవీకాలం ఐదు సంవత్సరాలు.[17] పాటిల్ జూలై 2012 న పదవీ విరమణ చేసింది. [29] పూణెలో 260,000 చదరపు అడుగుల మిలిటరీ స్థలంలో పదవీ విరమణ భవనాన్ని ప్రభుత్వ నిధుల నుండి నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్లు ఆరోపించబడింది. సాంప్రదాయికంగా భారత రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి న్యూఢిల్లీలో ప్రభుత్వ కల్పించిన వసతి గృహంలో గానీ లేదా తన స్వంత రాష్ట్రంలో ఉన్నగృహంలో గానీ ఉండాలి. కానీ ప్రభుత్వ ధనంతో పదవీ విరమణ గృహాన్ని నిర్మాణం చేయడం ఇంతకు ముందు ఎప్పుడూ సంభవించని చర్య. [30] ఆమె పదవీ విరమణ చేసిన తరువాత అధికారిక ప్రభుత్వ కారుకు, తనకు గల ప్రైవేటు కారుకు కూడా ఇంధన అలవెన్సు పొందుతున్నట్లు ఆరోపించబడింది. నిబంధనలలో స్పష్టంగా ఏదో ఒక దానికిమాత్రమే అలవెన్సు తీసుకోవాలని ఉంది. ఆమె తన అధికార పాత్రలో వచ్చిన అనేక బహుమతులు కూడా స్వంతం చేసుకుంది. తరువాత వాటిని బలవంతంగా వెనుకకు తీసుకోవడం జరిగింది.[31]

వ్యాపారాసక్తులు

[మార్చు]

పూణెలోని అమ్రావతి, ముంబైలో ఆమె విద్యా భారతి శిక్షన్ ప్రసారక్ మండలం పేరుతో విద్యా సంస్థలను నెలకొల్పింది. ఆమె న్యూఢిల్లీ, ముంబై, పూణెలలో పనిచేస్తున్నమహిళల కోసం శ్రమ సాధన టస్టు పేరుతో వసతి గృహాలను నెలకొల్పింది. ఆమె జల్గాన్ జిల్లాలో గ్రామీణవిద్యార్థుల కోసం ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించింది.[32] ఆమె ముక్తాయినార్ వద్ద సంత్ ముక్తాబాయి సహకారి శక్కర్ కార్ఖానా పేరుతో ఉన్న సహకార చక్కెర ఫ్యాక్టరీకి సహ వ్యవస్థాపకురాలు. [33]

అదనంగా ఆమె ప్రతిభా మహిళా సహకారి బ్యాంకును స్థాపించింది. ఆ బ్యాంకు లైసెన్స్ ను భారతీయ రిజర్వు బ్యాంకు రద్దు చేయడం వలన ఫిబ్రవరి 2003 న మూసివేయబడింది. ఆ బ్యాంకులో ఆమె బంధువులకు అక్రమ ఋణాలను ఆ బ్యాంకు మూలధనం కంటే ఎక్కువగా ఇచ్చినందున ఆ బ్యాంకు లైసెన్స్ ను రద్దు చేసారు. ఈ బ్యాంకు నుండి తన స్వంత చక్కెర ఫ్యాక్టరికి కూడా ఋణాలు అందించింది కానీ ఎప్పుడూ తిరిగి డబ్బు చెల్లించలేదు. బ్యాంకు ఈ రుణాలను రద్దు చేసింది. దీని ఫలితంగా లిక్విడేషన్ కు దారితీసింది. 1994 నుండి బ్యాంకు వ్యవహారాలలో పాటిల్ ప్రమేయం లేదని భారత జాతీయ కాంగ్రెస్ తెలియజేసింది. కానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్ ఆమె ప్రమేయం గూర్చి అధికార పత్రాలను 2002 చివరలో చూపాడు.[34]

నిర్వహించిన పదవులు

[మార్చు]

ఆమె జీవితంలో అనేక అధికార పదవులను అలంకరించింది. వాటిలో:[2]

కాలం స్థానం
1967–72 డిప్యూటీ మంత్రి, పబ్లిక్ హెల్త్, ప్రొహిబిషన్, పర్యాటకం, హౌసింగ్, పార్లమెంటరీ వ్యవహారాలు, మహారాష్ట్ర ప్రభుత్వం
1972–74 కేబినెట్ మంత్రి, సాంఘిక సంక్షేమం, మహారాష్ట్ర ప్రభుత్వం
1974–75 కేబినెట్ మంత్రి, పబ్లిక్ హెల్త్, సాఘిక సంక్షేమం, మహారాష్ట్ర ప్రభుత్వం,
1975–76 కేబినెట్ మంత్రి, ప్రొహిబిషన్, రిహేబిటేషన్, సాంస్కృతిక వ్యవహారాలు, మహారాష్ట్ర ప్రభుత్వం,
1977–78 కేబినెట్ మంత్రి, విద్య, మహారాష్ట్ర ప్రభుత్వం.
1979–1980 ప్రతిపక్ష నాయకురాలు, మహారాష్ట్ర శాసన సభ.
1982–85 కేబినెట్ మంత్రి, అర్బన్ డెవలప్‌మెంటు, గృహనిర్మాణం మహారాష్ట్ర ప్రభుత్వం.
1983–85 కేబినెట్ మ్ంత్రి, సివిల్ సప్లయిస్, సాంఘిక సంక్షేమం, మహారాష్ట్ర ప్రభుత్వం.
1986–1988 డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ
1986–88 చైర్మన్, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్, రాజ్యసభ; బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సభ్యురాలు, రాజ్యసభ
1991–1996 చైర్మన్, హౌస్ కమిటీ, లోక్‌సభ
8 నవంబరు 2004 – 2007 జూన్ 23 రాజస్థాన్ గవర్నరు
25 జూలై 2007 – 2012 జూలై 25 భారత రాష్ట్రపతి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Reals, Tucker (21 July 2007). "India's First Woman President Elected". CBS News. Retrieved 2015-07-30.
  2. 2.0 2.1 2.2 2.3 "Ex Governor of Rajasthan". Rajasthan Legislative Assembly Secretariate. Archived from the original on 2013-08-04. Retrieved 2012-06-26.
  3. "Biographical Sketch Member of Parliament X Lok Sabha". Archived from the original on 2007-07-17. Retrieved 2007-10-11.
  4. "Congman's wife drags Pratibha name into allegations, NDA distances itself". The Indian Express. 22 జూన్ 2007. Archived from the original on 30 ఆగస్టు 2008. Retrieved 10 జనవరి 2016.
  5. 5.0 5.1 "Profile: President of India". NIC / President's Secretariat. Archived from the original on 8 February 2012. Retrieved 2012-06-26.
  6. "Court summons brother of Pratibha Patil in murder case". The Indian Express. 8 July 2014. Retrieved 2016-01-10.
  7. Pradhan, Bibhudatta (19 July 2007). "Patil Poised to Become India's First Female President". Bloomberg. Retrieved 2012-07-02.
  8. Ritu Singh (2007). President Pratibha Patil: India's First Woman President. Rajpal & Sons. p. 52. ISBN 978-81-7028-705-6.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 "Profile: Pratibha Patil". BBC. 21 July 2007. Retrieved 2012-06-26.
  10. "Now, a land grab haunts Patil". DNA. 4 July 2007. Retrieved 2016-01-11.
  11. "Prez polls: Sonia announces Pratibha Patil's name". NDTV. 14 June 2007. Retrieved 2012-07-03.
  12. "I will not be a rubber stamp President". Daily News & Analysis. PTI. 16 June 2007. Retrieved 2016-01-11.
  13. "Congman's wife drags Pratibha name into allegations, NDA distances itself". The Indian Express. 22 జూన్ 2007. Archived from the original on 30 ఆగస్టు 2008. Retrieved 10 జనవరి 2016.
  14. "Court dismisses lawsuit against president's brother". Thaindian. IANS. 11 December 2009. Archived from the original on 2016-03-05. Retrieved 2016-01-10.
  15. "Court summons brother of Pratibha Patil in murder case". The Indian Express. 8 July 2014. Retrieved 2016-01-10.
  16. Pradhan, Bibhudatta (19 July 2007). "Patil Poised to Become India's First Female President". Bloomberg. Retrieved 2012-07-02.
  17. 17.0 17.1 17.2 Biswas, Soutik (13 July 2007). "India's muckraking presidential poll". BBC. Retrieved 2012-07-03.
  18. "Indian MPs vote for new president". BBC. 19 July 2007. Retrieved 2012-07-02.
  19. Menon, Meena (26 June 2007). "Shiv Sena backs Pratibha Patil". The Hindu. Archived from the original on 2007-06-29. Retrieved 2014-02-04.
  20. Dhawan, Himanshi (27 June 2007). "Pratibha believes in spirits?". The Times of India. Retrieved 2016-01-11.
  21. "Now, a land grab haunts Patil". DNA. 4 July 2007. Retrieved 2016-01-11.
  22. "For family again: Patil's MP funds for sports complex on land leased to husband society". Indian Express. 6 జూలై 2007. Archived from the original on 12 అక్టోబరు 2007. Retrieved 11 జనవరి 2016.
  23. "First female president for India". BBC. 21 July 2007. Retrieved 2012-07-03.
  24. "President Pratibha Patil's brush with controversy". IBN Live. 12 April 2012. Archived from the original on 2013-09-21. Retrieved 2013-04-14.
  25. "President defends mercy spree to death row convicts". The Times of India. 26 June 2012. Archived from the original on 2013-09-22. Retrieved 2018-05-13.
  26. "President Pratibha Patil goes on mercy overdrive". The Times of India. 22 June 2012. Archived from the original on 2013-06-05. Retrieved 2018-05-13.
  27. "President Patil's foreign trips cost Rs 205 crore". The Indian Express. 26 March 2012. Retrieved 2013-09-21.
  28. Dhawan, Himanshi (3 May 2012). "Pratibha Patil took up to 11 relatives on 18 trips in a year". The Times of India. Archived from the original on 2013-07-24. Retrieved 2016-01-10.
  29. Kshirsagar, Alka (25 June 2012). "Pratibha Patil gets retirement home in Pune". Business Line. Retrieved 2012-06-26.
  30. Joseph, Josy (15 April 2012). "Pratibha's Pune home a break from tradition". The Times of India. Retrieved 2016-01-10.
  31. Satish, D. P. (29 July 2015). "Former President Pratibha Patil wants both car & fuel from government". IBN Live. Archived from the original on 2016-01-26. Retrieved 2016-01-11.
  32. "Pratibha Patil's Resume". The Times of India. 19 July 2007. Archived from the original on 2013-08-18. Retrieved 2016-01-11.
  33. "Pratibha-founded sugar unit owes bank Rs 17.70 cr". Hindustan Times. 30 September 2007. Archived from the original on 30 సెప్టెంబరు 2007. Retrieved 14 నవంబరు 2021.
  34. "Report on Trend and Progress of Banking in India, 2005–06: Appendix Table IV.3: Urban Co-operative Banks Under Liquidation" (PDF). Reserve Bank of India. p. 328 (5). Retrieved 2012-07-05.

బయటి లంకెలు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
లోక్‌సభ
అంతకు ముందువారు
సుదం దేశ్‌ముఖ్
పార్లమెంటు సభ్యులు
ఆమ్రావతి నియోజకవర్గం

1991–1996
తరువాత వారు
అనంత్ గుధే
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
మదన్ లాల్ ఖురానా
రాజస్థాన్ గవర్నర్
2004–2007
తరువాత వారు
అక్లకుర్ రహ్మాన్ కిద్వాయ్
అంతకు ముందువారు
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
భారత రాష్ట్రపతి
2007–2012
తరువాత వారు
ప్రణబ్ ముఖర్జీ